For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీచర్స్ డే 2019 : గురు బ్రహ్మా, గురు:విష్ణు: గురుదేవో మహేశ్వర:

|
Happy Teachers Day-Teachers Day Gift Ideas...!
"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి. "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుహ్యమైనది, తెలియనిది. "రు" అంటే దానిని రుచ్యము చేసేది. అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది.

మన పూర్వీకులు గురువును సాక్షాత్తూ దేవుళ్లతో పోల్చి పూజించారు. ఆధునిక యుగంలో కూడా అనేకమంది ప్రముఖులు తమను తీర్చిదిద్దిన గురువులను గౌరవించారు. విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించే గురువులకు మనదేశంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. దానిలో భాగమే సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం.

మంచి ఉపాధ్యాయుడు, గొప్ప తత్త్వవేత్త, రాజకీయ నాయకుడు అయిన 'భారతరత్న' సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నేడు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. సర్వేపల్లి రాధాకృష్టన్‌కి ఉపాధ్యాయ వృత్తి పట్ల అభిమానం. 'దేశాన్ని తీర్చి దిద్దే మేధావులు ఉపాధ్యాయులే' అని ఆయన నమ్మేవారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఒక సారి కొంతమంది స్నేహితులు, విద్యార్థులు కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి కోరారు. అప్పుడు ఆయన తన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లను గౌరవిస్తే మంచిదని సూచించారు. ఆ తర్వాత 1962 నుంచి యేటా సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. విద్యార్థులకు గురువుల పట్ల ఉన్న గౌరవమర్యాదల కారణంగానే గురుపూజోత్సవం ఇంత ఆదరణకు నోచుకుంది.

గురుపూజోత్సవం నాడు ఎవరి గురువులను వాళ్లు తమకు తోచిన రీతిలో సత్కరిస్తూ వేడుకలు జరుపుకుంటారు. సాధరణంగా పిల్లలకు టీచర్లు అంటే చాలా ఇష్టం. టీచర్లు తమను పలకరిస్తే చాలా వారి సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటి టీచర్లు కు టీచర్స్ డే రోజున వారికి ఇష్టమైన బహుహానాలిచ్చి తమ అభిమానాన్ని చాటుకుంటారు.

బహుమతులు అనేటివి రకరకాలు, వివిధ సందర్భాలకు వివిధ రకాలుగా ఇస్తుంటారు. పుట్టిన రోజులు, పెళ్ళి రోజులు, యానివర్సరీ, ఇతర అకేషన్స్ ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే ఇలా ఒక్కో అకేషన్ కి ఒక్కో ప్రత్యేకమైనటువంటి గిప్ట్ లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. టీచర్స్ డే అనేది నిజంగా ఒక గొప్ప అకేషనే. ఎందుకంటే టీచర్స్ కు కృతజ్ఝతలు తెలపడానికి ఇంత కంటే మంచి అవకాశం మరొకటుందని చెప్పవచ్చు. మన జీవితాల్లో కొత్త వెలుగులను నిప్పే టీచర్ అనే పదానికి మన మాటల్లో చెప్పలేనంత గొప్పది. మరి అంతటి గౌరప్రదులైన టీచర్స్ కు కృతజ్ఝతలు ఒక్కటే సరిపోదు మంచి బహుమతులను కూడా అందివ్వాలి. మరి ఆ బహుమతులేంటో చూద్దాం..

ముఖ్యంగా గ్రీటింగ్ కార్డ్స్ : గ్రీటింగ్ కార్డ్స్ లో విలువైన సమాచరంతో పాటు, తమ ప్రేమను తెలిపే విధంగా ఉంటాయి. వాటిని గురవులకు ఇచ్చి వారి పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకొంటారు. గ్రీటింగ్ కార్డ్స్ పాటు, వారికి నచ్చిన మిక్కీమౌసులను, కార్టూన్లను కూడా ప్రెజెంట్స్ చేస్తుంటారు.

గురువులకు ఇచ్చే బహుమతుల్లో చాలా రకాలే ఉన్నాయి, పెన్స్, బుక్స్, డైరీలు, ఫ్లవర్స్, ఫ్లవర్ బొకేస్, హ్యాండ్ బ్యాగ్స్, పెన్ స్టాండ్స్, ఫోటో ఫ్రేమ్స్, చక్కటి పెయింటింగ్, గిప్ట్ బ్యాస్కెట్, టాయ్స్, కేక్స్ , చాక్లెట్స్, టీ కప్పులు లాంటివి ఎక్కువగా ప్రెజెంట్స్ చేస్తుంటారు. మరికొందరు పిల్లలైతే తమే స్వయంగా తయారు చేసిన చార్టులను ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకొంటారు. గిప్ట్ అనేవి ఆకర్షించేటివి. ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసేటివి. అందుకే పిల్లలందరూ వారికి ఇష్టమైన టీచర్లు బహుమతులు ఇచ్చి ఆనందం పొందుతారు.

English summary

Happy Teachers Day-Teachers Day Gift Ideas...! | గురుదేవోభవ..హాపీ టీచర్స్ డే....

Gifts are considered as a beautiful expression of our love, care and affection. The tradition of giving gifts to someone for whom we really care is very old. Gifts are given on several occasions like birthdays, weddings, anniversaries and other auspicious occasions like father's day, mother's day or teacher's day and many more such occasions.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more