For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశ్వసనీయత చూపని రాశి చక్రాలు ఇవే !

|

మనం కొంతమందికి సహాయం చేస్తున్నా కూడా, వారి నుండి సరైన స్పందన లేదా విశ్వసనీయతను చూడలేకపోవచ్చు. అంతేకాకుండా అవకాశవాద రాజకీయాలను ప్రదర్శిస్తూ భాదపెడుతూ ఉంటారు.

మీ అవసరాలలో ఎటువంటి సహాయం చేయకపోగా, చేసిన తప్పుకు చిన్నపాటి క్షమాపణలతో తప్పించుకుంటూ ఉంటారు. తమను తాము తీరికలేని బిజీ వ్యక్తులుగా చూపుకుంటూ, సంబంధాలను కొన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్తూ మనస్సు చివుక్కుమనేలా ప్రవర్తిస్తుంటారు కూడా.

కొన్నిసార్లు, వారికి కేటాయించిన పనిని కూడా పూర్తి చేయలేరు, పైగా నిబద్దతను కూడా కలిగి ఉండరు. కానీ, మీ నుండి మాత్రం అన్నీ ఆశిస్తూ వక్రబుద్దిని ప్రదర్శిస్తుంటారు. అంతిమంగా విశ్వసనీయత లేని వారిగా నిరూపించబడతారు. వారి వైఖరి మిమ్ములను కలవరపెడుతుందా ? ఎవరిని నమ్మవచ్చు, ఎవరిని నమ్మకూడదు? అన్న మీమాంస మిమ్ములను వేదిస్తుందా? అయితే ఈ వ్యాసం మీకోసమే. ఈ వ్యాసంలో రాశి చక్రాల పరంగా విశ్వసనీయతను అంతగా ప్రదర్శించని గుర్తులను పొందుపరచబడ్డాయి.

వారిని ఎలా కనుగొనగలం ?

అవును, వాస్తవానికి, వారి ముఖాలను చూడటం ద్వారా, వారు ఇలాంటివారు అని చెప్పడానికి వీలు కుదరదు. మరియు వారితో ఉన్న కొన్ని సంబంధాల కారణంగా అవిశ్వసనీయతను ప్రదర్శిస్తారని కలలో కూడా ఊహించలేము. క్రమంగా, వారు ఇచ్చిన విధిని నెరవేరుస్తారా లేదా ? సమయానికి అవసరమైన సహాయం అందించగలరా ?., వంటి ప్రశ్నలు అనేకం ఎదురవుతుంటాయి. ఏది ఏమయినప్పటికీ, జ్యోతిష్కులు వ్యక్తి రాశిచక్రాల గుర్తును కనుగొనడం ద్వారా కొంతమేర అంచనా వేయవచ్చు అని గంటాపధంగా చెప్తున్నారు. మరెందుకు ఆలస్యం, మరిన్ని వివరాలకు వ్యాసంలో ముందుకు కొనసాగండి.

విశ్వసనీయత చూపని రాశి చక్రాల గురించిన వివరాలు :

మిధున రాశి :

మిధున రాశి :

మిధున రాశి, జాబితాలో ప్రధమంగా ఉంటుంది . వారు మీతో ఆన్లైన్ గేమ్స్ ఆడవచ్చు, మరియు మీ అన్ని సోషల్ మీడియా పోస్ట్లలో మీకు ఇష్టమైన విధంగా మిమ్ములను ఫాలో అవుతూ లైక్స్, షేర్స్ ఇస్తూ ఉండవచ్చు. కానీ అంతవరకు మాత్రమే. మీకంటూ ఒక అవసరం ఏర్పడినప్పుడు, వారేంటో మీకు అర్ధమవుతుంది. మిధునరాశి వారు తమను తాము బిజీగా చెప్పుకుంటూ, తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. క్రమంగా, ఏ చిన్న కారణం కోసం కూడా మీతో చాట్ చేసేందుకు కూడా వారు ఆసక్తిని కలిగి ఉండరు. కానీ వారికి ఇష్టమైన అంశాలలో మాత్రమే, తమ స్వలాభం కోసం లేదా ఆన్లైన్ ఆటల ఆధారితంగా మీకు సపోర్ట్ ఇస్తున్నట్లు నటిస్తుంటారు.

