అధికంగా క్రూరత్వాన్ని ప్రదర్శించే రాశిచక్రాలు ఇవే, అందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి

Subscribe to Boldsky

నిస్సందేహంగా, ఈ ప్రపంచం ఒక అద్భుతమైన వైవిధ్యంతో నిండుకుని ఉంది. అందులో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. ఈ వైవిధ్యం అనేది వివిధ జీవన రూపాల్లో, లేదా వివిధ జాతులు, సంస్కృతులు మొదలైన అనేక అంశాలలో ప్రతిబింబిస్తుంది. అదేవిధంగా మనుషుల భిన్న మనస్తత్వాలలో కూడా ఈ వైవిధ్యం ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు దయ, సున్నితత్వం, క్రూరత్వం, ఆశావాదం, నిరాశావాదం, హాస్య చతురత, భావోద్వేగం వంటి అనేక అంశాల పరంగా కూడా ఈ వైవిధ్యం అనేది ప్రస్ఫుటిస్తుంది. అయితే కొన్ని రాశి చక్రాలు మాత్రం ఈ లక్షణాలను అధికంగా ప్రదర్శిస్తూ ఉంటాయి.

ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని భిన్న అంశాలలో అర్ధం చేసుకోడానికి సూచించదగిన ఉత్తమ మార్గాలలో రాశి చక్రాలు కూడా ఒకటి. జ్యోతిష శాస్త్ర సంజ్ఞలు వ్యక్తి వ్యక్తిత్వానికి అద్దంపడుతాయి. ఇక్కడ, మన ప్రవర్తన దృష్ట్యా, అధిక స్థాయిలో క్రూరత్వం ప్రదర్శించే, రాశి చక్రాల గురించిన వివరణలు పొందుపరచడం జరిగింది. మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారేమో పరిశీలించండి.

Zodiac Signs Known To Be The Most Cruel

మేష రాశి :

మేష రాశి వారు ఉక్రోషానికి కోపానికి మారుపేరుగా ఉంటారని అందరికీ విదితమే. దయ, జాలి, కరుణ ఎంతగా ప్రదర్శిస్తారో, కోపం అంతకు రెట్టింపు రీతిలో ప్రదర్శించడం వీరి నైజంగా ఉంటుంది. తమ పట్ల చేసే తప్పులకు తక్కువ గిరిగీసుకుని ఉన్నట్లుగా కనిపించే మేష రాశి వారికి క్షణికావేశాలు అధికంగా ఉంటాయి. క్రమంగా అనాలోచితంగా విరుచుకుపడడం వంటి చర్యలు కనిపిస్తుంటాయి. ఏది ఏమైనా ప్రతీకారేచ్చ అధికంగా కలిగిన వీరు, తిరిగి చెల్లించే నిజాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒక్కోసారి మాటలు అదుపు తప్పి, అసలు వ్యక్తి వీరేనా అన్న అనుమానం కలిగేలా వ్యత్యాసం కనిపిస్తుంటుంది. అతి త్వరగానే కోపం నుండి బయటపడడం, జరిగిన సన్నివేశాన్ని పరిగణనలోనికి తీసుకోకపోవడం వంటివి కూడా సర్వసాధారణంగా ఉంటుంది. ఇది ఒకరకంగా మంచి విషయమనే చెప్పాలి. ఏది ఏమైనా, వారి మాటల పట్ల జాగ్రత్త తప్పనిసరి.

Zodiac Signs Known To Be The Most Cruel

కర్కాటక రాశి :

అదేంటి, కర్కాటక రాశి వారు అంటేనే సున్నితత్వానికి మారుపేరు, భావోద్వేగాల నిలయం అని వింటుంటాం కదా. వీరికి క్రూరత్వానికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా ? అవును, మీరు విన్నది నిజమే. కర్కాటక రాశి వారు, భావోద్వేగాలకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చినట్లే, అవి అదుపు తప్పినప్పుడు క్రూరత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు. తమ విషయంలో తప్పు చేసిన వారి పట్ల హేయభావం ప్రదర్శించడం, అసహ్య ధోరణితో మెలగడం వంటివి వీరి క్రూరత్వ లక్షణాలకు తార్కాణాలుగా ఉంటాయి.

