For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కృష్ణాష్టమి 2019: చిన్ని కృష్ణుని అందచందాలు చూతము రారండి..!

శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వదినం వస్తుంది. కృష్ణూని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు.

|

హిందువుల పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. మహా విష్ణువు అవతారమైన ఆ దేవదేవుని ప్రార్థిస్తే మానవ జన్మ సార్థకమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. సృష్టికర్త మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణూడిగా జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. శ్రావణ కృష్ణ బహుళ అష్టమి కృష్ణాష్టమి పర్వదినం వస్తుంది. కృష్ణుని జన్మ దినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది. కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది.

ముద్దువచ్చే చిన్ని క్రిష్ణుడంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా తల్లులు తమ పిల్లలకు శ్రీకృష్ణుడి జన్మదినమైన క్రిష్ణాష్టమి రోజున చిన్ని క్రిష్ణుడి డ్రస్ వేసి మురిసిపోవటం జరుతుంటుంది. ఇక ఆరోజు పిల్లలకు తమ స్కూలులో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, వారిలో ఉత్తమ వేషధారికి బహుమతులు, మొదలగునవి ఎన్నో వుంటాయి. పిల్లలు మగ, ఆడ బేధం లేకుండా ఈ కాంపిటీషన్ లలో పాల్గొంటారు. వీరు వేసే ఈ దుస్తులకు పెద్దగా వ్యయం లేకపోవడం కూడా దీనిని ప్రోత్సహిస్తోంది. శ్రీకృష్ణుడి దుస్తులు ఏ రకంగా వుండాలో పిల్లవాడిని ఏరకంగా ఆ వేషానికి తీర్చి దిద్దాలో చూద్దాం!

మొదటగా మీ చిన్నారిని శ్రీకృష్ణుడిగా అలంకరించేటపుడు, అసలు అతనికి ఆ డ్రస్ ఇష్టమో కాదో తెలుసుకోవాలి. ఎందుకంటే డ్రస్ వేసిన తరువాత అతను ఆ ఇష్టాన్ని తన ముఖంలో కూడా ప్రతిబింబించాలి. డ్రస్ వేయటమే కాదు తల్లులు కృష్ణుడి జీవిత గాధను కూడా వివరించాలి. దీనితో బాలుడు తాను స్టేజిపై అదేరకమైన అనుకరణను చేస్తాడు. ఆశించిన రీతిలో పోటీలో గెలుపొందుతాడు. గెలవటం లేదా ఓడటం ఆటలో ఒకభాగమని కూడా పిల్లాడికి ముందుగానే చెప్పాలి. వేషం సరిగ్గా వుండాలంటే, సరి అయిన దుస్తులు ధరించి హావభావాలను ప్రదర్శించాలి. దుస్తులతోపాటు అందుకవసరమైన నగలు, చేతబట్టే మురళి లేదా వెన్న నిండిన కుండ మొదలైనవి కూడా వుంటే వేషం సహజంగా వుంటుంది. సమయానికి తగినట్లు ఒక విగ్ కూడా ధరిస్తే మరింత బాగుంటుంది. కృష్ణుడి వేషం వేయాలంటే కావలసిన సరంజామా .....

1. పీతాంబరం (పసుపురంగు సిల్కు ధోవతి) పై బట్టతో వుండాలి. 2. నీలిరంగు (కెమికల్ కానిది) 3. నగలు 4. నెమలి పింఛంతో ఒక కిరీటం 5. ఫ్లూట్ 6. పూలదండ 7. మేకప్ కిట్ 8. ఒక విగ్గు అలంకరణ ఎలా చేయాలి? ధోవతి నడుముకు కట్టండి. కిరీటం కిందే విగ్ పెట్టి కిరీటానికి నెమలిపింఛం పెట్టండి. చెవులకు చక్కటి రింగులు, ఎంపిక చేసిన నీలి రంగును శరీరమంతా రాయండి. నగలు, పూలదండ అలంగరించండి. బుగ్గలు కొద్దిగా ఎరుపు, కను బొమ్మలుకు నల్లటి రంగువేయండి. మీ వద్దగల రెడ్ లిప్ స్టిక్ తో నుదుటిపై తిలకాన్ని దిద్దండి. ఇక అంతే...మీ చిన్ని క్రిష్ణుడు రెడీ! మరి మీరు మీ పిల్లలను చిన్ని శ్రీకృష్ణుడి రూపంలో తయారైన చిన్నారుల మీద ఓ లుక్ ఏయండి...