ధనుస్సు రాశి :

ధనుస్సు రాశి :

ఇదివరకే మేము అనేకమార్లు ధనుస్సు రాశి వారి విశ్వసనీయత గురించిన వివరాలు వెల్లడించాము. వీరు పైకి ప్రేమను నటిస్తూ, లోలోపల ద్వేషపూరిత భావజాలాన్ని ప్రదర్శిస్తుంటారు. క్రమంగా కొన్ని పరిస్థితుల్లో మాత్రమే, వీరేంటో మీకు పూర్తిగా ఆర్ధమవుతుంది. వీరు "తాము, తమ కుటుంబం" అన్న స్వార్ధాన్ని అధికంగా కలిగి ఉంటారు. క్రమంగా ఎటువంటి ఇతరత్రా విషయాలను అంత తీవ్రంగా పరిగణించరు.

అందుచేతనే అవిశ్వసనీయతకు మారుపేరుగా ఉంటారు. ఎటువంటి విషయాలలో అయినా స్వలాభం, స్వార్ధం అనేవి వీరికి ప్రధానంగా ఉంటాయి. మీరు వీరికి బెస్ట్ ఫ్రెండ్ వలె ఉన్నా కూడా, వీరిని పూర్తి స్థాయిలో అర్ధం చేసుకోలేనివారుగా ఉంటారు. కానీ స్నేహితుని కుటుంబ సభ్యునివలె భావించిన క్షణం నుండి, మీపట్ల నిబద్దతను ప్రదర్శిస్తుంటారు.

మకర రాశి

మకర రాశి

ఎప్పటిలాగే, స్పష్టంగా మకర రాశి కూడా నిస్సందేహంగా ఎల్లప్పుడూ బిజీ వాతావరణాన్ని కూడుకుని ఉంటుంది. క్రమంగా వారితో ఒక సమావేశాన్ని లేదా ప్రణాళికను చేయడం అత్యంత క్లిష్టమైన అంశంగా ఉంటుంది. కానీ వీరితో ఆన్లైన్ స్నేహం పరంగా మీతో అన్నివేళలా అందుబాటులో ఉంటారు, ఆఫ్లైన్ ముఖాముఖి అన్నప్పుడే వీరితో వ్యవహరించడం కష్టంగా ఉంటుంది. మరియు ప్రణాళికలను అప్పటికప్పుడు ప్లాన్ చేసి, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు.

Most Read : ఈ ఐదు రాశుల వారికి పోటీతత్వం ఎక్కువ, ప్రతి విషయంలోనూ పోటీపడుతుంటారు, విజయమే లక్ష్యం

కుంభ రాశి :

కుంభ రాశి :

కుంభ రాశి వారి విషయంలో, వీరు తరచుగా విషయాలను మరిచిపోతూ ఉంటారు. మీ సందేశాలను, మాటలను పూర్తిగా పట్టించుకోని వారిలా ఉంటారు. క్రమంగా ఎటువంటి సమావేశమైనా, తుది లక్ష్యం చేరుకోవడానికి అధిక సమయం పట్టవచ్చు. ఒక్కోసారి మీ ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వకుండా తప్పించుకుంటూ ఉంటారని మర్చిపోకూడదు.

మీకు నచ్చినట్లయితే

మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read : ధనస్సులో మారుతున్న గురుగ్రహం, గురుడి అనుగ్రహం ఉంటే అన్నీ ఆనందాలే, మీ రాశిపై ఉందో లేదో చూసుకోండి

English summary

Which Zodiac Signs are the Most Unreliable?

Which Zodiac Signs Are The Most Unreliable
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more