Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
మీ పిల్లలకు ఇష్టమైన 5 ఫ్రెండ్లీ పెట్స్
సాధారణంగా మన ఇల్లలో చిన్న పిల్లలు కానీ, లేదా పెట్స్(పెంపుడుజంతువులు) కానీ ఉన్నాయంటే చాలా సంతోషంగా ఉంటుంది. వారితో ఉంటే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. పెట్స్ అంటే పెద్దలకే కాదు, చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టం. అంతే కాదు, పెట్స్ తో మాట్లాడుతారు, ఆడుకుంటారు, పరుగెడుతారు. ఇంకా వాటి ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటారు. అందుకే మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వారికి ఇష్టమైన పెట్స్ ను వారె ఎంపిక చేసుకొనే అవకాశం ఇవ్వండి. అంది వారి విలువైరన జీవితంలో ఒక పాఠం వంటిది మరియు వారికి ఇష్టంగా సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఆ పెట్స్ ఎంతో సహాయపడుతాయి. పెంపుడు జంతువుల వద్ద విశ్వసనీయత మరియు బాధ్యత గురించి తెలుసుకోవడానికి పెట్స్ ఫర్ ఫెక్ట్ టీచర్స్ వంటివి.
పెట్స్ అంటే పిల్లలకు ఎల్లప్పుడు చాలా ఇష్టమైనవి. పెట్స్ కూడా పిల్లలకు ఇష్టమైనట్లే నడుచుకుంటాయి, పిల్లలను ఆడిస్తాయి, జాగ్రత్త చూసుకుంటాయి. కాబట్టి మీ పిల్లలకు పెట్స్ ను కొనివ్వాలనుకొన్నప్పుడు, మొదట మీరు చేయవల్సిన పని, మీ పిల్లలకు ఇష్టమైన వివిధ రకాల పెట్స్ ను లిస్ట్ వ్రాసుకోండి. తర్వాత కొనడానికి ప్లాన్ చేసుకోండి. ఒక వేళ మీ పిల్లల లిస్ట్ ప్రకారం, మీలో పిల్లలకు ఏ పెట్స్ అయితే సూటబుల్ గా ఉంటాయి అని గందరగోళంలో ఉంటే మాత్రం ఈ క్రింద స్లైడ్ లో మీరు మీ ఇంటికి, మీ పిల్లలకు ఇష్టమైన ఈ పెట్స్ ను ఎంపిక చేసుకొని, కొనుక్కోవచ్చు.

గినియా పిగ్:
గినియా పిగ్, ఒక కిడ్స్ ఫ్రెండ్లీ పెట్. ఇవి వివిధ కలర్స్ మరియు పాట్రన్స్ లాంగ్ లేదా షార్ట్ హెయిర్ కలిగినవి మనకు దొరుకుతాయి. వీటి జీవిత కాలం 5-10సంవంత్సరాలు. చాలా తేలికగా ఇంటికి తెచ్చుకొని హోమ్లీగా పెంచుకోవచ్చు .వీటికి చాలా సులభంగా పెంచుకోవచ్చు, వీటికి విటమిన్ సి ఆహారాలు, తాజాగా కూరగాయలు, నీళ్ళు వీటి ఆహారం. అంతే కాదు వీటి బరువు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి, మీ పిల్లలు వీటిని ఎత్తుకొని కూడా ఆడుకోవచ్చు.

హ్యామ్స్టర్లు:
హ్యామ్స్టర్లు కూడా పాకెట్ పెట్స్ గా చెబుతుంటారు. ఎందుకంటే వీటి సైజు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పెట్స్ . చాలా అందంగా తెల్లనొ బొచ్చుకలిగి ఉంటాయి. ఇవి కిడ్స్ ఫ్రెండ్లీ పెట్స్ కూడా. వీటికి పెల్లెట్స్, చీజ్, తాజా పండ్లు మరియు కూరగాయలను, నీళ్ళు, ఆహారంగా ఇవ్వొచ్చు.

జెకోస్:
జెకోస్ కూడా కిడ్స్ ఫ్రెండ్లీ పెట్స్ లిస్ట్ క్రిందికి వస్తుంది. ఎందుకంటే ఇవి చూడటానికి చాలా చిన్నగా ఉన్నా ప్రకృతిలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటాయి. వీటి జీవితకాలం 20ఏళ్ళు. వీటికి ఆహారం, నీళ్ళు, కీటకాలు.

కుందేళ్లు:
కుందేళ్ళు నిజంగానే కిడ్స్ ఫ్రెండ్లీ పెట్సే. వీటిలో కుక్క మరియు పిల్లలో ఉండే క్వాలిటీస్ ఉంటాయి . కుందేళ్ళు వివిధ సైజుల్లో మనకు దొరుకుతాయి. వాటి బరవుకూడా చాలా తక్కువ, పిల్లలు వీటితో బాగా పరిగెత్తవచ్చు. మరియు ఆడుకోవచ్చు. వీటి జీవిత కాలం 5ఏళ్ళు. వీటికి ఇతర జంతువుల నుండి ఎన్విరాన్మెంటల్ ప్రొటక్షన్ కల్పించాలి.

చిలక:
కిడ్స్ ఫ్రెండ్లీ పెట్స్ విషయానికొస్తే, ఇవి సరదాగా మరియు ఉల్లాసంగా పెంచుకొనే చిలుకలు మాత్రమే కాదు, ట్రైనింగ్ ఇస్తే ఇవి చాలా అందంగా మాట్లాడగలవు, పాడగలవు. చిలకల్లో 350 రకాలు వివిధ రంగులను కలిగి ఉన్నాయి. వీటిని పెంచుకోవాలంటే చాలా మందికి ఇష్టం. వీటికి నీళ్ళు, గింజలు, పప్పులు, తాజా పండ్లు, కూరగాయ ముక్కలు వీటి ఆహారం. మూడు సంవత్సరాల పిల్లలకు కిడ్స్ ఫ్రెండ్లీ పెట్స్ గా వీటిని పరిచయం చేయవచ్చు.



Click it and Unblock the Notifications