For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పుట్టినరోజు మీ వ్యక్తిత్వం గురించి వెల్లడించే విషయాలేంటి?

మీ పుట్టినరోజు మీ వ్యక్తిత్వం గురించి వెల్లడించే విషయాలేంటి?

|

మీరు జన్మించిన రోజు మీ వ్యక్తిత్వం గురించి అనేక విషయాలను వెల్లడిస్తుంది. వారంలో ఏడు రోజులుంటాయి. ఆ ఏడు రోజులు ఏడు విభిన్న స్వభావాలను కలిగి ఉంటాయి. కాబట్టి, ఏడు భిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు ఆ రోజులలో జన్మిస్తారని అంటారు. మరి మీరు జన్మించిన రోజు ఎటువంటి వ్యక్తిత్వంతో ముడిపడి ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజులకు గ్రహాల పేర్లను ఇవ్వడం జరిగింది. ఇది క్రీస్తుపూర్వం మొదటి సెంచరీలో జరిగింది. రోమన్ దేవుళ్ళ పేర్లను అలాగే పురాతన పదజాలాన్ని ఉపయోగించి రోజులకు పేర్లను పెట్టారు. ప్లానెట్స్ పేర్లతో అసోసియేట్ అయి ఉన్న ఈ పేర్లు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

మీ పుట్టినరోజు మీ వ్యక్తిత్వం గురించి వెల్లడించే విషయాలేంటి?

న్యూయార్క్లోని హార్ట్ విక్ కాలేజ్ కి చెందిన డైరెక్టర్ ఆఫ్ అబ్జార్వేటరీ ప్రకారం ఆదివారం నుంచి ప్రారంభిస్తే ప్రతి రోజుకు గ్రహాల పేర్లను పెట్టడం జరిగింది. సన్'స్ డే, మూన్స్ డే, మెర్కురీస్ డే, మార్స్ డే, జూపిటర్ డే, వీనస్ డే మరియు సాటర్న్ డే. ఇక్కడ, సండే, మండే మరియు సాటర్డే పేర్లను సులభంగా గుర్తించగలుగుతారు. మిగతా రోజుల పేర్లను గ్రహాల పేర్లతో రిలేట్ చేసుకోవడం సులభంగా ఉండదు. అయితే, ట్యూస్డే లేదా టివ్స్ డే, వెడ్నెస్ డే లేదా వుడెన్స్ డే, థర్స్ డే లేదా తార్స్ డే, ఫ్రై డే లేదా ఫ్రైస్ డే అనేవి నార్స్ దేవుళ్ళ పేర్లతో పోలి ఉంటాయని అబ్సర్వేటరీ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ నార్స్ దేవుళ్ళ పేర్లనేవి రోమన్ దేవుళ్ళ పేర్లతో కూడా పోలి ఉంటాయి. ఉదాహరణకు, టివ్ అనే పేరు రోమన్ గాడ్ మార్స్ ని సూచిస్తుంది. అలాగే వుడెన్ అనే గాడ్ ఆఫ్ వార్ నార్స్ పేరు రోమన్ మెర్క్యురీను సూచిస్తుంది. ఫ్రై అనే గాడ్ ఆఫ్ లవ్ నార్స్ పేరు రోమన్ గాడ్ వీనస్ ను సూచిస్తుంది.

మీరు ఏ రోజున జన్మించారో మీకు స్పష్టత లేదా? అయితే, మీ జన్మతేదీ సహాయంతో మీరే రోజున జన్మించారో తెలుసుకోవచ్చు. ఈ లింక్ ను ఉపయోగించి తెలుసుకోండి మరి.

మీరు సోమవారం నాడు జన్మించినట్టైతే

మీరు సోమవారం నాడు జన్మించినట్టైతే

సోమవారం నాడు జన్మించిన వారిలో ఈ వ్యక్తిత్వ లక్షణాలు కనిపిస్తాయి.

* మీరు క్రియేటివ్, అయినా మీ ఐడియాస్ ను బయటికి వ్యక్తపరచరు. మీలోనే దాచుకుంటారు.

* మీలో ఎంపతీ ఎక్కువ.

* కుటుంబంతో పాటు కొంతమంది దగ్గరి స్నేహితులే మీ ప్రయారిటీ.

* మీరొక అద్భుతమైన సంధానకర్త. ప్రతి ఒక్కరికి వారికి కావలసింది అందిస్తారు.

* బిజినెస్ లోని లీడర్ షిప్ రోల్స్ లో మీరు విజయం సాధిస్తారు.

మీరు మంగళవారం నాడు జన్మించినట్టైతే

మీరు మంగళవారం నాడు జన్మించినట్టైతే

మంగళవారం నాడు జన్మించిన వారిలో ఈ క్రింద చెప్పబడిన నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి.

* మీలో ఉత్సాహం అలాగే ఉల్లాసం ఉరకలేస్తాయి.

* మీవైపు ఇతరులు ఎక్కువగా ఆకర్షితులవుతారు. తద్వారా, వారు మీకు హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు.

* కెరీర్ లో సక్సెస్ అవుతారు.

* మీరు నియంత్రించలేని విషయాల గురించి కూడా అనవసరపు ఒత్తిడికి గురవుతారు.

* జీవితంలోని మంచి విషయాలను ఆస్వాదిస్తారు. డబ్బుల్ని పొదుపు చేయడం మీకు కష్టతరం.

* మీరు చిత్తశుద్ధి కలిగి ఉంటారు. మీకు ఏది సరైనదని అనిపిస్తే అదే చేస్తారు.

* మీరు నిజాయితీగా మాట్లాడతారు. అయితే, మీ నిజాయితీ వలన కొందరు మీకు వ్యతిరేకులుగా మారతారు.

