For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతక రేబిస్ వ్యాధికి: కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ మరియు చికిత్స

|

రేబిస్ లిసావైరస్ వల్ల కలిగే, రేబిస్ అనేది కుక్కలు, పిల్లులు, కోతులు, గబ్బిలాలు మరియు మానవులతో సహా అన్ని క్షీరదాల మెదడు మరియు వెన్నుపామును ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. భారతదేశంలో రేబిస్ ఇప్పటికీ ఉంది. ఈ వ్యాధికి కారణం ప్రధాన కారణం కుక్క . అది పెంపుడు కుక్కల్లో కంటే వీది కుక్కల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వల్ల 50,000 మందికి పైగా మానవులు మరియు మిలియన్ల సంఖ్యలో కుక్కల మరణాలు సంభవిస్తున్నాయి.

Rabies In Dogs: Causes, Symptoms, Diagnosis And Treatment,

ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్, అమెరికా మరియు ఆసియాలో చాలా భాగాలతో సహా ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో రేబిస్ ప్రబలంగా ఉంది. జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవులు, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు పాపువా న్యూ గినియాలో రేబిస్ సాధారణం కాదు.

కుక్కలలో రేబిస్ కి కారణాలు

కుక్కలలో రేబిస్ కి కారణాలు

రేబిస్ ఉన్న కుక్కలు తమ లాలాజలంలో పెద్ద మొత్తంలో వైరస్ను విడుదల చేస్తాయి. రేబిస్ సోకిన కుక్క నుండి కాటు ద్వారా రేబిస్ ఇతర కుక్కలకు వ్యాపిస్తుంది. ఇది స్క్రాచ్ ద్వారా లేదా లాలాజలం బహిరంగ రావడం లేదా తాజా గాయంతో ద్వారా బయటకు స్రవించే ద్రవాలకు సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఇది వ్యాపిస్తుంది.

ప్రమాధకరమైన కుక్కల ద్వారా పెంపుడు కుక్కలకు కూడా త్వరగా వ్యాప్తి చెందితే అధిక ప్రమాదం ఉంది.

కుక్కలలో రేబిస్ వ్యాధి లక్షణాలు

కుక్కలలో రేబిస్ వ్యాధి లక్షణాలు

 • ప్రశాంతత లేదా భయం వంటి ప్రవర్తనా మార్పులు లేదా ఎవ్వరిని చూసినా అరుస్తూ మీదకు దూకడానికి, కరవడానికి దారితీయవచ్చు.
 • కుక్క చికాకు సంకేతాలను చూపవచ్చు.
 • ఫీవర్
 • కుక్క ఇతర జంతువులపై మరియు మానవులపై దాడి చేయడంలో కొరుకుతుంది లేదా స్నాప్ చేయవచ్చు.
 • ఉత్తేజంగా కనిపించే కుక్క మరింత వినయంగా కనబడుతుంది.
 • కుక్క కరిచిన ప్రదేశంలో అది అదే పనిగా నాకడం, కొరకడం మరియు నమలడం చేస్తుంది.
 • రెబిస్ సోకిన కుక్క మరింత చురుకుగా స్పర్శ మరియు ధ్వనికి హైపర్సెన్సిటివ్ గా మారుతుంది.
 • కుక్క చీకటి ప్రదేశాల్లో దాక్కుంటుంది మరియు అసాధారణమైన వస్తువులను తింటుంది.
 • గొంతు మరియు దవడ కండరాల పక్షవాతం, ఫలితంగా నోటి వద్ద నురుగు వస్తుంది.
 • ఆకలి లేకపోవడం
 • బలహీనత
 • మూర్ఛలు
 • ఆకస్మిక మరణం
 • ఈ వైరస్ కుక్కలో ఉండే కాలం రెండు నుండి ఎనిమిది వారాల వరకు ఉంటుంది. ఏదేమైనా, లాలాజలం ద్వారా వైరస్ వ్యాపించే లక్షణాలు కనిపించడానికి పది రోజుల ముందు సంభవిస్తుంది.
కుక్కలలో రేబిస్ వ్యాధికి ప్రమాద కారకాలు

కుక్కలలో రేబిస్ వ్యాధికి ప్రమాద కారకాలు

టీకాలు తీసుకోని మరియు పర్యవేక్షణ లేకుండా ఆరుబయట తిరుగుతున్న కుక్కలు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. వీటి ప్రభావం వీధికుక్కులపై ఎక్కువగా ఉంటుంది. ఇది విచ్చలవిడిగా కుక్కలకు లేదా పిల్లులకు కూడా సోకుతుంది.

