For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాలెంటైన్స్ డే : జ్యోతిష్యం ప్రకారం డేటింగ్ ఐడియాలు తెలుసుకోండి

|

వాలెంటైన్స్ డే కేవలం కొన్ని గంటల దూరంలోనే ఉంది. క్రమంగా మీ భాగస్వామిని సంతోషపెట్టేందుకు, ఎన్నో ప్రణాళికలు మీ మనసులో తడుతూ ఉంటాయి. ఏది ఏమైనా, వారిని సంతోషపెట్టడమే మీ ధ్యేయంగా ఉంటుంది. కాకపోతే ఎటువంటి ప్రణాళికలు మీకు సహకారాన్ని ఇవ్వగలవో అంచనా వేయగలరా ? మీ రాశి చక్రం గుర్తు ప్రకారం, వాటిని గుర్తించడంలో ఈ వ్యాసం మీకు సహకరిస్తుంది. మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

ఈ వ్యాసంలో వాలెంటైన్స్ డే రోజున మీ రాశిచక్రం గుర్తుల ప్రకారం, అనుసరించవలసిన డేటింగ్ ఐడియాలను గురించిన వివరాలను పొందుపరచడం జరిగింది. అవును, మీ ప్రియమైనవారి కోసం ఈ ప్రత్యేకమైన రోజును ఏవిధంగా బహుమతిగా మలచవచ్చో తెలుసుకునేందుకు, మీ రాశిచక్రం యొక్క గుర్తు మాకు సహాయపడుతుంది.

మేష రాశి :

మేష రాశి :

జనవరి చివరికి వచ్చేసరికి, మీరు ఇష్టపడే వ్యక్తుల పట్ల మీకున్న నిజమైన భావాలను మాత్రమే గ్రహించాలని చూస్తారు. క్రమంగా మీరు ప్రత్యేకించి, ప్రణాళికలను తయారు చేయవలసిన అవసరం ఉండదు. ఒక ప్రేమ లేఖ చాలు, తమ పట్ల మీకున్న భావాలను వ్యక్తపరచుటకు. మీ జీవితంలో ఉన్నందుకు, ఆమెకు మీ ధన్యవాదాలను లేఖ రూపంలో తెలియజేయండి. మీ మేధస్సుకు పని చెప్పండి. మీ భావాలను, అన్నివేళలా ఆమెకు అర్ధమయ్యేలా చెప్పలేకపోవచ్చు. కానీ, ఆ భావాలను అక్షరాలుగా మలిస్తే, ఆ ఫలితం మీరు ఊహించని సానుకూలతను అందిస్తుంది. ఈ ప్రపంచంలో సగానికి సగం మంది, ఆ ప్రేమను పూర్తిస్థాయిలో భాగస్వాములకు తెలియజేయలేని కారణానే, అనేకం విఫలం అవుతున్నాయి. కానీ మేష రాశి వారైన మీకు, ఆలోచనా శక్తి కూడా ఎక్కువే, కావున మీ అక్షరాలకు పదును పెట్టండి.

వృషభ రాశి :

వృషభ రాశి :

ఈ రోజుల్లో వృషభ రాశి వారికి ఏ అంశంలోనూ పూర్తిగా తర్కంలేని ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఒక తార్కిక మనస్సుతో ఈ సంవత్సరమంతా చురుకుగా ఉండటం, మీకు ఎంతో మేలును చేకూరుస్తుంది. క్రమంగా మీ భాగస్వామితో సరదాగా ట్రిప్స్ వేయడం, సాహస క్రీడలలో పాలుపంచుకోవడం వంటి అంశాల ద్వారా కొంత విరామ సమయాన్ని గడపడం మంచిది. అంతేకాకుండా ఈ వాలెంటైన్స్ డే రోజున మీ భాగస్వామితో ఎక్కువ సమయం కేటాయించండి, గాడ్జెట్స్ జోలికి వెళ్ళకుండా. ఒకరకంగా ఇది మీ సంబంధం బలపడేందుకు దోహదపడుతుంది.

మిథున రాశి :

మిథున రాశి :

మీ సంబంధాలను బలోపేతం చేసుకునే విషయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉద్దేశాలను పక్కన పెట్టి, మీ భాగస్వామితో కొంత సమయం గడపాలని మీరు భావించవచ్చు. మంచి సమయం చూసుకుని, ఏదైనా మంచి సినిమా థియేటర్ వెళ్లడం బెస్ట్ ఆప్షన్. అది కూడా, మీ భాగస్వామికి నచ్చే సినిమా పరంగా ప్రణాళికలు చేయండి.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి :

పౌర్ణమి దగ్గరలో ఉన్న కారణాన, మీరు మీ ప్రేమ పట్ల అత్యంత భావోద్వేగభరితమైన మరియు సున్నితమైన అనుభూతిని పొందుతారు. ఈ భావోద్వేగాల ప్రవాహానికి అడ్డుకట్టలు వేయకుండా, మీ భాగస్వామితో సమయం వెచ్చించేలా ప్రణాళికలు చేయండి. ఆర్టిఫిషియల్ ప్రపంచానికి దూరంగా ప్రకృతితో సాన్నిహిత్యం ఉండేలా ట్రిప్స్ వేయడం, సినిమా లేదా నేషనల్ పార్క్స్ వెళ్ళడం వంటివి మీకు అనుకూలంగా ఉండగలవు.

