For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యష్ చోప్రా బర్త్ డే సెలబ్రెషన్ లో సెలబ్రెటీల ర్యాంప్ వాక్

|

బాలీవుడ్‌ రొమాంటిక్‌ చిత్రాల దర్శకుడు, నిర్మాత యష్‌ చోప్రా, గత సంవత్సరం అక్టోబర్ లో అనారోగ్య కారణంతో కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే. భారతీయ సినిమాకు అంతర్జాతీయ కీర్తిని అందించిన బాలీవుడ్ దిగ్గజం, వెటర్న్ దర్శకుడు యష్ రాజ్ చోప్రా, 81వ జన్మదినోత్సవంను ముంబాయ్ లో సెలబ్రెటీలు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ర్యాంప్ వాక్ బాగా ఆకట్టుకొన్నది.

యష్ చోప్రా... ఆయన సినిమాల్లోనే కాదు.. ఆయన మనసులోనూ ఎంతో ప్రేమ నిండి ఉంటుంది. అందుకే ఆయనను 'కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌' అని బాలీవుడ్‌ ముద్దుగా పిలుచుకుంటుంది. అందుకే ఈయన పుట్టినరోజు కార్యక్రమానికి హాజరైన టాప్ సెలబ్రెటీలను మాత్రమే కాదు, అన్ని జనరేషన్ల వారిని మనం చూడవచ్చు. అలనాటి స్టార్ నటి రేఖ నుండి ప్రస్తుత ట్రెండ్ ను ఉర్రూతలూగిస్తున్న పరినితీ చోప్రా వరకూ అన్ని ఏజ్ గ్రూప్ ల వారు, ఈ కార్యక్రమంలో ర్యాప్ మీద సందడి చేశారు. ముఖ్యంగాం యష్ రాజ్ కు అత్యంత దగ్గరి స్నేహితుడు షారుక్ ఖాన్ ను కూడా ర్యాంప్ మీద చూడవచ్చు . ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ సెలబ్రెటీలు ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ ధరించి చాలా గౌరవ ప్రధంగా ర్యాప్ మీద నడిచారు.

యష్ చోప్రా పుట్టినరోజు సెలబ్రేషన్ ర్యాంప్ మీద షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క షర్మా, మాధురి దీక్షిత్, ప్రీతీ జింటా, రేఖ, పరినీతి చోప్రా, జూహీ చావ్లా, శ్రీదేవి మొదలగు టాప్ సెలబ్రెటీలతో మరికొందరు ర్యాంప్ మీద సందడి చేస్తూ ప్రేక్షకులను బాగా అలరించారు. వారు ధరించిన ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్ మరియు అద్భుతమైన సౌందర్యం చాలా అందంగా కార్యక్రమం జరిగింది. నటి రేఖ కాంచీవరం శారీలో ట్రెడిషనల్ గా కనిపించారు. ప్రీతి జింటా షరారా ధరిస్తే కత్రినా లెహంగాలో మెరిపిస్తే, అనుష్క షర్మా బ్లాక్ శారీలో మురిపిస్తూ కార్యక్రమం చాలా ఆకర్షణీయంగా కళ్ళకు మిరిమిట్లు గొలిపింది..

లేట్ యష్ చోప్రా 81 పుట్టినరోజు సెలబ్రేషన్ లో ర్యాంప్ మీద వాక్ చేసి టాప్ సెలబ్రెటీల మీద ఓ లుక్కేయండి...

కత్రినా కైఫ్:

కత్రినా కైఫ్:

లెహంగాలో కత్రినా కైఫ్ చాలా అందంగా మెరిస్తూ ర్యాంప్ మీద వాక్ చేసింది. రెడ్ లిప్ స్టిక్, మెడలో చోకర్ నెక్ లెస్ చాలా ప్రెటీగా కనిపించింది.

ప్రీతి జింటా:

ప్రీతి జింటా:

ప్రీతి జింటా వైట్ కలర్ ఎంబ్రాయిడరీ షరార డ్రెస్ ను ధరించి చాలా అద్భుతంగా..ట్రెడిషినల్ గా కనిపించింది.