కుక్కలలో రేబిస్ నిర్ధారణ

కుక్కలలో రేబిస్ నిర్ధారణ

కుక్కలలో రేబిస్‌ను నిర్ధారించడానికి ప్రత్యక్ష ఫ్లోరోసెంట్ యాంటీబాడీ పరీక్షను ఉపయోగిస్తారు. కానీ జంతువు మరణించిన తరువాత మాత్రమే పరీక్ష చేయవచ్చు, ఎందుకంటే దీనికి మెదడు కణజాలాలు అవసరం, బ్రెయిన్ స్టెమ్ మరియు సెరెబెల్లమ్ అవసరం. పరీక్షకు 2 గంటల సమయం పడుతుంది.

రేబిస్ చికిత్స

రేబిస్ చికిత్స

కుక్కలలో రేబిస్‌కు చికిత్స లేదా నివారణ లేదు. ఈ వ్యాధి ఉన్నట్లు అనుమానించబడిన కుక్కలు చాలా తరచుగా అనాయాసానికి గురవుతాయి.

రేబిస్‌ను ఎలా నివారించవచ్చు?

రేబిస్‌ను ఎలా నివారించవచ్చు?

మీరు మీ కుక్కకు టీకాలు వేయించడం మరియు మీ కుక్కకు సరైన టీకా గురించి మీ పశువైద్యుని సంప్రదించి అడిగి తెలుసుకోవడం చాలా అవసరం. అన్ని పెంపుడు కుక్కలు మరియు పిల్లులకు 3 నెలల వయస్సు తర్వాత టీకాలు వేయడం తప్పనిసరి. వాటికి పుట్టినప్పటి నుండి1 సంవత్సరంలోపు బూస్టర్ అవసరం మరియు వాటికి సాధారణంగా ప్రతి 3 సంవత్సరాలకు టీకాలు వేయించాలి.

పెంపుడు కుక్కలను బయట కుక్కలతో కలవనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కుక్కలలో రేబిస్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

కుక్కలలో రేబిస్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

ప్ర) మీ కుక్క రెబిస్ సోకిన జంతువు కరిచినట్లయితే మీరు ఏమి చేయాలి?

జ) వెంటనే మీ పశువైద్యుడిని సంప్రదించండి. రేబిస్ వైరస్ మీ పెంపుడు జంతువుల చర్మంపై రెండు గంటల వరకు సజీవంగా ఉండటంతో మీ కుక్కను తాకవద్దు. చేతికి గ్లౌజులు మరియు రక్షణ దుస్తులను ధరించి మీ కుక్కను వైద్యుడి వద్దకు తీసుకెళ్లండి.

ప్ర) కుక్క రేబిస్‌ను తట్టుకోగలదా?

జ) రేబిస్‌కు చికిత్స లేదు మరియు ఇది ప్రాణాంతకం. రెబిస్ సోకిన జంతువు సాధారణంగా క్లినికల్ సంకేతాలు కనిపించిన ఐదు రోజుల్లో చనిపోతుంది.

ప్ర) టీకాలు వేసినా కుక్కకు రేబిస్ రాగలదా?

జ) ఒక వేళ కుక్క టీకా రికార్డు ప్రస్తుతానిది కాకపోతే, రేబిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

English summary

Rabies In Dogs: Causes, Symptoms, Diagnosis And Treatment

Caused by the Rabies lyssavirus, rabies is a viral infection that affects the brain and spinal cord of all mammals, including dogs, cats, monkeys, bats and humans. The dog has been and still is the primary cause of rabies in India [1] . Annually, more than 50,000 humans and millions of animals deaths are caused by rabies worldwide.
Story first published: Friday, September 27, 2019, 15:49 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more