TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
చవితి రోజు గణేషుడిని గరికతో పూజిస్తే సకల లాభాలు!
వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేని పూజ విఘ్నేశ్వరుని లోటుగానే ఉంటుంది. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితం.
పూర్వం సంయమిని పురంలో ఒక మహౌత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు వెూహించిపోయాడు. అంతా చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బైటికి వచ్చిన యముని రేతస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు పుడతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణుని వద్దకు పరుగుతీశారు.
ఆయన వారినందరినీ తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు ఒకనాడు శివుడు హాలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకుని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హానీ జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు.
వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది కాని ఉపశమనం పూర్తిస్థాయిలో కలుగలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతలను బహూకరించాడు. వారిని వాటేసుకుంటే శరీరతాపం తగ్గుతుందని భావించారు. కానీ ఫలితం పూర్తిస్థాయిలో సిద్ధించలేదు కాని ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడా బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. విష్ణుమూర్తి రెండు పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తిస్థాయిలో రాలేదు.
కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికీ ఇదే చికిత్సగా పనికివస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుడిని ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువల్ల ఆయన వ్యాళబద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80 వేల మంది రుషులు అక్కడికి వచ్చారు. ఒకొక్కరు 21 గరిక పోచల చొప్పున 16 లక్షల 80 వేల గరికపోచలు అందజేశారు. వాటితో తాపోపశమనం కలుగుతుంది. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరికపోచలనే వినియోగించే వారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరికపోచలతో స్వామికి పూజ చేస్తున్నాం.