For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తిరిగి ఇవ్వవలసిన బహుమానం...

|

The Gift To Be Returned
అనగనగా ఓ యోధుడు ఉండేవాడు . వృధుడు అయినప్పటికీ ఎలాంటి ప్రత్యర్ధినైన ఓడించగలిగే వాడు. అతని కీర్తి భూ మండలం అంత దసదిశాల వ్యాపించడంతో అతని దగ్గర శిక్షణ పొందడానికి విద్యార్థులు తరలివచ్చేవారు. ఒకనాడు ఓ తుంటరి యువ యోధుడు ఆ గ్రామానికి వచ్చాడు. ఆ గురువుగారిని మొదటి సారిగా తనే ఓడించాలనే పట్టుదలతో ఉన్నాడతను. తన బలంతో పాటుగా అతనికి ప్రత్యర్థి లోని బలహీనతలను కనుగొని దెబ్బ తీయగల నైపుణ్యం కూడా వుండేది. ప్రత్యర్థి తోలి ఎత్తు వేసేదాకా ఆగి, వేసాక అతని బలహీనతను బయటపడనిచ్చి, మెరుపు వేగం తోనూ నిర్దాక్షిణ్యమైన బలంతోనూ దెబ్బ తీసేవాడు.

అతనితో జరిగే పోరాటాల్లో ప్రత్యర్ధులు ఎవరూ తొలి పోరు దాటి నిలిచే వారు కాదు. కంగారు పడుతున్న తన శిష్యుల మాట వినకుండా వృద్ధ యోధుడు, ఈ యువకుడి సవాలుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ బరిలోకి దిగగానే, యువకుడు వృద్ధ యోదునిపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టాడు. ఆయన పైన బురద చల్లాడు, మొహం మీద ఉమ్మేశాడు. కొన్ని గంటల పాటు ఆయన్ను ప్రపంచానికి తెలిసిన నానా రకాల శాపనార్ధాలు పెట్టి, అవమానించాడు.

అయినా, వృద్ధ యోధుడు ప్రశాంతంగా నిశ్చలంగా నించున్నాడు. చివరికి యువ యోధుడు అలిసిపోయి, ఓడిపోయానని అర్ధమయ్యి సిగ్గుతో వెనుతిరిగాడు. యువ యోదునితో తమ గురువుగారు పోరాడలేదని కొంత నిరాశపడ్డ శిష్యులు ఆయన చుట్టూ చేరి అడిగారు "ఇలాంటి అవమానాన్ని మీరు ఎలా సహించారు? అయినా అతన్ని వెనక్కి ఎలా పంపించారు?". "మీకు ఎవరైనా బహుమానం ఇవ్వాలని వస్తే, మీరు తీసుకోక పొతే, ఆ బహుమానం ఎవరికీ చెందుతుంది" అని గురువుగారు ఎదురు ప్రశ్న వేశారు.

English summary

The Gift To Be Returned | తిరిగి ఇవ్వవలసిన బహుమానం...

There once lived a great warrior. Though quite old, he still was able to defeat any challenger. His reputation extended far and wide throughout the land and many students gathered to study under him.
Story first published:Saturday, September 1, 2012, 16:45 [IST]
Desktop Bottom Promotion