For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్ళైన 3 నిమిషాలకే విడాకులు, ఈవిడ చేసిన పని సరైనదే అంటారా ?

|

విడాకులు .. దీనికి అనేక కారణాలు ఉంటాయి. పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా ఏదైనా సరే, ఒక జంట కలిసి ఉండడానికి ఎన్ని కారణాలైతే ఉంటాయో, విడిపోవడానికి కూడా అటువంటి కారణాలు అనేకం ఉంటాయి. కొన్ని కారణాలు వినడానికి కూడా సిల్లీగా కనిపిస్తుంటాయి.

ఇచ్చిన బహుమతుల నుండి, పెళ్లి భోజనాల దాకా, ఆర్ధిక పరమైన అంశాల నుండి సామాజిక కట్టుబాట్ల వరకు, శారీరిక ఆరోగ్యాల నుండి మానసిక హింసల వరకు ., అనేక రకాల కారణాలు ఈ విడాకులకు ఉంటాయి. రాజకీయాలు మరియు సినిమా హీరోలు కూడా కొందరి జంటల విడాకులకు కారణం అంటే అతిశయోక్తి కాదు.

ఇతరుల సమస్యల గురించి చర్చించుకుంటూ
 

ఇతరుల సమస్యల గురించి చర్చించుకుంటూ

కొందరైతే, ఇతరుల సమస్యల గురించి చర్చించుకుంటూ వాటిని తమ దాంపత్యానికి ప్రతిబంధకంగా మార్చుకుని విడాకుల వరకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ విడాకులు తీసుకోవడం అంత తేలికైన విషయం కాదు, నిర్ణయం తీసుకునే ముందు ఎన్నో అంశాలను పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది. కొందరికి రోజుల సమయం సరిపోతే, కొందరికి సంవత్సరాల సమయం పడుతుంది. కానీ మానసికంగా నచ్చకపోయినా సర్దుకుని కాపురాన్ని కొనసాగించే జంటలు అనేకం.

అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉంటే

అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉంటే

ఏదిఏమైనా తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉంటే, వీలైనంతవరకు మార్చడానికి ప్రయత్నించే వారు కూడా ఉన్నారు. పరిధి దాటితేనే విడాకుల వరకు వెళ్ళవలసి వస్తుంది. కానీ ఒక మహిళ వివాహం జరిగిన తర్వాత, కేవలం 3 నిమిషాలలోనే తన పెళ్లి జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్న సంఘటన అందరిలోనూ ఒక ఆలోచన రేకెత్తించింది. ఆవిడ ఎందుకలా చేసింది, తాను తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సమంజసం. అసలు ఎందుకీ పని చేసింది ?

ఆ ద౦పతులు అప్పుడే “నుప్తియా” మీద సంతకాలు చేశారు

ఆ ద౦పతులు అప్పుడే “నుప్తియా” మీద సంతకాలు చేశారు

ఈ సంఘటన కువైట్లో జరిగింది. ఏ జడ్జ్ ముందైతే నుప్తియా మీద సంతకాలు పెట్టి, ఈ జంట వివాహం చేసుకుందో, అదే జడ్జ్ ముందు వివాహం జరిగిన కొద్దిసేపటికే విడాకుల తతంగాన్ని కూడా జరిపేశారు. మారేజ్ కాంట్రాక్ట్ బాండ్ నుప్తియా మీద సంతకం చేశారు., తర్వాత ఏమైందంటే ...

తనివితీరా ముద్దాడి గట్టిగా అల్లుకుపోయింది, నా చేతులు తనని నలిపేశాయి

ఆవిడ పడింది.. ఇతను నోటికి పనిచెప్పాడు..

అప్పుడే పెళ్ళైన ఈ జంట, కోర్టు బయటకు వస్తుండగా, పెళ్ళికూతురు పొరపాటున తట్టుకుని కిందపడింది. కిందపడ్డ వధువును చేయిచ్చి పైకి లేపాల్సిన వరుడు, "స్టుపిడ్" నడవడం కూడా చేతకాదా అంటూ హేళన చేశాడు.

ఈ ఒక్క రీసన్ అతని విధానాన్ని చూపింది…

అందరి ముందు అవహేళన చేసిన అతనితో తన జీవితాన్ని ఊహించుకోలేక, మరుక్షణమే వెనక్కి తిరిగి వెళ్లి, జడ్జ్ ముందు చేరి పెళ్లిని రద్దు చేయమని కోరింది. అప్పటికి 3 నిమిషాలే అయింది వీరి వివాహం జరిగి. చివరికి విడాకుల పత్రం మీద సంతకం పెట్టేశారు.

నా భర్త ఆ విషయంలో బలవంతపెడుతుంటే నో చెప్పలేకపోతున్నా, నన్ను ఆయన దారిలోకి తెచ్చుకున్నాడు

నిజమే నాలుగు గోడల మద్యన చిత్ర హింసలు పెట్టినా, భాగస్వామిలో మార్పుకోసమే కొందరు ఎదురుచూస్తుంటారు. కానీ, నలుగురిలో మనిషి అహం మీద దెబ్బకొడితే, ఈ ప్రపంచంలో ఎవరూ చూస్తూ ఊరుకోరు. కానీ ఇక్కడ తన జీవితం, ఆ వ్యక్తితో ముడిపడి ఉంది. వ్యక్తిగతంగా అనుభవించిన ఆ మహిళకే తెలుసు, తాను ఎదుర్కొన్న అవమానం ఎలాంటిదో. క్రమంగా ఆ సంఘటన విడాకులకు దారితీసింది., దీన్ని క్షణికావేశం అనడం కూడా తప్పే. కొందరు ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం కూడా అత్యంత ఆలోచనని కూడుకుని ఉంటాయని మరువకూడదు.

నెటిజన్స్ నుండి మిశ్రమ స్పందన :

నెటిజన్స్ నుండి మిశ్రమ స్పందన :

సరైన పని చేసినందుకు ఆ మహిళకు మద్దతిచ్చిన వ్యక్తులు ఉండగా, అతని నుండి విడిపోవడానికి ఈ చిన్న విషయాన్ని కారణంగా చూపిందని అంటున్నవారు కూడా ఉన్నారు. కానీ అన్నం ఉడికిందో లేదో తెలుసుకోడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా, జీవితంలో తాను ఎలా ఉండబోతున్నాడో ఈ ఒక్క సంఘటనతో ఆ వరుడు చూపిన కారణంగా, ఆ మహిళ ఈ నిర్ణయం తీసుకుందని అనేకమంది అభిప్రాయం.

మీకు ఈ సంఘటన విన్న తర్వాత ఏమనిపించింది ? ఆమె చేసిన పని సరైనదే అని భావిస్తున్నారా ? మీ ఆలోచనలను క్రింద కామెంట్ విభాగంలో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఫాషన్, జీవనశైలి, ఆరోగ్య, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

She Divorced Her Husband Just 3 Mins After Marrying Him

There are many reasons for people to end their weddings on the day of their marriage. From fights regarding food choices to the gifts being given to people, couples tend to end their weddings for the dumbest reasons. Here is one such case where a woman decided to call off her wedding after the couple was married for just 3 minutes.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more