For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆది శక్తి అంటే ఎవరు?మహాత్యమేంటి

|

శక్తిని పూజించటం లేదా స్త్రీ శక్తి పూజలు హిందూమతంలో చాలా ప్రాచీనకాలం నుండి ఉన్న పద్ధతి . మొహెంజో-దారో మరియు హరప్పా పురావస్తు త్రవ్వకాల్లో, స్త్రీలను పూజించే సంస్కృతి 5,000 సంవత్సరాల క్రితం నుండి భారతదేశంలో ఉన్నది అనటానికి శక్తివంతమైన సాక్ష్యాలు బయటపడ్డాయి.

కాబట్టి, శక్తికి పూజ చేసే సంస్కృతి ఎందుకు వొచ్చింది? అసలు శక్తి అంటే ఏమిటి లేదా ఆది శక్తి ఎవరు? ఎందుకు ఆమె పూజలు చేయాలి ? ఇది హిందూమతంలో స్త్రీ దేవతలను పూజించేపుడు ఒక వ్యక్తి యొక్క మనస్సులో హక్కుతో పలు ప్రశ్నలు చెలరేగుతుంటాయి. ఇక్కడ మనం వాటికి సమాధానాలను తెలుసుకుందాము.

ముందుగా, ఆది శక్తి అంటే 'మొదటి శక్తి ' అని అర్థం. ఇది ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉండే అధిమ శక్తి. ఈ శక్తి కారకం స్త్రీ రూపంలో ఉన్నది. ఇది సృజనాత్మకత, సంతులనం మరియు పూర్తి స్వరూపిణిగా ఉన్నది. శక్తి అనేది ఒక భావన లేదా విశ్వంలో అన్ని జీవులకు ఊపిరి నిచ్చే దివ్య సృజనాత్మక స్త్రీ లింగరూపధారిణి.

రెండవది, శక్తి అంటే సృష్టిఅంతటికి బాధ్యత వహించేది మరియు విశ్వంలో జరిగే అన్ని మార్పులకు ఒక ఏజెంట్ లాగా ఉంటుంది. సమస్త జీవకోటిలో ఆది శక్తి, కుండలిని శక్తి రూపంలో ఉన్నది. ఇది నిగూఢ ఆత్మస్వరూపత్వము గల శక్తి. ఈ శక్తి స్వతంత్రురాలు అయినప్పటికీ విశ్వంతో పరస్పరాధీనత గలది.

కాబట్టి, ఆది శక్తి యొక్క నిజమైన రూపంలో ఎవరున్నారు మరియు ఎందుకు ప్రజలు ఆమెను పూజిస్తున్నారు? తెలుసుకుందాం రండి!

 ఆది శక్తి-స్త్రీ శక్తి

ఆది శక్తి-స్త్రీ శక్తి

హిందూ మతం సాహిత్యం ప్రకారం, మహిళలందరూ ఆది శక్తి యొక్క ప్రతిరూపాలే. ఎందుకంటే మహిళలు సృష్టి యొక్క శక్తి కలిగి ఉన్నారు మరియు మహిళలు లేకుండా భూమిమీద సృష్టి కొనసాగతం కష్టం. ఆది శక్తిని దుర్గా దేవి రూపంలో నిర్గుణ (నిరాకర) మరియు సగుణ (రూపంతో) పూజిస్తారు. భూమిపై జీవకోటి అంతా ఆమె నుండి ఉద్భవిస్తుంది మరియు తిరిగి ఆమెలోనే లీనమవుతున్నది.

శక్తి మరియు శివ

శక్తి మరియు శివ

శక్తి సగుణ రూపంలో శివుడిలో ఐక్యమయినపుడు ఆడి శక్తిగా విశదీకరిమ్పబడింది బ్రహ్మ, విష్ణు మరియు శివుడు ఉద్భవించటానికి మూలాధారం కూడా ఆదిశక్తే ఆది శక్తి (ప్రకృతి) సృష్టి ప్రక్రియ ప్రారంభించడానికి శివ (పురుష) తో కలుస్తుంది. ఆమె శివునిలో సగభాగంగా ఉండి విశ్వసంతులనం కొనసాగించటానికి సహాయపడుతున్నది.

ఆదిశక్తి మానవులలో నివసిస్తుంది

ఆదిశక్తి మానవులలో నివసిస్తుంది

ఆదిశక్తి లేదా విశ్వశక్తి మానవులలో నివాసం ఎర్పరుచుకున్నది. శక్తి యొక్క ఈ శక్తి ప్రతి జీవం జననం నుండి వారిలో దాగి ఉంటుంది మరియు దాని యొక్క అపారమైన శక్తి గ్రహించడం కొరకు దానిని ఉత్తేజపరచటం చాలా అవసరం. తంత్రాలు, యోగ, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అన్నికూడా ఒక వ్యక్తిలో దాగిఉన్న ఈ రహస్య శక్తి మేల్కొలుపు కొరకు చేసేవే.

శక్తి మంత్రం

శక్తి మంత్రం

ఈ మంత్రం మనలో దాగిఉన్న శక్తిని బహిర్గతం చేయటానికి చెప్పబడుతుంది. క్రింద మంత్రం ఈ విధంగా చెప్పబడుతుంది: ఆది శక్తి, ఆది శక్తి, ఆది శక్తి, నమో నమో! సరబ్ శక్తి, సరబ్ శక్తి, సరబ్ శక్తి, నమో నమో! ప్రీతం భగవతి, ప్రీతం భగవతి, ప్రీతం భగవతి, నమో నమో! కుండలిని మాతా శక్తి, మాతా శక్తి, నమో నమో! దీని అర్ధం: ప్రిమాల్ శక్తి, నేను నీకు నమస్కరిస్తున్నాను! అంతటా ఆవరించి ఉన్న శక్తిస్వరూపిణి ! నేను నీకు నమస్కరిస్తున్నాను! సృష్టికారిణి! నేను నీకు నమస్కరిస్తున్నాను! కుండలిని సృష్టికారిణీ, అన్ని శక్తులకే మాతృశక్తిరూపిణివి! నేను నీకు నమస్కరిస్తున్నాను!

శక్తి సంస్కృతి

శక్తి సంస్కృతి

శక్తి పూజించేవారు, ఆది శక్తి అంటే ఉత్తమ బ్రాహ్మణుడు అని కూడా నమ్ముతారు. విశ్వంలో ఉన్న ఇతర రూపాలన్నీ దైవ శక్తి నుండి ఉద్భవించాయి. వారు దైవత్వపురుషుడు అయిన శివుడితోపాటు స్త్రీ శక్తిరూపిణిని పూజిస్తారు. అందువలన, శక్తిత్వం ఉన్న స్త్రీ, విశ్వసృష్టికర్త అని నమ్ముతున్నారు, విశ్వమే శక్తి రూపం. ప్రపంచాననే కనుగొన్నదే స్త్రీస్వరూపిణి, శరీరదారణే ఆమెయొక్క నిజమైన రూపం.

ఆలోచనకు ఆహారం

ఆలోచనకు ఆహారం

ఎక్కడయితే స్త్రీ సృష్టికి మూలాధారం అని చెప్పబడుతున్నదో, ఆ దేశంలోనే స్త్రీగా పుట్టటం మహాపాపం అని భావిస్తున్నది. ఇది మనం అందరం ఆత్మశోధన చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం కాదా?


Desktop Bottom Promotion