For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెంపుడు కుక్కలకు ముసలితనం: జాగ్రత్తలు

|

కుక్కలకు కూడా వయస్సు పెరుగుతుంది. అవి కూడా ముసలి తానానికి చేరుకుంటాయి. మీ కళ్ళ ముందే మీ పెంపుడు కుక్కు ముసలితనం దశకు చేరుకొంటున్నప్పుడు, మీ మనస్సులు వాటి సంరక్షణ గురించి కొన్ని ఆలోచనలు మొదలవుతాయి. మీరు ముఖ్యంగా కొన్ని సీనియర్ డాగ్స్ (వయస్సైపోతున్నకుక్కల)గురించి కొంచెం అదనపు సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి. వాటికి ఏం కావాలో తెలుసుకోవడంతో పాటు అవి తినే ఆహారాల మీద కూడా మరికొంత శ్రద్ద పెట్టాలి.

వయస్సైపోతున్న పెంపుడు కుక్కలు కూడా బలహీనంగా మారుతాయి. అవి ఏదైనా ప్రమాధానికి గురైనప్పుడు, లేదా వయస్సు అయ్యే కొద్ది వాటిలో కూడీ కీళ్ళ నొప్పులకు దారితీస్తుంది. కాబట్టి, వాటికి కూడా కొద్దగా వ్యాయామాలు లేదా ఫిజిక్ యాక్టివిటీలస్ చేయించడం చాలా ముఖ్యం. అందుకు వయస్సైపోతున్న మీపెంపుడు కుక్క కోసం తీసుకోవల్సి జాగ్రత్తలు కొన్ని ఇక్కడ ఇస్తున్నాం..

Tips To Care For Old Dogs

ఆహారం: మీ పెంపుడు కుక్క యొక్క వయస్సు పెరిగే కొద్ది, ముసలితనం చేరుకొనేటప్పుడు, తేలికగా మరియు జీర్ణం అయ్యే ఆహారాలను పెట్టడం మంచిది. లోప్రోటీన్ డైట్ ను ఎంపిక చేసుకోండి. అలాగే కొన్ని ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను జోడించి వాటికి ఆహారంగా అందివ్వాలి. అందవల్ల వస్సైపోతున్న కుక్కల్లో మలబ్దకం అనే సమస్య ఉండదు. వాటికి అందించే ఆహారంలో విటమిన్ ఇ మరియు బీటా కెరోటిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అందివడం వల్ల సీనియర్ డాగ్స్ వాటి వ్యాధినిరోధక శక్తిని పొందుతాయి. దాంతో జీవక్రియలు ఆరోగ్యకరంగా ఉంటాయి.

డాక్టర్ ను సంప్రదించాలి: రెండు సంవత్సరాలకొకసారైనా మీ పెంపుడు కుక్కకు బ్లడ్ టెస్ట్ చేయించాలి ప్రతి ఒక కుక్క వయస్సైయ్యే కొద్ది డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి, వెటర్నరీ డాక్టర్స్ ను కలిసి అప్పుడప్పుడు చెక్ చేయిస్తుండాలి. రెండు సంవత్సరాలకొకసారి అలా చేయడం వల్ల కుక్కలు వయస్సైయ్యే కొద్ది మరింత బెటర్ హెల్త్ ను పొందుతాయి.

గేమ్స్: పెంపుడు కుక్కలను వాకింగ్ తీసుకుపోవడంతో పాటు, వాటిని చురుకుగా ఉండేట్లు చేయాలి . మీ పెంపుడు కుక్కలకు కొన్ని కొత్త ఆటలను ఆడిపించాలి. ముఖ్యంగా అవి కొత్త గేమ్స్ ను నేర్చుకోవడానికి ఇష్టపడుతాయి, అందుకోసం కొంత సమయం పడుతుంది. వయస్సైపోతున్న పెంపుడు కుక్కలను ఇలా ఒక కొత్త గేమ్స్ లో పాల్గొనేలా చేయడం వల్ల వాటిని యాక్టివ్ గా ఉంచవచ్చు.

బరువు చెక్ చేయాలి: వయస్సైపోతున్న కుక్కలు ఊబకాయానికి గురి అవుతాయి. అది వాటిలో నొప్పులను పెంచుతాయి మరియు కీళ్ళవాపులు నొప్పులు మొదలవుతాయి. కాబట్టి, వయస్సైపోతున్న పెంపుడు కుక్కల యొక్క బరువును ట్రాక్ చేయండం మంచిది. తర్వాత ముందు వాటికి వ్యాయామం చేయించడానికి సహాయపడుతుంది. అందువల్ల, పెంపుడు కుక్కలు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండేలా చేయడం చాలా ముఖ్యం.

ప్రవర్తన: ఏజింగ్ డాగ్స్ అవి మరింత నెమ్మదిగా మారడం లేదా మరింత చురుకుగా మారడం జరుగుతుంది . మరి మీ ఏజింగ్ డాగ్ గురించి రక్షణ తీసుకోవడానికి ఒక సౌకర్యవంతమైన ప్రదేశంలో ఉంచాలి. వాటికి ఎక్కడ సౌకర్యంగా మరియు సంతోషంగా ఉండగలుగుతాయో అక్కడ ఉంచాలి.

English summary

Tips To Care For Old Dogs

Even the dogs grow old. When you see your dog becoming old in front of you, you only feel that the parenting nature is increasing inside you. You have to actually take extra care of senior dogs. Apart from understanding the needs of an ageing dog, you also need to pay attention to their diet.
Desktop Bottom Promotion