For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google Top Searches 2022: 2022లో భారతీయులు ఎక్కువగా వెతికింది వీటినే

2022లో గూగుల్‌లో మనోళ్లు బాగా వెతికిన టాప్ సర్చెస్ ఏంటో, వేటి గురించి భారతీయులు ఎక్కువగా వెతికారో ఇప్పుడు చూద్దాం.

|

Google Top Searches 2022: మరికొన్ని రోజుల్లో 2022 ఏడాది ముగిసిపోనుంది. 2023 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో చాలా సంఘటనలు జరిగాయి. పలు ఘటనలు దేశాన్ని కుదిపేశాయి.

Google year in search 2022 this is what people googled most for during the year in india

2022లో గూగుల్‌లో మనోళ్లు బాగా వెతికిన టాప్ సర్చెస్ ఏంటో, వేటి గురించి భారతీయులు ఎక్కువగా వెతికారో ఇప్పుడు చూద్దాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)

2022 సంవత్సరంలో భారతీయులు ఎక్కువగా వెతికింది ఐపీఎల్(IPL) గురించే. దాని తర్వాత కొవిన్ యాప్ గురించి ఎక్కువగా వెతికారు. దాని తర్వాత ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ గురించి గూగుల్ తల్లిని ఎక్కువగా ప్రశ్నలు అడిగారు. ఆసియా కప్, ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.

బ్రహ్మాస్త్ర

బ్రహ్మాస్త్ర

భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకున్న భారీ వీఎఫ్ఎక్స్ చిత్రం బ్రహ్మాస్త్ర గురించి భారతీయులు ఎక్కువగా గూగుల్‌లో వెతికారు. అలాగే KGF: ఛాప్టర్ 2, కశ్మీర్ ఫైల్స్, RRR, కాంతార, పుష్ప: ది రైజ్, అలాగే విక్రమ్ సినిమాల గురించి ఎక్కువ మంది సెర్చ్ చేశారు. వీటితో పాటు లాల్ సింగ్ చద్దా, దృశ్యం-2, థోర్ లవ్ అండ్ థండర్ సినిమాల గురించి గూగుల్ తల్లిని ఎక్కువగా ప్రశ్నించారు.

అగ్నిపథ్

అగ్నిపథ్

కేంద్రం తీసుకు వచ్చి అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా ఎంత పెద్ద దుమారం లేపిందో తెలిసిందదే. ఈ పథకం అంటే ఏంటి, దీని వల్ల ప్రోస్, కాన్స్ ఏంటో చాలా మంది గూగుల్‌లో వెతికారు. 'వాట్ ఈజ్' జాబితాలో అగ్నిపథ్ స్కీమ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(NATO), నాన్ ఫంజిబుల్ టోకెన్(NFT) ఉన్నాయి.

దగ్గర్లో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు

దగ్గర్లో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు

దగ్గర్లో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల కోసం చాలా మంది గూగుల్‌లో వెతికారు. తర్వాత స్విమ్మింగ్ పూల్, వాటర్ పార్కు, సినిమాల గురించి చాలా మంది వెతికారు.

How

How

గూగుల్ సెర్చ్ 'HOW' జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ గురించే. వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా సర్టిఫికేట్ ఎలా పొందాలో గూగుల్‌లో చాలా మంది వెతికారు. తర్వాత ఎక్కువ మంది వెతికింది పీటీఆర్సీ చలాన్ డౌన్‌లోడ్ గురించి.

నుపుర్ శర్మ

నుపుర్ శర్మ

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశంలో అల్లర్లకు, విదేశాల నుండి క్షమాపణల డిమాండ్లకు కారణం అయిన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ గురించి 2022 సంవత్సరంలో చాలా మంది వెతికారు. తర్వాతి స్థానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యునైటెడ్ కింగ్‌డమ్‌ కొత్త ప్రధాని రిషి సునాక్, లలిత్ మోదీ, సుస్మితా సేన్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

పనీర్ పసంద

పనీర్ పసంద

2022లో పనీర్ పసంద రెసిపీ గురించి ఎక్కువ మంది శోధించారు. తర్వాత మోదక్ తయారీ గురించి వెతికారు. సెక్స్ ఆన్ ది బీచ్ కాక్‌టైల్, చికెన్ సూప్, మలాయ్ కోఫ్టా గురించి సెర్చ్ చేశారు.

లతా మంగేష్కర్

లతా మంగేష్కర్

లోకాన్ని విడిచి వెళ్లిన వారి గురించి భారతీయులు ఎక్కువగా వెతికారు.లతా మంగేష్కర్ గురించి భారతీయులు తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. సిద్ధూ మూసెవాలా క్వీన్ ఎలిజబెత్, షేన్ వార్న్‌ల మరణం తర్వాత ఎక్కువగా శోధించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూపీ ఎన్నికలు, హర్‌ఘర్‌ తిరంగా ప్రచారంపై కూడా ప్రజలు ఆసక్తి కనబరిచారు.

English summary

Google year in search 2022 this is what people googled most for during the year in india

read on to know Google year in search 2022 this is what people googled most for during the year in india
Desktop Bottom Promotion