Most Read : రోజూ హస్తప్రయోగం చేసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది, అందుకే కంట్రోల్ లో ఉండండి

సింహ రాశి :

సింహ రాశి :

చాలా కాలం నుండి, సింహ రాశి వారు కొన్ని ప్రత్యేకమైన అంశాలను పట్టించుకోకుండా తమ ఉద్యోగ పరమైన అంశాలనందు ఆలోచనలను కేంద్రీకరించడం జరుగుతూ ఉంది. వీరి వీరి నక్షత్రాల ప్రభావం కారణంగా. కానీ జీవితంలోని ప్రతి క్షణమూ మరియు ప్రతి ఒక్కరూ ముఖ్యమే అని గుర్తుంచుకోవలసి ఉంటుంది. కావున ఈరోజు కంపెనీ మరియు ఉద్యోగ జీవితం పరంగా కాకుండా మీ భాగస్వామి ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవడం. వారు ఎంతోకాలంగా మిమ్ములను కోరుతున్న వాటిని సర్ప్రైజ్ గిఫ్ట్ వలె ఇవ్వడం వంటివి మీ సంబంధాలను బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయం చేయగలవు. అంతేకాకుండా వీకెండ్ ట్రిప్స్, ఇండోర్ స్కైడైవింగ్, ట్రాంపోలైన్ పార్క్ మొదలైనవి కూడా మీకు ఆప్షన్స్ గా ఉంటాయి.

కన్యా రాశి :

కన్యా రాశి :

నిజానికి కన్యా రాశి వారు ఎక్కువగా కుటుంబ మరియు ఉద్యోగపరమైన ఆలోచనలు అధికంగా కలిగి ఉంటారు. తమ ప్రణాళికలు తమ తర్వాతి తరానికి కూడా మార్గనిర్దేశకం అవ్వాలన్న కుతూహలాన్ని కలిగి ఉంటారు. క్రమంగా ప్రణాళికాబద్దమైన జీవితానికి అలవాటు పడిన కారణంగా, కొన్ని ప్రత్యేకమైన అంశాలపరంగా దృష్టి సారించడం అనేది తక్కువగా ఉంటుంది. కానీ జీవితం సాఫీగా సాగాలంటే, అందులో భాగస్వామి ప్రమేయం కూడా ముఖ్యమని గ్రహించాల్సి ఉంటుంది. క్రమంగా ఈ వాలెంటైన్స్ డే నాడు, కాస్త సమయం కేటాయించి మీ భాగస్వామితో గేమ్స్ ఆడడం లేదా, వారికి ఇష్టమైన స్నేహితులని పార్టీకి ఆహ్వానించి డిన్నర్ లేదా వైన్ పార్టీ ఏర్పాటు చేయడం వంటివి సరదాగా ఉంటాయి.

తులా రాశి :

తులా రాశి :

శని దృష్టి మరియు గ్రహ స్థానాలను విశ్లేషించడం ద్వారా, తులా రాశి వారు అధికంగా వారి కెరీర్ గోల్స్ మీద బిజీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. క్రమంగా ఉదయం లేచి సూర్యోదయాన్ని చూడడం, భాగస్వామితో కలిసి నడవడం వంటి విషయాలకు కూడా సమయం దొరకనంత బిజీ ప్రణాళికలు కూడదని గుర్తుంచుకోండి. మీ భాగస్వామి కోసం ఈరోజు అటువంటి ఆలోచన చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. క్రమంగా ఏదైనా బీచ్ లేదా, నేషనల్ పార్క్ తీసుకెళ్ళి ఈరోజు సమయం కేటాయించేలా ప్రణాళిక చేసుకోండి.

వృశ్చిక రాశి :

వృశ్చిక రాశి :

మీకు కుటుంబం మాత్రమే కాకుండా స్నేహితులకు సమయం కేటాయించడం కూడా ఇష్టంగా ఉంటుంది. క్రమంగా మీ భాగస్వామితో మరియు స్నేహితులతో కలిసి ఏదైనా పార్టీ ఏర్పాటు చేసుకోండి. వాలెంటైన్ డే పార్టీ చేయండి, లేదా మీరు కొంత సమయం ఇండోర్ గేమ్స్ ఆడేందుకు కేటాయించండి. ఇది మీ భాగస్వామితోనే కాకుండా మీ స్నేహితులతో సంబంధ బాంధవ్యాలు పెంచేందుకు దోహదపడుతాయి.

