For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎందుకు గణపతి చింతామణి గా పేరుగాంచాడు?

By Super
|

గణపతి జ్ఞాన దేవత. ఈయన మంచి తెలివితేటలను ఇచ్చేవారిలో ఒకరు. గణపతి ని ‘విఘ్నహర్త’ అని కూడా అంటారు, అంటే కష్టాలను తొలగించేవాడు అని అర్ధం. గణపతి ని ఎందుకు ‘చింతామణి’ అంటారో చూద్దాం.

ఒకానొకప్పుడు గణ్ అనే క్రూర రాజు ఉండేవాడు. అతను పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం, ధ్యానం చేసే సాధువులకు కష్టాలు కలిగించడం చేసేవాడు. ఒకసారి, అతను తన స్నేహితులతో కలిసి వేటకు అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో కపిల అనే సాధువు కుటీరం ఉంది. ఆ సాధువు గణ్ ని అతని స్నేహితులను భోజనానికి పిలిచాడు. గణ్ కపిల సాధువు కుటీరం చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, “నువ్వు ఇంత పేద సాదువువి ఇంతమందికి భోజనం ఏర్పాటు చేస్తావా?” అని. వెంటనే, ఆ సాధువు ‘చింతామణి’ (కోరికలను తీర్చే రాయి) ని అతని గొలుసు నుండి తీసి, దానిని ఒక చిన్న చెక్క బల్లపై ఉంచాడు. అతను దానిని అభ్యర్ధిస్తూ, ప్రార్ధన చేయగానే అక్కడ ఒక వంటిల్లు ఏర్పడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరూ కూర్చోవడానికి చందనపు ఆసనాలు ఏర్పడ్డాయి, వెండి పళ్ళాలలో ప్రతి ఒక్కరికీ వివిధ రకాల రుచికరమైన భోజనం వద్దించబడింది. గణ్ అతని స్నేహితులు ఈ రుచికరమైన ఆహారాన్ని సంతోషంగా ఆరగించారు.

 How Ganapati came to be known as Chintamani

భోజనం చేసిన తరువాత, గణ్ ఆ కపిల సాధువుని ఆ అద్భుతమైన రాయి ఇమ్మని అడిగాడు, కానీ సాధువు నిరాకరించాడు, అలాగే అతను గణ్ యొక్క క్రూర స్వభావాన్ని తెలుసుకున్నాడు, అందువల్ల, గణ్ సాధువు చేతులో నుండి ఆ రాయిని లాక్కున్నాడు.

ఆ తరువాత, కపిల సాధువు గణపతిని ప్రార్ధించాడు. ఆ సాధువు భక్తికి మెచ్చి గణపతి గణ్ ను శిక్షించాలని నిర్ణయించుకున్నాడు. గణ్ ఆ రాయిని వెనక్కు తీసుకోవడానికి కపిల్ సాధువు అతనితో పోరాదతదని అనుకుని, ముందే కపిల సాధువుపై ఆక్రమణ చేసాడు. గణపతి దయవల్ల, ఆ అడవిలో ఒక పెద్ద సైన్యం తయారయి, గణ్ సైనికులను దాదాపు నాశనం చేసింది. వెంటనే గణపతి స్వయంగా యుద్ధానికి ప్రవేశించాడు. గణ్, గణపతి పై బాణాల ప్రవాహాన్ని సంధించాడు; కానీ గణపతి ఆ బాణాలను గాలిలోనే నాశనం చేసాడు. వెంటనే గణపతి తన పరశు (గణపతి ఆయుధం) ని గణ్ పై సంధించి అతనిని చంపాడు. గణ్ తండ్రి అభిజీత్ రాజు, యుద్ధ భూమికి వచ్చి గణపతి ముందు తలాడించాడు. అతను ‘చింతామణి’ ని కపిల సాదువుకి ఇచ్చి, అతని తప్పులను క్షమించి మరణానంతరం మోక్షాన్ని ఇవ్వమని కోరాడు. గణపతి దేవుడు అతని ప్రార్ధనను మన్నించాడు.

గణపతి సహాయంతో కపిల సాధువు తన చింతామణి ని పొందడం వల్ల గణపతి కి ‘చింతామణి’ అనే పేరు వచ్చింది.

Story first published: Wednesday, May 14, 2014, 14:52 [IST]
Desktop Bottom Promotion