For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఈ వైన్స్ తో మొదలుపెట్టండి...!

|

సాధారణంగా క్రిస్మస్ కు గిఫ్ట్ లు ఇచ్చుపుచ్చుకొనే సాంప్రదాయం ఉంది. ఈ సంవత్సరం క్రిస్మస్ కు మీ ఆత్మీయులకు ఏదైనా స్పెషల్ గిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? సాధారణంగా క్రిస్మస్ అంటేనే కేక్ లు గుర్తు వస్తాయి. ప్రతి ఇంటా కేకుల రుచులు అలరిస్తుంటాయి. కేకులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితి. అలాగే క్రిస్మస్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి వైన్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. క్రిస్మస్ కు స్పెషల్ గా వైన్ ఎందుకు తీసుకుంటారంటే ఇది క్రైస్ట్ రక్తంకు సంకేతం అని భావిస్తారు. అందుకే వైన్ ను ఓ స్పెషల్ గిప్ట్ గా ఇవ్వొచ్చు.

అయితే అందరూ వైన్ తాగుతారని అనుకోవడం పొరపాటు, తాగే వారికి మాత్రమే ప్రెజెంట్ చేయాలి. అదీ మీ ఆత్మీయులకు ప్రెజెంట్ చేయడానికి ఏ వైన్(బ్రాండ్) అయితే మంచిది? క్రిస్మస్ గిప్ట్ గా ఇచ్చే వైన్ గురించి కొన్ని విషయాలను తెలుసుకోవాలి . ఈ సీజన్(వింటర్) లో ఇచ్చే వైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అదే సమ్మర్ వైన్ (చాలా వరకూ వైట్ కలర్ లో ఉంటాయి)వింటర్ వైన్స్ అని ఉంటాయి. కాబట్టి మీరు క్రిస్మస్ కు వైన్ గిప్ట్ ఇచ్చేటప్పుడు సీజన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి.

ఇక రెండో విషయం మీరు ఇచ్చే వైన్ క్రిస్మస్ రోజు తీసుకొనే ఆహారానికి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. క్రిస్మస్ డిన్నర్ కు వైన్ చాలా అవసరం. కాబట్టి క్రిస్మస్ కు వైన్ గిఫ్ట్ ఇచ్చే ముందు ఫస్ట్ మీ మెను ప్రకారం సెలక్ట్ చేసుకోండి. కొన్ని వైన్ పౌల్ట్రీ ఐటెమ్స్ తీసుకొనేటప్పుడు చాలా బెస్ట్. మరికొన్ని సీ ఫుడ్ తో మ్యాచ్ అవుతాయి.

ఇక మూడవది మీరు కొనే వైన్ మీ బడ్జెట్ కు సరిపోయే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే క్రిస్మస్ రోజు కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు ఇంటికి వచ్చే ఫ్రెడ్స్, అతిథులకోసం కూడా కొనాల్సి వస్తుంది కాబట్టి. కాబట్టి ఈ క్రిస్మస్ కు కొన్ని మంచి వైన్స్ కొనాలనుకొంటుంటే కొన్నిసూటబుల్ వైన్స్ మీకోసం....

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

కొంన్డే వాల్దిమర్ క్రియాంజా 2004 రియోజా: క్రిస్మస్ పార్టీని ప్రారంభించడానికి కొంన్డే వాల్దిమర్ క్రియాంజా 2004 రియోజా(Conde de Valdemar Crianza 2004 Rioja) చాలా మంచి సాలిడ్ రెడ్ వైన్ ఇది. ఇది కొంచె స్పైసీగా, వెనీల ఫ్లేవర్ తో పార్టీకి అద్భుతంగా మ్యాచ్ అవుతుంది.

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

గుండెర్ లాక్ 2007 రీసిలింగ్ కాబినెట్ట్ జీన్-బాప్టిస్ట్: గుండెర్ లాక్ 2007 రీసిలింగ్ కాబినెట్ట్ జీన్-బాప్టిస్ట్(Gunderloch 2007 Riesling Kabinett Jean Baptiste) ఈ ఫర్ఫెక్ట్ వైట్ వైన్ న్యూజిలాండ్ బ్రాండ్ లేత ద్రాక్ష రుచిని అందిస్తుంది.

