For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  విశ్వంలోనే నెం.1 శ్రీమంత దేవాలయం మన ఇండియాలో ఉంది!

  By Sindhu
  |

  హిందూ మతంకు ఆరాధ్య ప్రదేశాలు దేవాలయాలు. అందుకే మన దేశంలో అనేక ఆధ్యాత్మిక దేవాలయాలను వెలసాయి. ప్రతి సందు మరియు మూలల్లో, లేదా చెట్టు క్రింద, ఊరిభయట..ఊరిలోపలో అనేక ప్రదేశాల్లో చిన్న లేదా పెద్ద ఆలయాలను చూస్తూనే ఉంటారు. కానీ, భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇవి మత సంబంధిత దేవాలయాలు మాత్రమే కాదు అతి బాగా పాలపుర్ చెందిన రిచెస్ట్ దేవాలయాలు.

  మన భారత దేశంలో ఉండే ఈ ప్రసిద్ధి చెందిన దేవాలయానలు పెద్ద పెద్ద ధనికులు, సెలబ్రెటీలను, ప్రపవంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ ప్రసిద్ధి చెందిన దేవాలయాలను సందర్శిస్తుంటారు. అందుకు ఉదాహరణగా, మన ఇండియాలో బాగా ప్రసిద్ది చెందిన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి రిచెస్ట్ దేవాలయం తిరుపతి బాలాజీ(శ్రీ వెంకటేశ్వర )దేవాలయం, పద్మభనాభస్వామీ దేవాలయం, షిరిడి సాయిబాబా దేవాలయం, సిద్దివినాయక టెంపుల్ ఇవన్నీ కూడా బాగా ప్రసిద్ది చెందినటువంటి మన ఇండియన్ టెంపుల్స్.

  పద్మనాభస్వామి దేవాలయం తిరువనంతపురంలో కేరళ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ అనేక సంవత్సరాలను నుండి సేవ్ చేసిన $20bn నిధులు కనుగొనబడింది. భక్తులు శ్రీమహావిష్ణువుకు సమర్పించే డబ్బు, మరియు విలువైన బంగారం వెల కంటలేని విలువలు ఉన్నందున ఈ దేవాలయం మన ఇండియాలో బాగా ధనిక దేవాలయంగా ప్రసిద్ది చెందినది.

  ఇక్కడ ప్రదానంగా 6గదులు ఉన్నాయి అందులో 4గదుల్లో ఇల్ల పత్రాలు మరియు విలువైన వస్తువులు ఉన్నాయి. ఇంకా ఎ మరియు బి చాంబర్ లో భక్తుల నుండి సేకరించిన నగదు ఇక్కడ స్టోర్ చేయబడింది. 2011సంవత్సరం నుండి ఏడు మంది కమిటీ సభ్యుల ద్వారా ఇక్కడ నిల్వ చేసిన బంగారు నాణేలు, నగదు, విలువైన రాళ్ళు టన్నుల్లో ఉన్నదని కనుగొనబడింది. ఈ నిధి మొత్త ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందినది. మన ఇండియాలో ఇటువంటి మరికొన్ని ప్రసిద్ధి చెందిన ధనిక దేవాలయాలు చూద్దాం...

  MOST READ:ప్రతి రోజూ 10 కర్జూరాలు తింటే పొందే 16 అమేజింగ్ బెన్ఫిట్స్..!!

  పద్మనాభ స్వామి దేవాలయం:

  పద్మనాభ స్వామి దేవాలయం:

  ఈ దేవాలయం మన ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా ప్రసిద్ధి చెంచదినది.

  తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం:

  తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం:

  సాధారణంగా తిరుపతి దేవాలయం అని అందరికీ తెలుసు. ఈ దేవాలయంను రెండవ ధనిక దేవాలయంగా ఉంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో ఉన్నది. ప్రతి రోజూ 60వేళ భక్తులు ఈ దేవాలయంను సందర్శిస్తుంటారు. అలాగే 650కోట్లో కంటే ఎక్కువ సంపద నిల్వ చేయబడింది. ఈ దేవాలయంను మన ఇండియాలో అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా చెబుతారు.

  వైష్టోవి దేవి దేవాలయం:

  వైష్టోవి దేవి దేవాలయం:

  ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

  సిద్ది వినాయక:

  సిద్ది వినాయక:

  ముంబాయి అనంగానే సిద్ది వినాయక ఆలయం గుర్తుకు వస్తుంది. కాని మరొక ప్రముఖ గణేశ ఆలయం ఉన్నది అదే ముంబాయికి దగ్గరలో ఉన్న తిత్వాలా గ్రామంలోని వినాయకుని గుడి. ముంబాయికి వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా వెళ్లి చూసి వచ్చే ప్రార్ధనా స్థలాల్లో ఈ గుడి కూడా ఒకటి. గుడి అనంగానే మన పక్కన (దక్షిణ భారత దేశంలో) ఉన్నట్టుగా పెద్ద పెద్ద కట్టడాలు ఏమీ కాదు. చిన్న గుడి కాని, వేలమంది రోజూ వస్తారు.

  MOST READ:వేగంగా బరువు తగ్గించుకోవాలంటే నిద్రించే ముందు వీటిని తప్పక పాటించాలి...

  గోల్డెన్ టెంపుల్:

  గోల్డెన్ టెంపుల్:

  ఇండియాలో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ హర్మందీర్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అద్భుతమైర పవిత్రమైన దేవాలయాల్లో ఇది ఒకటి. శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ యొక్క గ్రంధాలయం బంగారు పూతతో పూసిన ఆలయం ఉంది. ప్రకాశించే ఈ గోల్డెన్ టెంపుల్ చుట్టు వైట్ భవనాలు మరియు ఒక పవిత్రమైన సరస్సు కలిగి ఉన్నాయి.