చిన్ని క్రిష్ణ:

చిన్ని క్రిష్ణ:

వెన్నదొంగ చిన్ని క్రిష్ణ. చేతిలో వెన్న ముద్ద. తల మీద చిన్న పిల, మెడలో ఆభరణాలు, తెల్లని దోతి, కాళ్ళో కడియాలు..అందంగా ఉన్నచిన్నక్రిష్ణ భలే ముద్దొస్తున్నాడు.

వస్తున్నా ఉండూ:

వస్తున్నా ఉండూ:

క్రిష్టా ఎక్కడున్నావయ్యా అంటే ? ఇక్కడున్నా అమ్మ అంటాడే తప్పు కళ్ళకు మాత్రం కనడడు. అటువంటి వేశదారణలో చిన్ని క్రిష్ణ

క్రిష్ణ వెన్నకుండా:

క్రిష్ణ వెన్నకుండా:

వెన్నదొంగ అందరిళ్ళలో వెన్నదొంగిలించి తిని, యశోధకు చిక్కలు తెచ్చిపెట్టిన చిన్ని క్రిష్ణుడు.

మురళీ క్రిష్ణ:

మురళీ క్రిష్ణ:

చేతిలో మురళీతో ముద్దుగా కూర్చొన్న ముద్దుక్రిష్ణ.

కృష్ణా:

కృష్ణా:

అవును కృష్ణా నేనే..గోపాలుడు, గోవిందుడు, చిన్ని కృష్ణ అన్నీ నేనే..

తుంటరి క్రిష్ణ:

తుంటరి క్రిష్ణ:

బాల కృష్ణా, తుంటరి కృష్ణా కూడా నేనే. కొంటే చూపుతో ..

అలంకారం :

అలంకారం :

చిన్న పిల్లలు శ్రీకృష్ణుడిలా అలంకరిస్తే ఎలా ఉంటారు? ఈ గెటప్ లో ఒకేనా

రాధ:

రాధ:

చిలిపి కృష్ణుడికి తోడు రాధ..గోపికలు..మరి ఈ రాధ ఎలా ఉంది?

ఆటలతో :

ఆటలతో :

రాధ, గోపికలతో ఆటలాడటానికి సిద్దమైన చిన్ని క్రిష్ణుడు.

ఓ ముద్ద తినవయ్య చిన్నిక్రిష్ణా:

ఓ ముద్ద తినవయ్య చిన్నిక్రిష్ణా:

చిన్ని క్రిష్ణుడు వెన్న తప్ప వేరేమి తినడా?

గోపిక:

గోపిక:

క్రిష్ణుని కోసం తిరిగి..తిరిగి అలసితి, క్రిష్ణా ఎక్కడున్నావయ్యా?

గోపికా కన్య:

గోపికా కన్య:

క్రిష్ణా కొంచెం మేకప్ చేసుకొని కొంచెం త్వరగానే వచ్చేస్తాను..అని అలంకరణలో నిమగ్నం అయిన గోపిక...

క్రిష్ణ:

క్రిష్ణ:

అయ్యో పాపం ఆడుకోవడానికి గోపికలు లేరు. గోపికల కోసం ఎదురుచూస్తున్నా చిన్ని క్రిష్ణుడు.

English summary

Baby Krishna Costumes For Janmashtami

Janmashtami is the festival that celebrates the birth of Krishna (who is an avatar of Lord Vishnu). On the day of this festival, it is an age old custom to dress up little boys and girls in Krishna costumes. Baby Krishna was a colourful character with some very typical signs.
Desktop Bottom Promotion