For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేదరికంతో పోరాడలేక వృషణాలను అమ్మకానికి పెట్టిన ప్రబుద్దుడు

|

ధనవంతులు కావడం అనేది ప్రతి ఒక్కరు అనుకుంటే జరిగిపోదు. ఒక వ్యక్తి ధనవంతుడవడానికి, శ్రమ, క్రమశిక్షణ, పట్టుదల, చదువు, కుటుంబ వంశపారంపర్యం, లేదా తెలివితేటలు వంటివి ప్రధాన అంశాలుగా ఉంటాయి. వీటన్నిటి తోడూ అదృష్టం కూడా ఉండాలి అంటారు పెద్దలు. కానీ కొందరు తరచుగా “ధనం మూలం మిదం జగత్” , “డబ్బు లేకుండా పుట్టడం తప్పు కాదు, డబ్బు లేకుండా పోవడం తప్పు” అంటూ జనరలైస్డ్ స్టేట్మెంట్లు చెప్తుంటారు. మరోపక్క, పడుతున్న కష్టాలు, సంఘంలో వివక్ష కళ్ళ ముందు సాక్ష్యాలుగా ఉండనే ఉన్నాయి. కానీ ఇలాంటివన్నీ, అనేకమందికి డబ్బు మీద ఆశ కలగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి అన్నది వాస్తవం.

 

దానికి తోడు ఒకరితో పోలిక. పోలిక అనేది, లక్ష్యసాధనలో ఉండాలి, కానీ ఆర్ధిక పరమైన అంశాల

పరంగా ఉన్న కారణాన, సంపాదనకు మించిన ఖర్చులకు పోయి చివరికి పతనం దృష్ట్యా అడుగులు వేస్తున్నారు అనేకమంది. అదేవిధంగా, ఇక్కడ ఒక వ్యక్తి పేదరికాన్ని భరించలేక, మిగిలిన బ్రతుకైనా ధనవంతునిగా బ్రతకాలన్న ఆలోచనలో వృషణాలను అమ్మకానికి పెట్టాడు. ఈ వికార సంఘటన గురించిన మరిన్ని వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. తన వృషణాలను డబ్బు రూపంలో మార్చడానికి నిర్ణయించుకున్న వ్యక్తి కథ ఇది. మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు సాగండి.

పేదరికంతో పోరాడడం విసుగు తెప్పించింది

పేదరికంతో పోరాడడం విసుగు తెప్పించింది

ఇయాన్ హర్రియల్ కొవిటి అనే ఈ వ్యక్తి వయసు 27 ఏళ్లు. కెన్యాలోని మిగోరి కౌంటీలోని ఉరిరి నియోజకవర్గంలో ఇతను నివసిస్తుంటాడు. కానీ అసాధారణ రీతిలో ధనవంతుడు అవ్వాలన్న ఆలోచనే ప్రపంచమంతా ఇతని వైపు చూసేలా చేసింది. కొంతకాలం పాటు సోషల్ మీడియాలో ఇతని గురించిన చర్చలే జరిగాయి. కొందరు ఇతను చేసింది సబబే అంటుంటే, మరికొందరు తేలికగా కొట్టి పారేస్తున్నారు. కానీ సంఘంలో ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలిపేందుకు ఇటువంటివి కొన్ని తార్కాణాలుగా ఉంటాయని అనలిస్ట్ల వాదన. ఇతను పేదరికాన్ని, ఆకలిని భరించలేక చివరికి తన వృషణాలలో ఒక దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు.

రాజకీయాల్లో కూడా అడుగు ….

రాజకీయాల్లో కూడా అడుగు ….

కొవిటి రాజకీయాలలో కూడా స్వతంత్ర అభ్యర్థిగా ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడని స్పష్టంగా తెలిసింది. అంతేకాకుండా తన మూత్రపిండాలలో ఒకదాన్ని 1.5 మిలియన్ డాలర్లకు అమ్మేందుకు కూడా సిద్దపడ్డాడు. కానీ ఇతర దేశస్తులకు ఈ అమౌంట్ 3 రెట్లు అధికంగా ఉంటుందని చెప్పాడు.

అతని నమ్మకం :
 

అతని నమ్మకం :

సంతానం పరంగా ఒక వృషణం ఉంటే సరిపోతుంది అని అతని నమ్మకం. క్రమంగా ఒకరికి సంతాన భాగ్యాన్ని అందించిన వాడిని అవుతాను, మరోపక్క నాకు డబ్బులు కూడా గిట్టుబాటు అవుతాయి అని అంటాడు కొవిటి.

తనని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిపై అతను రివేంజ్ తీసకున్నాడు, చాట్ మొత్తం చూపించాడు

తాను అమ్మాలని అనుకుంది కేవలం వృషణాలను మాత్రమే కాదు :

తాను అమ్మాలని అనుకుంది కేవలం వృషణాలను మాత్రమే కాదు :

వైద్య వృత్తిలో ఉన్న తన స్నేహితుడొకరు ఒక మూత్రపిండం ద్వారా ఆరోగ్యవంతమైన మరియు సంపూర్ణమైన జీవితాన్ని గడపవచ్చని ధృవీకరించాడు. పైగా అక్కడ కిడ్నీ సమస్యలతో భాదపడుతున్న వ్యక్తులు అనేకమంది, డయాలసిస్ మీద బ్రతుకుబండి ఈడుస్తున్నారని. వారిలో కనీసం ఒకరైనా తన వంతుగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. క్రమంగా తన వృషణాలతో పాటు కిడ్నీని కూడా అమ్మదలిచాడు మహానుభావుడు. కాదేది అమ్మకానికి అనర్హం అన్నట్లు, అవకాశం ఉండాలే కానీ సగం శరీర భాగాలను అమ్మేసేలా ఉన్నాడు కొవిటి.

వైద్యుల పరంగా …

వైద్యుల పరంగా …

కొవిటి కేవలం ఒకే ఒక్క వృషణంతో కూడా రెగ్యులర్ సెక్స్ జీవితాన్ని గడపవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, వాటిని తొలగించేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తోడై, బ్రతుకు భారంగా ఉంటే ఆరోగ్య రీత్యా నిర్ణయాలు తీసుకుంటాము కానీ, ధనవంతుడవ్వాలన్న కోరిక మేరకు అమ్మకానికి పెడితే, అది క్షమించరాని నేరమే అవుతుంది. అటువంటి వారికి తోడ్పాటు అందించడం కూడా వైద్య వృత్తికే కళంకం అని చెప్తున్నారు

ఈ చిట్కాలు పాటిస్తే మగతనం పెరుగుతుంది, సంతానోత్పత్తి శక్తి వస్తుంది, వీర్యకణాలు పెరుగుతాయి

ఇటువంటి వ్యక్తులను చూస్తుంటే

ఇటువంటి వ్యక్తులను చూస్తుంటే

ధనవంతులు కావడానికి ప్రయత్నిస్తున్న ఇటువంటి వ్యక్తులను చూస్తుంటే మీకేమనిపిస్తుంది. వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

English summary

Man Who Put His Testicle for Sale

Being rich is not something that everybody decides on. It can be hard work, or family hereditary or just sheer luck on how a person becomes rich. Finding bizarre ideas on becoming rich is something that grabs everybody's attention and this is what this man did.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more