For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 తలలు 3 చెవులతో జన్మించిన మేక, శాపమా, దైవమా లేక శాస్త్రీయ కోణం ఉందా

మేకల కాపరికి కూడా ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఆ మేకల కాపరి, తన స్టోర్లో ఇటువంటి మేక ఉండాలని కూడా ఆశించడు. దీనికి కారణం, అది తన బిజినెస్ మీద ప్రభావం చూపుతుంది అని. ఒకరకంగా చెప్పాలంటే,

|

ఈ ప్రపంచంలోని మనుషులు, జంతువుల పుట్టుకల విషయంలో అనేక విచిత్రమైన సంఘటనలు నమోదవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని అసహజమైనవిగా ఉంటే, కొన్ని భయానకంగా కనిపించే సంఘటనలు కూడా ఉన్నాయి. క్రమంగా ఆ జంతువును లేదా మనిషిని శాపవశాత్తు లేదా దేవుని పునర్జన్మగా భావిస్తూ మూడ నమ్మకాలకు తెర తీసే కథలు కోకొల్లలు. ఇక్కడ చెప్పబోయే విషయంలో 2 తలలు మరియు 3 చెవులతో జన్మించిన పాలిసెఫాలి (బైసెఫాలిక్ లేదా డైసెఫాలిక్) మేక , జనాలకు మూడనమ్మకాలను సృష్టించే సమయం కూడా ఇవ్వకుండా తప్పించుకుంది. జన్యు సంబంధ స్థితిలో పుట్టిన ఈ మేక, జన్మించిన 4 వ రోజునే కన్నుమూసింది.

గమనిక: ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ తలలతో జన్మించిన జంతువులను పాలిసెఫాలిక్ అని వ్యవహరిస్తారు. అందులో రెండు తలలు కలిగిన వాటిని బైసెఫాలిక్ లేదా డైసెఫాలిక్ అని, మూడు తలలు ఉంటే ట్రైసెఫాలిక్ అని వ్యవహరిస్తారు. వాస్తవిక ప్రపంచంలో అవిభక్త కవలలు, లేదా మోనోజైజోటిక్ అని వ్యవహరిస్తారు.

మూఢ నమ్మకాలను సృష్టించడం

మూఢ నమ్మకాలను సృష్టించడం

మేకల కాపరికి కూడా ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఆ మేకల కాపరి, తన స్టోర్లో ఇటువంటి మేక ఉండాలని కూడా ఆశించడు. దీనికి కారణం, అది తన బిజినెస్ మీద ప్రభావం చూపుతుంది అని. ఒకరకంగా చెప్పాలంటే, అటువంటి చులకన భావం ఉండకూడదు అన్న కారణంగానే, పైన చెప్పిన మూడ నమ్మకాలను సృష్టించడం జరిగిందని, కానీ అటువంటి మూడనమ్మకాలు ఇప్పటి ప్రపంచంలో ప్రచారానికి, ఉనికి కోసం సహాయపడుతుంది కానీ, వాటిలో ఎటువంటి వాస్తవమూ లేదని గంటాపథంగా చెప్తుంటారు శాస్త్రవేత్తలు, మేధావులు. ఈ మేక జన్మించడానికి ప్రసవానికి కూడా 7 గంటల సమయంకన్నా ఎక్కువే పట్టింది.

మ్యూటెంట్ కిడ్

మ్యూటెంట్ కిడ్

కొందరు దీనిని మ్యూటెంట్ కిడ్ అని కూడా వ్యవహరించడం మొదలుపెట్టారు. నిజానికి మ్యూటెంట్ అంటే తనకు తాను రూపాన్ని మార్చుకోగలిగిన శక్తిని కలిగి ఉండడం, అది ఎక్స్-మెన్ వంటి సినిమాల్లోనే సాధ్యమవుతుంది. కానీ అది మ్యూటెంట్ కాదు, పైన చెప్పినట్లు జన్యుసంబంధ స్థితితో జన్మించిన మేకపిల్ల.

ఇది రెండు తలలు, నాలుగు కళ్ళు మరియు మూడు చెవులను కలిగి ఉంది. దాని వైకల్యం కారణంగా కనీసం తన సొంత కాళ్ళమీద కూడా నిలబడలేకపోయింది. దీనికి ఏదైనా ఆహారమివ్వాలి అన్నా రెండు తలలు, తలకొక నోరు ఉంది. క్రమంగా కాస్త కష్టతరంగా ఉండేది.

దైవుని జన్మగా భావించి

దైవుని జన్మగా భావించి

ప్రజలు దీనిని దైవుని జన్మగా భావించిన కారణంగా, దీన్ని కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నించారు, మరియు అంగీకరిస్తున్నారు. ఈ మేక చైనాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించింది. క్రమంగా అనతి కాలంలోనే ఈ వార్త దావానలంలా అంతటా వ్యాపించి, ప్రజలు ఈ అసాధారణ జీవిని చూడటానికి గుమిగూడడం మొదలుపెట్టారు. నివేదికల ప్రకారం, కొందరు వేలం దారులు ఈ విచిత్రమైన మేకను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ఇటువంటి పుట్టుకలను, పవిత్రమైనవిగా భావించడం జరుగుతుంది. అయినప్పటికీ, ఆ కాపరి దానిని ఎవరికీ విక్రయించలేదు.

Most Read :మీ ప్రేయసి, భార్య, ప్రియుడు, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తుంటే ఎలా తెలుసుకోవాలిMost Read :మీ ప్రేయసి, భార్య, ప్రియుడు, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తుంటే ఎలా తెలుసుకోవాలి

4 రోజుల తరువాత

4 రోజుల తరువాత

కానీ దురదృష్టవశాత్తు ఈ మేక జన్మించిన 4 రోజుల తరువాత మరణించింది. తూర్పు చైనాలోని యెజై గ్రామంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతలు నమోదైన కారణంగా, మరియు దాని అంతర్గత శారీరిక సమస్యల కారణంగా మేక మరణించిందని నివేదించబడింది.

మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, గృహోపయోగ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Bizarre looking mutant goat was born with two heads and three ears

A 'Mutant Goat' Born With Two Heads And Three Ears
Desktop Bottom Promotion