For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tortoise Vastu Tips: ఇంట్లో తాబేలు పెంచుకోవచ్చా? విగ్రహం పెట్టుకుంటే ఏ వైపున ఉంచాలి?

|

Tortoise Vastu Tips: చాలా మంది ఇళ్లలో, దుకాణాలు, కార్యాలయాల్లో తాబేలు బొమ్మలను పెట్టుకుంటారు. కొందరు ఇళ్లలో తాబేళ్లను పెంచుకుంటారు. హిందూ మతం ప్రకారం తాబేలును ఆధ్యాత్మిక జీవిగా పరిగణిస్తారు. తాబేలు దీర్ఘాయువును, శాంతిని సూచిస్తుందని నమ్ముతారు.

Tortoise Vastu Tips, Where to place turtle statue home in Telugu

ఇంట్లో తాబేలు పెంచుకోవడం వల్ల కుటుంబసభ్యులు ఎక్కువ కాలం జీవిస్తారని హిందువులు విశ్వసిస్తారు. తాబేలు విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే ప్రతికూల శక్తుల నుండి కుటుంబసభ్యులను రక్షిస్తుందని నమ్మకం. చాలా మంది తాబేలును పెంచుకోవడం, కుదరని వాల్లు తాబేలు విగ్రహాలను పెట్టుకోవడం చాలా మంది చూసే ఉంటారు.

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహం పెడితే కలిగే ప్రయోజనాలు, ఏ దిక్కున పెట్టాలి, ఓ లోహపు విగ్రహాన్ని పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. తాబేలును పెంచుకోవడం, విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు:

1. తాబేలును పెంచుకోవడం, విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు:

* ఇంట్లో తాబేలు పెంచుకున్నా లేదా తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెంచుకున్నా.. అనేక ప్రయోజనాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. తాబేలు బొమ్మలు సానుకూలతను ఆకర్షిస్తాయి. ప్రతికూల శక్తి నుండి ఇంటిని రక్షిస్తాయి.

* మీరు నీటిలో తాబేలు బొమ్మను ఉంచినట్లయితే అది సానుకూల ప్రభావాన్ని రెట్టింపు చేస్తుంది.

* పడకగదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు.

* చిన్న కృత్రిమ జలపాతం వద్ద ఫిష్ ట్యాంక్ దగ్గర తాబేలు బొమ్మను ఉంచవచ్చు. దీని వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.

* కెరీర్ సక్సెస్ కోసం మీ ఇంట్లో లేదా ఆఫీసులో తాబేలును ఉంచుకుంటే కచ్చితంగా విజయం సాధిస్తారని వాస్తు శాస్త్రం చెబుతోంది.

2. లోహపు తాబేలు

2. లోహపు తాబేలు

లోహంతో చేసిన తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉంచాలి. తాబేలును ఉత్తరాన ఉంచితే పిల్లల జీవితంలో అదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే చదువుపై ఏకాగ్రత ఉంటుంది. వాయువ్య దిశలో ఉంచితో పిల్లల్లో జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

3. ఆడ తాబేలు

3. ఆడ తాబేలు

కొన్ని తాబేలు విగ్రహాలు ఒంటరిగా ఉంటే మరికొన్ని చిన్న చిన్న తాబేల్లతో పాటు ఉంటాయి. వాటిని ఆడ తాబేలు అనుకోవచ్చు. ఆడ తాబేలు విగ్రహంతో పాటు చిన్న చిన్న తాబేలు విగ్రహాలను ఇంట్లో ఉంచుకుంటే కుటుంబంలో ఎలాంటి వివాదాలు తలెత్తవు.

4. చెక్క తాబేలు

4. చెక్క తాబేలు

వాస్తు శాస్త్రం ప్రకారం చెక్క తాబేలును తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు అణచివేయబడతాయి. జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.

5. స్పటిక తాబేలు

5. స్పటిక తాబేలు

స్పటిక తాబేళ్లు నైరుతి, వాయువ్య దిశల్లో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్పటిక తాబేలు విగ్రహాలను నైరుతి దిశలో ఉంచడం వల్ల డబ్బు ప్రవాహం పెరుగుతుంది.

6. ఎప్పుడు ఉంచాలి

6. ఎప్పుడు ఉంచాలి

మీ ఇంట్లో కొత్తగా తాబేలు విగ్రహాలను పెట్టాలనుకుంటే అందుకు అనువైన రోజులు బుధవారం, గురువారం, శుక్రవారం. కుంకుమ, పసుపు, పూలు సమర్పించి తాబేలు విగ్రహాన్ని ఉంచాలి.

7. తాబేలు విగ్రహాన్ని ఎలా ఉంచాలంటే..

7. తాబేలు విగ్రహాన్ని ఎలా ఉంచాలంటే..

తాబేలు విగ్రహాన్ని నీటిలో ఉంచడంలో వల్ల రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయి. నీటిలో రంగు రాళ్లను కూడా ఉంచవచ్చు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తాబేలును ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించవు.

Read more about: vastu tips
English summary

Tortoise Vastu Tips, Where to place turtle statue home in Telugu

read on to know Tortoise Vastu Tips, Where to place turtle statue home in Telugu
Story first published:Tuesday, December 6, 2022, 19:10 [IST]
Desktop Bottom Promotion