For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభాలను..విజయాలను ప్రసాదించే స్వస్తిక్ చిహ్నం

|

శుభప్రదం స్వస్తిక్‌ చిహ్నం. ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్‌ చిహ్నాలు గీస్తుంటారు. దీనికి శుభసమయాల్లో చాలా ప్రాధాన్యం వుంది. స్వస్తిక్‌ అంటే శుభం జరగటం. విశేష సమయాల్లో స్వస్తిక్‌ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతం అవుతాయనే విశ్వాసం వుంది. విఘ్నహర్త అయిన గణేశునికి ప్రతీక అయిన చిహ్నం కనుకనూ, దీన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ స్వస్తిక్‌ చిహ్నం సూర్యభగవానుని గతిని సూచిస్తుందనీ అంటారు. అందుచేత అది పురాతనకాలంలో సూర్యపూజలకు చిహ్నంగానూ వుండేదట. దీన్ని శ్రీమహాలక్ష్మీదేవికి ప్రతీకగానూ చెబుతారు. దీపావళి రోజున కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించే వ్యాపారులు, ఈ చిహ్నాన్ని గీస్తారు. తమ వ్యాపారాలకు గణపతి కాపుగా వుండాలనిట. దీపావళికే కాకుండా, షష్ఠి పూజల్లోనూ స్వస్తిక్‌ గీస్తారు. ఉత్తరాదివారి వివాహాలలో, వధూవరుల నుదుట ఈ చిహ్నం వుంటుంది. వారి దాంపత్యజీవితాలు సుఖమయంగా జరగాలనీ, జరుగుతాయనీ సూచన.

స్వస్తిక్ ... ఇది ఎడమ నుంచి కుడికి తిరుగుతున్నట్టుగా కనిపిస్తూ, కాలచక్రంలా అనిపిస్తూ వుంటుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో 'ఓం' అనే ముద్రకి ఎంతటి ప్రాముఖ్యత వుందో, 'స్వస్తిక్' ముద్రకు సైతం అంతే ప్రాధాన్యత వుంది. పూజా మందిరాల్లో 'ఓం' అనే ముద్రతో పాటుగా 'స్వస్తిక్' ముద్ర కూడా తప్పనిసరిగా కనిపిస్తూ వుంటుంది. దీనిని తడి పసుపుతో రాసి ... కుంకుమ బొట్లు పెడుతూ వుంటారు.

Religious Significance Of Swastika

వినాయకుడి పూజా విధానంలో స్వస్తిక్ ముద్ర మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక ప్రత్యేక పూజల సమయంలో కలశ స్థాపన చేసేటప్పుడు, ముందుగా పీఠంపై స్వస్తిక్ ముద్రను దిద్దడం జరుగుతుంది. అలాగే చాలామంది తమ ఇంటికి రక్షణగా గుమ్మంపైనగానీ, పక్కనే గాని స్వస్తిక్ ముద్రను గీస్తుంటారు. వాస్తుపరమైన దోషాలను సైతం స్వస్తిక్ ముద్ర నివారిస్తుందని భావిస్తుంటారు. ఇక ఇళ్లలోనే కాదు ఆధునీకతకు అద్దంలా కనిపించే ఆఫీసుల్లోనూ, శుభం - లాభం అనే మాట కనిపించే వ్యాపార సంస్థలలోనూ స్వస్తిక్ ముద్ర కనిపిస్తూ వుంటుంది.

స్వస్తిక్ ముద్ర శుభాలను ... విజయాలను ప్రసాదిస్తూ ఉంటుందనే నమ్మకం ప్రాచీనకాలం నుంచి వుంది. స్వస్తిక్ ని పూజించడమంటే కాలచక్రాన్ని పూజించడమేననీ, కనికరించమని కాలాన్ని వేడుకోవడమేనని చాలామంది విశ్వసిస్తూ వుంటారు. ఈ కారణంగానే స్వస్తిక్ ముద్ర అపసవ్యంగా లేకుండా అంతా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు. స్వస్తికి ముద్ర వ్యతిరేక దిశలో గనుక ఉన్నట్టయితే, ప్రతి విషయంలోనూ వ్యతిరేక ఫలితాలను చూడవలసి వస్తుందని అంటారు. ఆశించిన ఫలితాలు తారుమారుకాకుండా ఉండాలంటే, స్వస్తిక్ ముద్ర సవ్యంగా ఉండేలా చూసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

English summary

Religious Significance Of Swastika

Right after the star of David comes the Hindu religious symbol, the swastika. It was borrowed and misused by Hitler as a symbol of his Nazi party. It is a actually a Hindu religious symbol of peace and prosperity. It is drawn with vermilion on kalash (holy pots) and outside homes.
Story first published: Wednesday, June 11, 2014, 16:45 [IST]
Desktop Bottom Promotion