మీ భాగస్వామితో కలిసి స్నానం చేయాలి అనడానికి 8 సరిపోయే కారణాలు!!

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

సినిమాలకి డేట్ గా వెళ్లటం ఇప్పుడు ఇక బోర్ అయిపోయింది. మీ బంధంలో మరింత ఉత్సాహం పెంచే జవాబు మీరు కలిసి చేసే స్నానంలో ఉండవచ్చు. కలిసి స్నానం చేయాలనే మీ భాగస్వామి కోరికను ఎప్పుడూ తిరస్కరిస్తున్నట్లయితే, దాని గురించి ఆలోచించటానికి ఇదే మంచి సమయం.

అవును, వారు మీ చిందరవందరగా ఉన్న తడి జుట్టును చూసేస్తారు, కానీ జంటగా స్నానం చేయటం వలన మరెన్నో పాజిటివ్ లాభాలు కూడా ఉంటాయి. ఇదిగో ఇద్దరూ ఆ స్టెప్ కలిసి తీసేసుకోడానికి ఇదిగో ఎనిమిది కారణాలు.

1.నీరు మరియు సమయం ఆదా చేయవచ్చు

1.నీరు మరియు సమయం ఆదా చేయవచ్చు

ప్రతిఒక్కరూ నీటిని ఆదా చేయటం అవసరం, మరియు కలిసి స్నానం చేయటం మీ వంతు సాయంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి శరీరాన్ని శుభ్రపర్చుకోవటం వలన సాధారణం కన్నా సగం నీరును ఆదా చేస్తుంది. కలిసి స్నానం చేయటం వలన సమయం కూడా మిగులుతుంది. ఇద్దరూ 9 కల్లా ఉద్యోగానికి వెళ్ళిపోవాలి కానీ ఎవరు ముందు స్నానం చేయాలన్న వాదనలో మరింత లేట్ అవటం కంటే, ఇదే మీకు మంచి పరిష్కారం. మీకు ఇది సరైన పరిష్కారం అన్పించకపోతే, ఇంకేదీ కూడా కాలేదు.

2. షవర్ చేయటంలో పరిశుభ్రమైన పద్ధతి ఇదే

2. షవర్ చేయటంలో పరిశుభ్రమైన పద్ధతి ఇదే

మన చేతులు అన్ని దిశలలో సాగలేవు అందుకని శరీరంపై కొన్ని ప్రాంతాలను మనంతట మనం శుభ్రం చేసుకోలేం. నిజాయితీగా చెప్పండి, మీ వీపుపై అన్ని ప్రాంతాలను మీ అంతట మీరు రుద్దుకోగలిగారా ఎప్పుడన్నా? ఇద్దరూ కలిసి స్నానం చేయటం వల్ల శరీరంపై అన్ని ప్రాంతాలు శుభ్రపడతాయి. ఇద్దరూ ఒకరికొకరు అందని ప్రదేశాలను కడగటంలో సాయపడి, బయటకి కడిగిన ముత్యాల్లా అందంగా వస్తారు!

3.చాలా రొమాంటిక్ వ్యవహారం

3.చాలా రొమాంటిక్ వ్యవహారం

నగ్నత్వాన్ని పక్కనబెట్టండి, ఇద్దరూ కలిసి స్నానం చేయటం వలన మీ బంధంలో రొమాన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్ళవచ్చు. మీ భాగస్వామి జుట్టుకి షాంపూ చేయటమో లేదా లూఫాతో సబ్బును రాయటమో కేవలం ఇలాంటి చిన్నవిషయాలతో, మీరు ఒంటరిగా అవి చేసినప్పటికంటే చాలా హాట్ గా ఉంటుంది.కొవ్వొత్తులు వెలిగించి, సుగంధ నూనెలు వాడుతూ వాతావరణాన్ని మరింత రొమాంటిక్ గా మార్చుకోవచ్చు. శరీరాన్ని శుభ్రపరుస్తూ మరియు లైంగికంగా ఉత్తేజితమయ్యే మరేదన్నా డేట్ నైట్ ఐడియా తెలుసా మీకు? తెలీదనుకుంటా.

4.ఉల్లాసవంతమైన విషయం అది

4.ఉల్లాసవంతమైన విషయం అది

షాంపూ కళ్ళలో పడటం మీకు రొమాంటిక్ గా అన్పించికపోతే, మీ భాగస్వామితో షవర్ లో ఆడుకోండి. ఇద్దరూ కలిసి నవ్వుకోవటం వలన మీ బంధం ధృఢపడుతుంది, షవర్ కన్నా దీనికి మంచి స్థలం ఉండదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకోండి, షాంపూ రాసిన జుట్టుతో విచిత్ర ఆకారాలు చేయండి. పాతరకంగా చేసిన షవర్ ఎంత బోరింగ్ యో అర్థమవుతుంది.