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

మమ్ నాపా బ్రుట్ రోస్: మమ్ నాపా బ్రుట్ రోస్(Mumm Napa Brut Rose) ఫ్రైడ్ ఫుడ్స్, క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లేదా ఫిన్ చిప్స్ సర్వ్ చేస్తున్నట్లైతే అప్పుడు సీ స్పాక్లింగ్ వైన్ సర్వ్ చేయండి. ఇది చాలా బాగా మ్యాచ్ అవుతుంది.

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

లా రిసర్వ్: లా రిసర్వే(La Reserve) ఇది ఫ్రెంచ్ ఐటమ్. ఇది ఓక్ ఫ్లేవర్ తో ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది చాలా సులభంగా అందుబాటులో ఉన్నది. దొరుకుతుంది కూడా...

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

క్లోస్ లా కౌటాలే 2008: క్లోస్ లా కౌటాలే 2008(Clos La Coutale 2008)ఇది ప్రతి సాధారణ వ్యక్తి తీసుకొనే ఫ్రెంచ్ వైన్. ఇది చాలా సున్నితమైన చాక్లెట్ మరియు రేగు రుచిని కలిగి ఉంటుంది. బీఫ్ తినేవారికి ఇది సూటబుల్ డ్రింక్..

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

సెంట్రల్ ఓటగో పినోట్ నోయిర్ 2009: సెంట్రల్ ఓటగో పినోట్ నోయిర్ 2009(Central Otago Pinot Noir 2009).ఇది మరొక న్యూజిలాండ్ వైన్. ఈ వైన్ టర్కీ డిన్నర్ కు చాలా బాగా మ్యాచ్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా టర్కీ డిన్నర్ ఇస్తున్నట్లైతే ఈ వైన్ తో సర్వ్ చేయండి.

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

డొమైన్ లూన్యూ-పపిన్ మస్కేడెట్ సుర్ లై 2009: డొమైన్ లూన్యూ-పపిన్ మస్కేడెట్ సుర్ లై 2009(Domaine Luneau-Papin Muscadet Sur Lie 2009) క్రిస్మస్ రోజు షెల్ ఫిష్ లేదా ఇతర డెలిషియష్ చేపరుచులకు చూసేటప్పుడు ఈ వైట్ వైన్ ఫర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది.

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

లేయర్ కేక్ 2008 మల్ బెక్: లేయర్ కేక్(layer Cake 2008 Malbec): పౌల్ట్రీ మరియు రెడ్ మీట్ ఆహారంతో పాటు తీసుకొనే ఈ వైన్ స్మోకీ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. దీన్ని రాత్రి భోజనానికి సర్వ్ చేయవచ్చు.

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

12ఏళ్ళ నాటి స్వీట్ పెడ్రో క్సిమెనేజ్: 12ఏళ్ళ నాటి స్వీట్ పెడ్రో క్సిమెనేజ్(12 year Old Sweet Pedro Ximenez)ఇది డిజర్ట్ వైన్ మరియు ఇది చాలా సురక్షితమైనటువంటి బహుమతి. క్రిస్మస్ రోజును ఎవరినైన స్పెషల్ గా ఇంటికి ఆహ్వానించినప్పుడు ఈ వైన్ తీసుకొచ్చి ఐస్ క్రీమ్స్, మరియు పుడ్డింగ్ మీద పోయవచ్చు.

క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

సులా రాస షిరాజ్: సులా రాస షిరాజ్(Sula Rasa Shiraz) ఇది భారత దేశంలో ఉత్పత్తి అయ్యే రెడ్ వైన్స్ లో ఇది ఒకటి. మీరు వైన్ ప్రియులు ఐతే కనుక క్రిస్మస్ రోజున్ దీన్ని రుచిచూడాల్సిందే...

English summary

10 Wines That Can Be Christmas Gifts | క్రిస్మస్ స్పెషల్ గిప్ట్స్... 10 బెస్ట్ వైన్స్...

Christmas is the time for giving. But you don't want to give your friends and family the same gift every year. So, you strive for fresh Christmas gift ideas every year. Wines make very thoughtful gifts. And when it comes to Christmas, wines also have a special significance. Wine is had on Christmas because it symbolises the blood of Christ. What better way to cherish the spirit of Christmas than to gift your near and dear ones some delicious wine.
Story first published: Saturday, December 22, 2012, 16:40 [IST]
Desktop Bottom Promotion