For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీలు ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు..

By Super
|

భారతదేశంలో మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు చాలా కష్టాలను ఎదుర్కుంటున్నారు. హత్యలు, బలాత్కారాలు మరియు సాధారణమైపోయిన ఈవ్ టీజింగ్స్, రైళ్ళలో మరియు బస్సులలో ప్రయాణిస్తున్నప్పుడు, ప్రత్యేకంగా ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు జరుగుతున్నాయి. ఇటువంటి సమయాల్లో స్త్రీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మరియు చుట్టుపక్కల వారి గురించి మరియు విషయాల గురించి చురుగ్గా వ్యవహరించాలి.

భారతదేశంలో ప్రయాణం చేయటం మిక్కిలి కఠినమైన పనిగా తయారయింది. కొంత మంది పురుషల క్రూరమైన వెకిలి చూపులనుండి మీరు తప్పించుకోలేరు. మనం సామాజిక సంప్రదాయవాదం ఉన్న దేశంలో నివసిస్తున్నాము. మరియు ఈ సామాజిక సంప్రదాయం కారణంగా మహిళలు తమని తాము ప్రజలలో ఎలా మసులుకోవాలో తెలుసుకోవలసిన అవసరం ఉన్నది.

ఇక్కడ ఒక సాంస్కృతిక ఫాక్స్ పాస్ కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఇస్తున్నాము.

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

మీ వస్త్రధారణను గమనించండి : మొట్టమొదట మీ వస్త్రధారణ బట్టి అందరి దృష్టి ఆధారపడి ఉంటుంది. బిగుతైన దుస్తులు మరియు పొట్టి స్కర్టులు ధరించటం మానేయండి. వీటిని ధరించటం వలన ఇతరుల అనవసరమైన శ్రద్ధను ఆకర్షిస్తారు. ఒక దుపట్టా / శాలువతో ఒక సల్వార్ ధరించండి. మీరు జీన్స్ మరియు కుర్తాను షాల్ తో ధరించవొచ్చు.

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

అపరిచితులతో మాటలలో మునిగిపోవొద్దు: మీరు అందరితో కలిసిమెలిసి ఉండటం ఇష్టపడతారు. అవును, మేం అర్థం చేసుకోగలం. కాని మీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం అలా ఉండకండి. ఎవరితోనూ సంభాషణలోకి దిగవొద్దు. ఒకవేళ ఎవరైనా మీతో మాటలు కలిపి సంభాషణను పొడిగిస్తే, మీరు కనీస సంభాషణ జరపండి మరియు మీ వ్యక్తిగత వివరాలను తెలియనీయవొద్దు.

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

మీ వస్తువుల మీద ధ్యాస ఉంచండి: మీరు మీ వొస్తువులను దగ్గరగా ఉంచుకోండి. మీ కనుసన్నలలోనే మీ లగేజ్ ఉంచుకోండి. ఎప్పుడు వాటిమీద ఒక చూపు ఉంచండి. ఇది భారతదేశం. మీకు నమస్కారం చెపుతూనే వస్తువులను మాయం చేస్తారు. ప్రయాణంలో మీరు ఎప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

మీ డబ్బు పర్స్ జాగ్రత్త : మీరు మీ పర్స్ ను ఎప్పుడు దగ్గరే ఉంచుకోండి. డబ్బును ఒక స్థలంలోనే కాకుండా దానిని భాగాలుగా మీ బ్యాగ్ సైడ్ పాకెట్ లలో మరియు కొంత మీ వెనుక జేబులో కాని ఉంచండి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే, పరిస్థితిని బట్టి డబ్బు కొంత మీ దగ్గర కాపాడబడుతుంది.

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

నమ్మకంగా ఉండండి: మీరు ఏదైన ప్రదేశాలకు కొత్తగా..మొదటి సారి వెళుతున్నప్పుడు విశ్వసనీయంగా ఉండి. బిత్తర చూపులు చూస్తుంటే ఇతరులకు మీరు కొత్త అని తెలుసుకొని మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కాబట్టి మీకు ఆ ప్రదేశం కొత్తైన సరే మీకు అన్ని తెలిసినట్లు ప్రవర్థించాలి.

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

ఎవరి వద్దనుండి ఏమి తీసుకోవొద్దు: అపరిచితుల వద్ద నుండి ఏమి అంగీకరించకండి. ఒకవేళ ఎవరైనా బిస్కట్స్ లేదా పండ్లు కాని ఇస్తే, మర్యాదగా తిరస్కరించండి.

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

ఒంటరిగా ఉండవద్దు: మీరు రైలులో కాని లేదా బస్సులో కాని ఒక పురుషుడితో ఉన్నట్లుగా అనిపిస్తే, వెంటనే ఎక్కడ ఆడవారు ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఒకవేళ మీకు, మీ తరువాత కూర్చున్న మనిషితో అసౌకర్యంగా అనిపిస్తే, వేరే సీట్ కోసం అభ్యర్థించి మారండి లేదా ఇతర ప్రయాణీకుల సంభాషణలలో పాల్గొనండి.

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు..

ప్రయాణం తేలికగా చేయండి: లగేజ్ ఎక్కువగా తీసుకెళ్లవద్దు. మీరు ఒంటరిగా వీటినన్నిటిని చూసుకోవలసి ఉంటుంది. అందువలన ఒక బాక్ పాక్ మరియు ఒక ట్రాలీ బ్యాగ్ తో ప్రయాణాన్ని తేలికగా చేయండి. ఎక్కువ మొత్తంలో డబ్బు మరియు నగలు కాని తీసుకెళ్లవొద్దు.

English summary

Tips for women travellers in India | స్త్రీలు ఒంటరి ప్రయాణంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు

Women in India undergo a lot of trouble when they travel alone. Murders, rapes and general eve teasing happen on trains and buses especially while travelling alone. In such situations, women need to take extra care and be a little aware of things around them.
Desktop Bottom Promotion