Most Read : నల్లగా ఉండే యోని తెల్లగా మారాలంటే ఇలా చెయ్యాలి

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

బృహస్పతి మీకు అనుకూలంగా ఉండటం మరియు సంవత్సరం పొడవునా అదృష్టానికి మూలంగా ఉన్న కారణాన మీకు ఈ సంవత్సరమంతా ఆనందమయంగా ఉండనుంది. ముఖ్యంగా ఫిబ్రవరిలో, మీ రాశి చక్రాల పరంగా మీ దాంపత్య జీవనం లేదా ప్రేమలలో ఈ నెలంతా మీకు అనుకూలంగా ఉండనుంది. మీరు ఎటువంటి ప్రణాళికలు చేసినా, అవి మీకు అనుకూలంగా మారుతాయి. అయితే, మీ భాగస్వామి ఇష్టాలకు కూడా విలువిచ్చి నడుచుకోవడం మేలు. మీ భాగస్వామితో సమయం వెచ్చించే విధానం, డిన్నర్ పార్టీ, సినిమా లేదా బీచ్లో నడక వంటివి ఏవైనా మీకు ఈరోజును బహుమతిగా మార్చగలవు.

మకర రాశి :

మకర రాశి :

ఫిబ్రవరి 14, మీ రాశి చక్ర నక్షత్రాలు మరియు గ్రహాల స్థానం కారణంగా, అందులోనూ శని ప్రత్యేకమైన సానుకూల ప్రభావాన్ని కలిగి ఉన్న కారణంగా, మీరు మీ జీవితంలో ఎంతో పరిణతి చెందిన వారిగా, మరియు సమాజం దృష్ట్యా పరిపూర్ణ అవగాహనను కలిగి ఉండేలా ఉంటారు. ఒక వ్యక్తి పట్ల మీకున్న ప్రేమ వారికి పూర్తిస్థాయిలో తెలియాలని మీరు భావించిన ఎడల, ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. వారికి కాల్ చేసి, వారి ఫేవరేట్ డెసర్ట్ ప్లేస్లో మిమ్మల్ని కలుసుకునేలా ఏర్పాట్లు చేయండి. మీ భావనలను వారితో పంచుకునేందుకు ఆలోచించకండి.

కుంభ రాశి :

కుంభ రాశి :

నక్షత్రాల స్థానాలను అనుసరించి, కుంభరాశి వారు 2019 సంవత్సరంలో మీ దృష్టి ఎక్కువగా వృద్ధిపై ఉంటుంది. క్రమంగా మీ ఆలోచనలు వాస్తవ కోణంలో, ప్రాక్టికల్ గా ఉంటాయి. అయితే ఈ వాలెంటైన్ డే రోజున ఈ వైఖరి నుండి విరామం తీసుకోవడం ఉత్తమం. క్రమంగా మీ భాగస్వామితో నడకకు సమయం కేటాయించడం, సినిమా లేదా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయడం మంచిది. మరియు వీలైనంత వరకు మీరు ఎంచుకున్న ప్రదేశం పచ్చదనంతో నిండి ఉండేలా చూసుకోండి. క్రమంగా మీ ఆలోచనలు మరియు ప్రతిచర్యలు అన్ని తాజాగా, సహజత్వంతో కూడుకుని సానుకూల ఫలితాలను ఇస్తాయి.

Most Read : నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

మీన రాశి :

మీన రాశి :

మీ రాశి చక్రం మీద బృహస్పతి గ్రహం యొక్క సానుకూల పవనాల కారణంగా, ఈ సంవత్సరమంతా మీకు అనుకూలంగానే పరిస్థితులు ఉండనున్నాయి. మరియు అదృష్టానికి సూచనగా బృహస్పతిని పిలవడం జరుగుతుంటుంది. క్రమంగా, ఈ ఏడాది, మీ భాగస్వామితో అనుబంధం ప్రత్యేకంగా ఉంటుంది. వారి దృష్టి అంతా మీమీదే ఉంటుంది. అంతటి ప్రాధాన్యతను మీ భాగస్వామి నుండి పొందగలరు. ఈ వాలెంటైన్స్ డే నాడు, ఏదైనా విడిది ప్లాన్ చేయడం, లేదా మీ భాగస్వామితో కలిసి స్పా, లేదా బ్యూటీపార్లర్ కోసం సమయం కేటాయించడం మీకు సూచించదగినదిగా ఉంటుంది.

English summary

Valentines Date Ideas Based on Astrology

Valentine's Day is just around the corner and we are sure you have planned what you should be buying for your partner this year. If you have not yet, then our post can help you find that out as per your zodiac sign. But how and where are you going to express your love through your Valentine's gift?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more