For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినాయకుడికి ఏకదంత అనే పేరు ఎందుకు వచ్చింది?

By Super
|

వినాయకుడికి ఒకే దంతం అనే పేరు ఎందుకు వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయాన్నీ ఎక్కువమంది గమనించి ఉండకపోవచ్చు. ఇప్పటికైనా మీరు ఈ విగ్రహానికి ఒకే దంతం ఎందుకు ఉంది అని ఆలోచిస్తే, ఒకేదంతం గల వినాయకుడి గురించి ఇక్కడ ఉన్న కొన్ని ఆశక్తికర కధలను చదవండి. ఒకే దంతంతో కనిపించే ఏకదంతం వినాయకుడి రూపం.

గణపతి యొక్క ఈ రూపం పురాణాలలోని ముద్గల పురాణంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ‘ఏకదంత' అంటే ‘ఒకే పన్ను'అని అర్ధం. ఏకదంత, వినాయకుడి 32 రూపాలలో 22 వ రూపంగా చెప్తారు. దేవుడు ఈ రూపాన్ని అహంకార రాక్షసుడైన మదాసురని నిర్మూలించడానికి ధరించాడు. వినాయకుడి ఏకదంత రూప పుట్టుకపై కొన్ని ప్రసిద్ధ పురాణ కధలు ఉన్నాయి. ఒక్కొక్కదాన్ని పరిశీలిద్దాం:

Myth Behind Ekadanta

పద్మ పురాణం ప్రకారం, ఒకసారి శివుని పరమభక్తుడైన పరశురాముడు శివుడిని కలవడానికి కైలాసానికి వచ్చాడు. ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు, అందువల్ల వినాయకుడు పరశురాముడిని లోపలి వెళ్ళకుండా అడ్డుకున్నాడు. పరశురాముడు హిందూ పురాణాలలో కోపానికి పేరుగాంచాడు. అందువల్ల, వినాయకుడు అతనిని ద్వారం వద్ద ఆపగానే, పరశురాముడు కోపంతో తన దండంతో దాడికి దిగాడు. ఆ గొడ్డలిని చూసి, వినాయకుడు ఇది శివుడు పరశురామునికి బహుమతిగా ఇచ్చినదని గ్రహించాడు. అందువల్ల, అతను ఆ దాడిని ఆపి తన ఏక దంతంతో ఆ గొడ్డలిని ముక్కలు చేసాడు. అందువల్ల, వినాయకుడికి ఏకదంతుడు అని పేరు వచ్చింది. తరువాత పరశురాముడు తన తప్పును తెలుసుకుని, శివుడు, పార్వతి, వినాయకుడిని మన్నించమని కోరాడు.

ఇలాగే ఏకదంతుడి మీద మరో పురాణం కూడా ఉంది. ఒకసారి వినాయకుడు ఒక విందుకు వెళ్లి వస్తుండగా, అతను అనేక లడ్లను, మొదకాలను సేవించాడు. అతను పర్వతం నుండి తిరిగి వస్తుండగా, క్రౌంచ అనే పేరుగల ఎలుక, పాము ఆ దారిలో వచ్చాయి. పాముని చూసి, ఎలుక వినాయకుడి వద్ద ఆగి, పారిపోయింది. దీని ఫలితంగా, వినాయకుడి పొట్ట పగిలి తెరుచుకుంది, అన్ని స్వీట్లు బైటికి వచ్చాయి. కానీ వినాయకుడు వాటన్నిటినీ ప్రోగుచేసి తిరిగి అతని పొట్టలోకి తీసుకున్నాడు. తరువాత ఆయన ఆ పాముని తన పొట్టచుట్టూ గట్టిగ చుట్టి పట్టుకున్నాడు. ఈ సంఘటన చూసి, చంద్రుడు (చంద్ర) పెద్దగా నవ్వాడు. చంద్రుడు నవ్వడం చూసి వినాయకుడికి కోప౦ వచ్చింది. అందువల్ల, ఆయన తన ఒక దంతాన్ని విరిచి చంద్రుని మీదకు విసిరాడు, ఎప్పటికీ పూర్తిగా ప్రకాశించలేవని నిందించాడు. తరువాత చంద్రుడు క్షమాపణ కోరాడు, వినాయకుడు చంద్రుడి నుండి శాపాన్ని తొలగించాడు. అందువల్ల ఈ కారణంగా వినాయకుడు ఏకదంతుడుగా ప్రసిద్ది చెందాడు. ఈ సంఘటన కారణంగా ప్రజలు వినాయక చవితి రోజు రాత్రిపూట చంద్రుడిని చూడడానికి నిరాకరిస్తారు.

వినాయకుడు, వేదవ్యాసునికి రచయితగా ఉన్నపుడు మహాభారతాన్ని రాసేటపుడు అతని దంతాలలో ఒకదాన్ని కాలంగా ఉపయోగించారని మరో కధ. ఏకదంత వినాయకుడు అతిపెద్ద పొట్ట, ముదురు రంగు, నాలుగు చేతులు, విరిగిన దంతాన్ని కలిగి ఉంటాడు.

వినాయకుడి రూపంలో ఉన్న ఏకదంతుడిని పూజిస్తే, మీరు ఏ పని చేసిన విజయం సాధిస్తారు, మీ పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆయన విరిగిపోయిన దంతం అతని భక్తులు ఎలాంటి కోర్కేలనైనా తీర్చడానికి ఆయన త్యాగం చేసాడని గుర్తు. అందువల్ల, మనస్పూర్తితో ఏకదంతుడిని పూజిస్తే, ఆయన వారి కోర్కెలను నేరవేరుస్తాడు.

English summary

Myth Behind Ekadanta

Have you ever wondered why Lord Ganesha has only one tusk? May be most of us haven't even noticed this all the while.
Desktop Bottom Promotion