For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో రాగితో చేసిన సూర్యుడిని పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, ఏ దిక్కున పెట్టాలంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం రాగితో తయారు చేసిన సూర్యుడిని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుంది. అయితే రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇంట్లో సానుకూల శక్తి పెంచుకోవడానికి, కుటుంబసభ్యులు ఆనందంగ, ఆరోగ్యంగా జీవించడానికి వాస్తు చిట్కాలు పాటించడం చాలా ముఖ్యం. వాస్తు దోషాల వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితం రాదు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. ఇంట్లో ఉండాల్సిన ప్రశాంతత లభించదు.

Copper Sun Vastu : Place the sun made of copper at home to bring luck, prosperity in Telugu

వాస్తు శాస్త్రం ప్రకారం రాగితో తయారు చేసిన సూర్యుడిని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసివస్తుంది. అయితే రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో సూర్యకాంతి ప్రయోజనాలు:

ఇంట్లో సూర్యకాంతి ప్రయోజనాలు:

హిందూ పురాణాల్లో సూర్యుడిని దేవతగా పూజిస్తారు. భారత దేశంలో చాలా మంది శక్తి ఇవ్వమని సూర్యుడిని పూజిస్తారు. సూర్యకాంతి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. చంటి పాపలను రోజూ ఉదయం వేళ సూర్యుడి కిరణాలు పడేలా ఉంచాలని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. సూర్యుడి కిరణాలు శిశువుకు నేచురల్ ఫోటోథెరపీగా పని చేస్తుందని అంటారు. దీని వల్ల శిశువుల్లో కామెర్లు రావు. రోజూ ఉదయం ఎండలో నడవడం వల్ల శరీరానికి విటమిన్ -డి అందుతుంది.

రాగితో చేసిన సూర్యుడితో వాస్తు ప్రయోజనాలు:

రాగితో చేసిన సూర్యుడితో వాస్తు ప్రయోజనాలు:

ఇంట్లో రాగితో చేసిన సూర్యుడిని ఉంచితే ఇంటికి, కుటుంబసభ్యులకు పాజిటివ్ శక్తి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. రాగి సూర్యుడిని ఇంట్లో పెడితే కీర్తి, శ్రేయస్సు సిద్ధిస్తాయి.

రాగిని ప్రభావవంతమైన లోహంగా పరిగణిస్తారు. రాగితో చేసిన సూర్యుడిని ఇంట్లో పెట్టడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. కుటుంబసభ్యుల మధ్య సామరస్యాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. దాని నుండి వెలువడే శక్తి ఇంట్లో శ్రేయస్సును కలిగిస్తుంది. కుటుంబసభ్యుల మధ్య ఉండే అసమ్మతి, అసంతృప్తి తొలగిపోతాయి.

రాగితో చేసిన సూర్యుడిని కార్యాలయాలు, వ్యాపార దుకాణాల్లో పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

రాగితో చేసిన సూర్యుడిని ఎక్కడ పెట్టాలి:

రాగితో చేసిన సూర్యుడిని ఎక్కడ పెట్టాలి:

* రాగితో చేసిన సూర్యుడిని తూర్పు దిశలో ఉంచాలి.

* తూర్పు దిశలో కిటికీ ఉంటే దానికి వేలాడదీయాలి. కిటికీ లేకపోతే గోడకు వేలాడదీయవచ్చు.

* ఇలా వేలాడదీయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. కుటుంబసభ్యుల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడతాయి.

* తూర్పు దిశలో రాగితో చేసిన సూర్యుడిని ఉంచడం వల్ల ప్రేమ, అనురాగాలు పెంపొందుతాయి.

* తూర్పు దిశలో సూర్యుడిని ఉంచడం వల్ల తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారు త్వరలోనే ఉద్యోగానికి ఎంపిక అవుతారు. వ్యాపార స్థలంలో ఉంచితే లాభాలు సిద్దిస్తాయి. కార్యాలయంలో ఉంచితే సానుకూల ఫలితాలు వస్తాయి.

* రాగితో చేసిన సూర్యుడిని తూర్పు దిశతో పాటు ఈశాన్య మూలలోనూ ఉంచవచ్చు.

* పడకగదికి లేదా బాత్రూముకు సమీపంలో సూర్యుడిని వేలాడదీయవద్దు.

* రాగి సూర్యుడిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ కడగడం, తుడవడం చేస్తుండాలి.

* రాగితో చేసిన సూర్యుడు కింద పడి విరిగిపోతే దానిని ఎట్టిపరిస్థితుల్లోనే మళ్లీ వేలాడదీయవద్దు.

* దానిని వెంటనే ఇంట్లోంచి తీసేయాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇంట్లో రాగితో తయారు చేసిన సూర్యుడిని పెట్టే ముందు ఈ వాస్తు చిట్కాలు పాటించారంటే అదృష్టం కలిసిరావడంతో పాటు ఇంకా ప్రయోజనాలు పొందవచ్చు. అయితే రాగి సూర్యుడిని శుభ్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు. బూజు పట్టుకుండా, దుమ్ము చేరకుండా అప్పుడప్పుడు శుభ్రం చేస్తుండాలి.

English summary

Copper Sun Vastu : Place the sun made of copper at home to bring luck, prosperity in Telugu

read this to know Copper Sun Vastu : Place the sun made of copper at home to bring luck, prosperity in Telugu
Desktop Bottom Promotion