  సోమనాథ్ దేవాలయం:

  సోమనాథ్ దేవాలయం:

  మనదేశంలో ఉన్న ప్రసిద్ధపుణ్యక్షేత్రాల్లో సోమనాథ్ విఖ్యాతమైనది. ఇది గొప్ప పర్యాటక క్షేత్రం కూడ. సోమనాథ్‌లోని మహాదేవలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆది జ్యోతిర్లింగం. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఆలయ నిర్మాణం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మార్గదర్శకత్వంలో జరిగింది. సోమనాథ్ దివ్యక్షేత్రాన్ని ప్రభాస పట్టణం అని కూడా పిలుస్తారుసోమనాథ్ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అహ్మదాబాద్ నుంచి సుమారుగా 450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సోమనాథ్ క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో బాలకతీర్థం ఉంది. వేటగాడి బాణపు ముల్లు శ్రీకృష్ణ భగవానుని పాదానికి గుచ్చుకున్న స్థలం అని చెబుతారు. కృష్ణుడు కాయాన్ని పరిత్యజించిన ప్రదేశం ‘దేహాస్వర్గ' బాలతీర్థానికి దగ్గరలో ఉంది. ఇది కపిల, హిరణ్య, సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానం. కృష్ణుని పార్థివ దేహానికి అర్జునుడు దహన క్రియలు జరిపించిన ప్రదేశం ఇదేనని చెబుతారు.

  మీనాక్షి దేవాలయం:

  మీనాక్షి దేవాలయం:

  దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని రెండో అతి పెద్ద నగరమైన మదురైలో వెలసి ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది.ఈ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పబడింది. ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. ఈ ఆలయంలో పార్వతీ దేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకు ప్రవేశం లేదు. కాంస్యం, నల్లరాతితో సర్వాంగ సుందరంగా మలచిన ఆర్ట్ గ్యాలరీ వీక్షకులకు కనువిందు చేస్తుంది. కులశేఖర పాండ్యుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం తిరుమలై నాయక్ హయాంలో ఆధునికీకరణకు నోచుకుంది.

  పూరీ జగన్నాథ్ ఆలయం:

  పూరీ జగన్నాథ్ ఆలయం:

  జగన్నాథ ఆలయం చాలా ప్రసిద్ధి ఒకటి అలాగే ఒరిస్సా అతిపెద్ద దేవాలయాలు వంటి ఉంది. 12 వ శతాబ్దంలో స్థాపించబడింది, ఆలయ జగన్నాథుని (కృష్ణుడు), విశ్వానికి ప్రభువు అంకితం. పూరీ జగన్నాథ ఆలయ పునాదిని వేసాయి కోసం క్రెడిట్ రాజా అనంత Varman Chodaganga దేవ్ వెళుతుంది. ఆలయం బంగాళాఖాతంలో తీరంలో, భువనేశ్వర్ నుండి 60 km దూరంలో ఉన్న, మరియు బాగా వైష్ణవ సంప్రదాయాలకు తరువాత భక్తులు గౌరవించబడ్డాడు. పూరీ జగన్నాథ ఆలయం సంబంధం ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది.

  కాశీ విశ్వనాథ్ దేవాలయం:

  కాశీ విశ్వనాథ్ దేవాలయం:

  భక్తుల హృదయములలో అసలైన కైలాసంగా గుర్తింపబడిన పుణ్యక్షేత్రం. గంగానది ఒడ్డున గల ఈ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ లో వారణాసి పట్టణంలో ఉంది. కాశీ కేలితే కాటి కేగినట్లే అనే పూర్వకాలము నుంచి నేటి వరకు పవిత్రత చెడని మహా పుణ్య శైవక్షేత్రం. ఇక్కడే అన్నపూర్ణాదేవి, విశాలాక్షి దేవాలయములు కలవు. నది ఒడ్డునే అనేక శ్మశాన వాటికలు, హోరెత్తే పంచాక్షరీ మంత్రం యాత్రికుల గుండెలలో తమో గుణాధీసుడు పరమేశ్వరుడు నివాసం ఉండే ప్రాంతము కైలాసంలో అడుగు పెట్టినట్లు ఆత్మానందాన్ని అనుభవిస్తారు. జీవితములో ఒక్కసారైనా అసలైన శివాలయమునకు వెళ్లాలనుకొనేవారి కలల పంట ఈ వారణాసి.

  MOST READ:బట్టతల సమస్యకు చెక్ పెట్టే పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్..!!

  శ్రీ రంగనాథ స్వామి ఆలయం:

  శ్రీ రంగనాథ స్వామి ఆలయం:

  మన దేశoలో చాల కొద్ది ఆలయాలలో మాత్రమే శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై పవలిస్తునట్టుగా దర్సన మిస్తాడు.అలాంటి కొద్ది ఆలయాలలో నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఇది నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉంది.నెల్లూరు పట్టణం మన రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన పట్టణాలలో ఒకటి.కాబట్టి ఈ ప్రాంతంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఈలాంటి అసౌకర్యం కలగకుండా దర్శించవచ్చు. బస్సు మరియు రైల్ సౌకర్యాలు ఈ ఆలయాన్ని చేరుకోవటానికి పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆలయానికి గాలిగోపురం ఒక ప్రత్యెక ఆకర్షణ.ఇది దాదాపు 80 అడుగుల ఎత్తు ఉంటుంది.

  English summary

  10 Richest Temples Of India | విశ్వంలోనే నెం.1 శ్రీమంత దేవాలయం మన ఇండియాలో ఉంది!

  Temple is a place of worship for Hindu devotees. And you can find en number of temples in this spiritual country. Every nook and corner, below the tree shades and near footpaths, you will find a big or small temple.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more