వీరు ఎక్కువగా స్నేహానికి విలువిచ్చేవారిలా, నమ్మకస్తునివలె మెలుగుతుంటారు. కానీ వీరి మనసును బాధపెట్టేలా ప్రవర్తిస్తే, నెమ్మదిగా హేయభావాన్ని ప్రదర్శిస్తూ, మీ నైపుణ్యాలను సైతం ఎగతాళి చేసేలా వ్యంగ్య ధోరణిని అవలంభిస్తుంటారు. ప్రతీకారేచ్చ అనేది వారి హృదయాల నుండి అంత తేలికగా పక్కకుపోదు. పైగా ఇతరుల బలహీనతలను వెంటనే పసిగట్టగల లక్షణం వీరి సొంతం. క్రమంగా వారికి మీమీద పగ చల్లారేంత వరకు మిమ్ములను తరచూ అవమానపరచవచ్చు. మరియు అంత సులభంగా చేసిన తప్పులను క్షమించరు.

Zodiac Signs Known To Be The Most Cruel

మకర రాశి :

మకర రాశి వారు, తమ ఉన్నత లక్ష్యాల పట్ల, ఉద్యోగం పట్ల నిబద్దత కలిగిన వారిగా ఉన్న ఎడల, అంత తేలికగా అనవసర విషయాల జోలికి వెళ్ళని వారిగా ఉంటారు. అయినప్పటికీ, ఏదైనా సమస్య తలెత్తిన ఎడల, వారు తమతమ పరిమితులను అధిగమించి క్రూరత్వాన్ని ప్రదర్శించగలరు. క్రమంగా వీరి కోపావేశాలు, కక్షపూరిత నిర్ణయాలు భయంగొల్పేవిలా కనపడవచ్చు. వీరు తమ కోపాన్ని తగ్గించే వరకు, తమ లక్ష్యాలను సైతం పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంత ప్రతీకారేచ్ఛను ప్రదర్శించే, వీరితో జగడాలు లేకుండా చూసుకోవడమే అన్నిటికన్నా ఉత్తమంగా సూచించబడుతుంది.

Zodiac Signs Known To Be The Most Cruel

సింహ రాశి :

సింహ రాశి అన్ని రాశులలోనూ ఒక ప్రసిద్ధమైన సంకేతంగా కీర్తించబడుతుంది అన్నది జగమెరిగిన సత్యం. కర్కాటక రాశి వారి వలనే, వీరు కూడా కోపావేశాలకు లోనైనప్పుడు వ్యంగ్య ధోరణిని అవలంభిస్తుంటారు. సింహ రాశి వారు కాల్క్యులేటెడ్ మైండ్స్ వలె చెప్పబడుతారు. వీరు ఎవరిని లక్ష్యం చేసుకుంటారో, వారి మీద ఆధిపత్య ధోరణిని ప్రదర్శించాలని ప్రయత్నిస్తుంటారు. గెలవడం కోసం ఎంపిక చేసుకునేవారి విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తుంటారు. క్రమంగా ఫలితాల సాధన వీరికి సులువుగా ఉంటుంది.

Zodiac Signs Known To Be The Most Cruel

వృశ్చిక రాశి :

ఈ జాబితాలో వృశ్చిక రాశి చివరిదిగా ఉంటుంది. భిన్న ప్రవర్తనలను ప్రదర్శించడంలో వృశ్చిక రాశి వారు వైవిధ్యంగా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అది సంతోషమైనా, భావోద్వేగాలైనా, క్రూరత్వమైనా పూర్తి స్థాయిలో సంపూర్ణతను కలిగి ఉంటారు. వీరికి ఒక వ్యక్తి మీద కోపావేశాలు తలెత్తినప్పుడు, వారి గౌరవ భావాలను గురించిన ఆలోచనను ఏమాత్రమూ కలిగి ఉండరు. వెనుక మాటల స్వభావాలు లేని కారణంగా, మొఖం మీదే అవమానించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అవతలి వారు భాదపడుతున్నా, ఏమాత్రం కనికరించని స్వభావం వీరి సొంతం. క్రమంగా వీరి కోపావేశాలు తారాస్థాయికి చేరినప్పుడు, మీ ఉద్దేశాలను, విలువలను కూడా లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీరి స్నేహితుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని జ్యోతిష్కులు చెప్తుంటారు. అయితే, కుటుంబ సభ్యుల పట్ల వీరి ప్రేమ, మరియు జాగ్రత్త అనిర్వచనీయం. క్రమంగా తమ కుటుంబం జోలికి వచ్చిన వారిని, తమ మనస్సులో ప్రత్యేకమైన శత్రువులుగా నిర్దారించుకుంటూ ఉంటారు.

Zodiac Signs Known To Be The Most Cruel

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Zodiac Signs Known to be the most cruel

    Zodiac Signs Known To Be The Most Cruel
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more