For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిర్యాదు చేయడానికి రెండు మాటలు :

|

Two Words To Complain-Zen Story
బాగా కఠినమైన క్రమశిక్షణ కలిగిన ఒక మఠం వుండేది. అందరూ మౌనవ్రతం పాటించాలి, ఎవరూ మాట్లాడడానికి అనుమతి వుండేది కాదు. ఐతే ఈ నియమానికి ఒక మినహాయింపు వుండేది. పదేళ్ళ కొకసారి మాత్రం ఆ మఠంలోని సన్యాసులు రెండే రెండు మాటలు మాట్లాడవచ్చు.

మొదటి పదేళ్లు గడిపిన తర్వాత, ప్రధాన సన్యాసి దగ్గరికి వెళ్ళాడు ఒక సన్యాసి.

"పదేళ్లయింది" ప్రధాన సన్యాసి అన్నాడు - "నువ్వు మాట్లాడాలనుకుంటున్న రెండు పదాలు ఏమిటి?"

"పక్క ... గట్టిగా ...." అన్నాడు సన్యాసి. "అవునా" అన్నాడు ప్రధాన సన్యాసి.

మరో పదేళ్ళ తర్వాత సన్యాసి ప్రధాన సన్యాసి కార్యాలయానికి వెళ్లాడు. "మరో పదేళ్లు గడిచాయి - నువ్వు మాట్లాడాలి అనుకుంటున్న రెండు పదాలు ఏవో చెప్పు?" అని అడిగాడు ప్రధాన సన్యాసి.

"భోజనం... వాసన..." అన్నాడు సన్యాసి.

"అవునా" అన్నాడు ప్రధాన సన్యాసి.

ఇంకో పదేళ్లు గడిచాక సన్యాసి మళ్ళీ ప్రధాన సన్యాసిని కలిసాడు. "ఈ పదేళ్లు కూడా గడిచాక నువ్వు మాట్లాడాలనుకునే రెండు పదాలు ఏవో చెప్పు" అన్నాడు ప్రధాన సన్యాసి.
"నేను... వదిలేస్తున్నా..." అన్నాడు సన్యాసి.

"సరే, ఎందుకో నాకు అర్థం అవుతోంది." బదులిచ్చాడు ప్రధాన సన్యాసి "నువ్వు ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూనే ఉంటావు."

English summary

Two Words To Complain-Zen Story | ఫిర్యాదు చేయడానికి రెండు మాటలు :

There once was a monastery that was very strict. Following a vow of silence, no one was allowed to speak at all. But there was one exception to this rule. Every ten years, the monks were permitted to speak just two words. After spending his first ten years at the monastery, one monk went to the head monk. "It has been ten years," said the head monk. "
Story first published:Wednesday, August 1, 2012, 15:53 [IST]
Desktop Bottom Promotion