* మీరు విమర్శలను స్వీకరించలేరు.

మీరు బుధవారం నాడు జన్మించినట్టైతే

మీరు బుధవారం నాడు జన్మించినట్టైతే

బుధవారం నాడు జన్మించిన వారిలో ఈ కింద వివరింపబడిన వ్యక్తిత్వ లక్షణాలను గమనించవచ్చు.

* మీరు కొత్త విషయాలను వేగంగా నేర్చుకుంటారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

* ఆర్గనైజ్డ్ గా ఉండటం మీకు కష్టతరం.

* మీరు సింపుల్ గా ఉంటారు. ఈజీ గోయింగ్ నేచర్ కలిగి ఉంటారు. అందువలన, ఇతరులు మీ పట్ల ఇంప్రెస్ అవుతారు.

*ఇతరుల నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతారు. ఇతరులతో మాట్లాడేందుకు ఆసక్తిని కనబరుస్తారు.

* వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వారితో ఇట్టే కలిసిపోతారు.

* మీ పనిని ఇష్టపడతారు. మీతో కలిసి పనిచేస్తున్న వారిని గౌరవిస్తారు.

మీరు గురువారం నాడు జన్మించినట్టయితే

మీరు గురువారం నాడు జన్మించినట్టయితే

గురువారం నాడు జన్మించిన వారిలో ఈ కింద చెప్పబడిన వ్యక్తిత్వ లక్షణాలను గమనించవచ్చు.

* మీరు ఆశావాది

* మీరు రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్ట్ ను తిరిగి పొందగలుగుతారు.

* మీరు మీ వర్క్ లో ఇండిపెండెంట్ గా ఉంటారు.

* మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పైస్థాయికి వెళ్లేందుకు మీరు శాయశక్తులా ప్రయత్నిస్తారు.

* మిమ్మల్ని విమర్శించే వారిని మీరు ఇష్టపడరు. విమర్శలను మనసుకు తీసుకుంటారు.

* వినూత్నంగా ఉండేవాడిని ఇష్టపడతారు. త్వరగా బోర్ ఫీల్ అవుతారు.

* మీ సహజసిద్ధ ఛరిష్మా వలన మీరు ఎటెన్షన్ ను గ్రాబ్ చేస్తారు.

శుక్రవారం నాడు జన్మించినట్టైతే

శుక్రవారం నాడు జన్మించినట్టైతే

శుక్రవారం నాడు జన్మించిన వారిలో ఈ కింద చెప్పబడిన వ్యక్తిత్వ లక్షణాలను గమనించవచ్చు.

* సౌందర్యాన్ని అలాగే సామరస్యాన్ని ఇష్టపడతారు. సామరస్య వాతావరణాన్ని సృష్టించడానికి ఇష్టపడతారు.

* మీ స్నేహితుల కంటే మీరెక్కువ క్రియేటివిటీ కలిగినవారు.

* రిలేషన్ షిప్స్ విషయానికి వస్తే మీరు ఎమోషనల్ గా సెన్సిటివ్ గా ఉంటారు.

* సెట్ బ్యాక్స్ ను సులభంగా హ్యాండిల్ చేయలేరు. గత జ్ఞాపకాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి.

* మీరు గొప్ప అంతర్ దృష్టిని కలిగి ఉంటారు.

* మీరు ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వ్యక్తి.

* ప్రపంచమంటే మీకు సరైన అభిప్రాయం ఉంది.

 మీరు శనివారం నాడు జన్మించినట్టైతే

మీరు శనివారం నాడు జన్మించినట్టైతే

శనివారం నాడు జన్మించిన వారిలో ఈ కింద వివరింపబడిన వ్యక్తిత్వ లక్షణాలు ఉంటాయి.

* మీరు నమ్మదగిన వ్యక్తి. అనేక బాధ్యతలు కలిగి ఉంటారు.

* మీరు గతంలో గాని లేదా భవిష్యత్తులో గాని జీవిస్తారు. వర్తమానాన్ని గుర్తించరు.

* మీరు తెలివైనవారు. పెర్ఫెక్షనిస్ట్ గా ఉండేందుకు ఇష్టపడతారు.

* మీ అపియరెన్స్ పట్ల శ్రద్ధ వహిస్తారు. అందంగా కనిపించేందుకు సమయాన్ని కేటాయిస్తారు.

* మీ అభిప్రాయాన్ని చెప్పమంటే నెగటివ్ గా చెబుతారు.

* మీలో సహజసిద్ధంగానే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అయితే, ఇది ఇతరులకు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తుంది.

ఆదివారం నాడు జన్మించినట్టైతే

ఆదివారం నాడు జన్మించినట్టైతే

ఆదివారం నాడు జన్మించిన వారిలో ఈ వ్యక్తిత్వ లక్షణాలు కనిపిస్తాయి.

* మీరు పాజిటివ్ అవుట్ లుక్ కలిగి ఉంటారు.

* ఇతరులకు ఇవ్వడంలో ఆనందం పొందుతారు.

* మీరు ఇతరులను త్వరగా నమ్మరు. అందుకే, వారితో కలిసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు.

* మీరు ఎమోషనల్ గా సెన్సిటివ్. విమర్శలను స్వీకరించలేరు. వారి మనసులోని భావాలను తవ్వడానికి ఇష్టపడతారు.

* మీరు త్వరగా చిరాకుకు గురవుతారు. అందువలన, పనులను సగంలో విడిచిపెడతారు.

English summary

What Does Your Birth Day Reveal About Your Personality

The day of birth does have an impact on your personality and that is something that none can deny. If still confused on how to know your personality type with birth date, then this article is perfect for you. Read on to find out about the significance of your birth day and how it influences your personality and builds your character.
Desktop Bottom Promotion