రాణీ ముఖర్జీ :

రాణీ ముఖర్జీ :

డార్క్ పింక్ కలర్ లెహంగా శారీలో చాలా డిఫరెంట్ గా సాంప్రధాయంగా రాణీ ముఖర్జీ ఆకర్షణీయంగా కనిపించింది. పొడవాటి జడ. ముక్కుకు ముక్కు పుడక చైన్ చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది.

శ్రీదేవి:

శ్రీదేవి:

శ్రీదేవి చాలా సెక్సీగా కనబడుతోంది. వయస్సు పెరిగే కొద్ది, అందం మరింత పెరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీదేవి వైట్ లెహంగా లో చాలా అద్భుతంగా ఉంది. ఈ డ్రెస్ మీదకు ఆమె ధరించిన రాజస్థానీ బోర్లా సెట్ మెరిసే చైన్ ఇయర్ రింగ్, మల్టీ చెయిన్ నెక్ లెస్ అద్భుతం. అమోఘం.

అనుష్క శర్మ:

అనుష్క శర్మ:

అనుష్క్ ఈ బ్లాక్ లేస్ శారీలో రిట్రో క్వీన్ లాగా కనబడుతోంది. చీరకట్టుకు తగ్గ హెయిర్ స్టైల్, జడలో రెడ్ రోజ్ మెరిపిస్తూ రిట్రో లుక్ ను అంధిస్తోంది.

జూహీ చావ్లా:

జూహీ చావ్లా:

జూహీ చావ్లా ఒక బ్రౌట్ కలర్ ఫిఫాన్ ఫ్యాబ్రిక్ దుస్తుల్లో, షిఫాన్ ఫ్లవర్ ప్రింట్టెడ్ లెహంగాలో చాలా కలర్ ఫుల్ గా అందంగా కనిబడుతోంది. ఈ లెహంగా మీదకు నడుము వరకూ చిన్న ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ చాలా ఆకర్షణీయంగా ఉన్నది.

మూధురీ దీక్షిత్:

మూధురీ దీక్షిత్:

మాధురీ దీక్షిత్ లేస్ బ్లాక్ శారీ ధరించింది. చీర మీద గోల్డెన్ సీక్వెన్స్ వర్క్ తో మెరిస్తున్నది. ఈ శారీ మీదకు ఆమె గోల్డెన్ షీర్ బ్లాక్ బ్లౌజ్ ధరించింది.

పరినీతి చోప్రా:

పరినీతి చోప్రా:

ర్యాంప్ మీద పరిణీతి చోప్రా ఓ ట్రెడిషనల్ లుక్ ను తీసుకొచ్చింది . ఈమె రెడ్ అండ్ వెల్ వెట్ కలర్ లెహంగాతో ర్యాంప్ మీద మెరిసిపోయింది. ముఖ్యంగా డ్రస్ తోపాటు హెయిర్ యాక్ససెరీస్ చాలా బాగా ఆకట్టుకొన్నాయి.

రేఖ:

రేఖ:

అలనాటి, మేటి నటి రేఖ గోల్డ్ కలర్ లో మెరిసిపోతూ పూర్తిగా నిండిపోయారు.ఈ గోల్డ్ అండ్ రెడ్ కాంచీవరం శారీ బాగా ఆకర్షణీయంగా కనబడింది.

షారుక్ ఖాన్:

షారుక్ ఖాన్:

షారుక్ ఖాన్ బ్లాక్ బంద్ గాలా చైన్ జాకెట్ మరియు మ్యాచింగ్ ట్రోషర్ లో చాలా హ్యాండ్సమ్ గా ర్యాంప్ వాక్ చేశారు.

English summary

Celebrities Walk The Ramp On Yash Raj's Birthday

We spotted celebrities from all generations walking down the ramp for Yash Raj. From Rekha to Parineeti Chopra, celebrities of all age group graced the ramp. Yash Raj's close friend Shahrukh Khan was also seen on the ramp. All the celebrities wore traditional outfits as they walked the ramp to pay tribute to Yash Raj on his 81st birthday.
Story first published: Saturday, September 28, 2013, 14:18 [IST]