Just In
- 1 hr ago
మీ రోజువారీ ఆహారంలో ఈ 9 ఆహారాలు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి...
- 1 hr ago
ఇంట్లో తులసి మొక్క ఎండిపోయిందా? జీవితంపై విపరీత ప్రభావం పడుతుంది
- 9 hrs ago
Today Rasi Palalu 06 February 2023: ఈరోజు మేషరాశికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి,తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసు
- 11 hrs ago
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
HYD Gold ATM: హైదరాబాద్ లో గోల్డ్ ATM, ఎలా పనిచేస్తుందో తెలుసా?
HYD Gold ATM: ఏటీఎంలో డబ్బులు తీసుకుంటాం. బ్యాంకులు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంత కావాలనుకుంటే అంత కార్డుతో మనీ డ్రా చేసుకుంటాం. అలా బంగారం తీసుకునేలా దేశంలో తొలిసారి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి ఛాంబర్స్ లో ఉన్న గోల్డ్ సిక్కా సంస్థ కార్యాలయంలో ఈ గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా బంగారం విత్ డ్రా చేసుకోవచ్చు.
గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను డ్రా చేసుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ తో పాటు వాటి నాణ్యత తెలిపే పత్రాలు కూడా జారీ అవుతాయి.
గోల్డ్ ఏటీఎం ఎలా పని చేస్తుంది?
బంగారు ఏటీఎంలు ఇతర ఏటీఎం లాగానే పని చేస్తాయి. ఏటీఎంకి స్వైప్ చేయడానికి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ అవసరం. ఆ తర్వాత కొనుగోలుదారు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఐచ్ఛికాలు ఎంపిక చేసుకోవాలి.
0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. మనకు ఎంత బంగారం తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు. బంగారం కావాలనుకుంటే జూవెల్లరీలకు తిరగాల్సిన పని లేకుండా ఈ గోల్డ్ ఏటీఎంతో గోల్డ్ కాయిన్స్ విత్ డ్రా చేసుకోవచ్చు. బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా ఎప్పటికప్పుడు మారేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేశారు. ఈ ధర ఆధారంగా గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు. ఈ బంగారు నాణేలు కూడా 99.99% స్వచ్ఛత అంటే 24 క్యారెట్ బంగారం ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా వస్తుంది. వీటితో పాటు బంగారు నాణ్యత తెలిపే పత్రాలు కూడా జారీ అవుతాయి. 0.5 గ్రాముల కంటే తక్కువ మొత్తంలో బంగారం కొనడానికి వీలు లేదు.