5.మంచి ఫోర్ ప్లే గా పనికొస్తుంది

5.మంచి ఫోర్ ప్లే గా పనికొస్తుంది

మీకు షవర్ సెక్స్ లో ఏ ఆనందం అన్పించకపోతే, ఫర్వాలేదు మీరేం ఒంటరి కాదు. చాలామందికి జారిపోయే నేలలు, నురగలు ఉన్నచోట బాత్ రూం స్నానంలో చేసే సెక్స్ ఆనందం ఇవ్వదు. కానీ కలిసి స్నానం చేస్తే అది ఫోర్ ప్లేగా అదోస్థాయి ఆనందాన్ని తప్పక ఇస్తుంది. మీకు సెక్స్ కన్నా ముందు కొంచెం మరింత ఫోర్ ప్లే ఉంటే బావుండనిపిస్తే, మీ భాగస్వామిని షవర్ కి ఆహ్వానించటం గురించి ఆలోచించండి. మీ ఫోర్ ప్లే కోరిక తీరడానికి చాలా అవకాశం, సమయం దొరుకుతుంది.

 6.నమ్మకాన్ని పెంచుతుంది

6.నమ్మకాన్ని పెంచుతుంది

స్నానం చేయటం చాలా వ్యక్తిగతమైన విషయం. ఇది ఇంకొకరితో పంచుకుంటున్నారంటే దాని అర్థం మీ ఇద్దరి మధ్యా ఏ గోడలు లేవని వారికి తెలియచేస్తున్నట్టు. ఇది విచిత్రంగా అన్పించవచ్చు కానీ మీ భాగస్వామితో బంధం బలపర్చుకోడానికి ఇదో మంచి మార్గం. ఇద్దరూ కలిసి స్నానం చేసాక ఇద్దరు ఒకరితో ఒకరు కొత్త సౌకర్యాన్ని ఫీలవుతారు. ఒకరి కళ్ళలో షాంపూను తీసేయడానికి మరొకరు సాయపడటం వలన స్నానం అయ్యేసరికి మరింత దగ్గరవుతారు.

7.చవకైన డేట్

7.చవకైన డేట్

నగరంలో ఖరీదైన రెస్టారెంట్ కి రొమాంటిక్ డిన్నర్ కి వెళ్ళటానికి బ్యాంకుని ఖాళీచేయాలసిన అవసరం ఏముంది, మంచి ఐడియా మీ బాత్ రూం లోనే ఉంది! సరిగంగ స్నానాలు సెక్సీగా, ఆనందంగా, ముఖ్యంగా పైసా ఖర్చులేనివి. మీరు చవకైన డేట్ ఐడియాలను ఆలోచిస్తుంటే, దీనికన్నా మంచి ఐడియా ఉండదు. మీ భాగస్వామితో చాలాసేపు స్నానం మీ మధ్య గాఢబంధాన్ని ఏర్పరుస్తుంది, తర్వాత హాయి సెక్స్ కి దారితీస్తుంది ఇంకా మీ పర్సుకూడా ఖాళీ అవదు.

8.అభద్రతా భావాలను వదిలిస్తుంది.

8.అభద్రతా భావాలను వదిలిస్తుంది.

మీరు అభద్రతాభావాలలో చిక్కుకుని ఉంటే, మీ భాగస్వామితో షవర్ మిమ్మల్ని శాంతపరుస్తుంది. షవర్ లో ఉన్నప్పుడు మీరు మొత్తం నగ్నంగా ఉండి, మీ భాగస్వామి ముందు ఏ అడ్డులేకుండా ఉంటారు. మేకప్, శరీరాకృతి బట్టలు లేకుండా,జుట్టు ఉత్పత్తులు , అందంగా కన్పించటానికి ఏ ఉత్పత్తులు వాడకుండా ఉంటారు. నిజానికి హాలీవుడ్ సినిమాలు చూసి మోసపోకండి, షవర్ సన్నివేశాలలో నటీమణులు ఉన్నంత అందంగా మీరేం స్నానం చేసేటప్పుడు ఉండకపోవచ్చు. మీ జుట్టు తడిగా ఉండి, మొహానికి అతుక్కుపోయి,మీ భాగస్వామిని చూడటానికి కూడా పదే పదే నీళ్లను మొహంపై నుంచి తుడుస్తూ ఉండాలి. ఇవన్నీ ఉన్నాకూడా, మీ భాగస్వామి మీరు అందంగా ఉన్నారని భావిస్తే, ఇక జీవితంలో మీ శరీరం పట్ల మీరు అభద్రతగా భావించరు.

English summary

8 Totally Valid Reasons To Shower With Your Partner

8 Totally Valid Reasons To Shower With Your Partner, Here are eight reasons to shower together which might push you to take the plunge.
Subscribe Newsletter