For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీకటి జీవితానికి గుడ్‌బై చెప్పండిలా..?

|

మీకు సాక్ష్యం దొరికింది, మీరు మీ భాగస్వామితో ముఖాముఖీ మాట్లాడారు, ఇప్పుడు మీ వివాహ బంధాన్ని మరమ్మతు చేయచ్చేమో అని ప్రయత్నిస్తున్నారు. ఇక ముందు మీరెప్పుడైనా మళ్ళీ ప్రేమించడం, నమ్మడం చేస్తారా అని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు, లేదా మీ భాగస్వామి ఒక ప్రేమ వ్యవాహరంలో వుందని కనుగోన్నందువల్ల వచ్చే ఈ బాధ, కోపం, అసూయ నుంచి బయటపడగలారా అనుకుంటూ ఉండవచ్చు, - అలా అనుకుంటే అది సాధారణమే. ఆ బాధలో ఒంటరిగా ఉండిపోయి ఈ ప్రక్రియలో ఇక ముందేం జరుగుతుందో అని బాధపడుతూ వుండకూడదు, ఐతే ఈ వ్యాసం మీరు ఈ వ్యవహారంలోంచి బయట పడాలంటే ఈ పొడవాటి, చీకటి మార్గంలో ఏమేమి ఊహించవచ్చు అనేది తెలియచేసే దశలు మీకు చెప్తుంది.

దశలు:

1. మీరు షాక్ లో వున్నారని గుర్తించండి: మొదట్లో ఈ దశలో మీరు కేవలం అపనమ్మకం లో వుంటారు. మీ భాగస్వామి మీతో కాకుండా మరొకరితో శారీరికంగా గానీ లేదా మానసికంగా గానీ సన్నిహితంగా వున్నారని మీరు జీర్ణించుకోలేరు; వారు రహస్యంగా మరొకరి కోసం సమయం వెచ్చించి వారి కోసం వెళ్ళేవారన్న విషయం మీకు మింగుడు పడదు. ఈ దశలో మీరు ఒక పొగ మంచు లాంటి ముసుగులో వుండి చుట్టూ ఏమి జరుగుతోందో తెలుసుకోలేని స్థితిలో వుంటారు - ఇది ఒక ‘పీడా కలా' కాదా తెల్చుకోలేకపోతారు.

2. కొంత కోపం ఉంటుందని తెలుసుకోండి: పరిస్థితి నిజమేనని, ఒక పీడా కల కాదని అర్ధం అవుతూ వుంటుంది. ఈ దశలో మీకు శారీరిక అనారోగ్యం రావచ్చు, మీరు పక్క దిగాలేరు, పనికి వెళ్ళలేరు, లేదా ప్రపంచంలోకి వచ్చి ఎవరినీ కలవలేరు. ఎంతసేపూ ఈ వ్యవహారం గురించే ఆలోచిస్తూ వుంటారు. ఏడుస్తూ ఉండిపోవడం, వస్తువులు విసిరేయడం, పగలగొట్టడం, అరవడం, గొడవ పాడడం, నియంత్రణ లేని ప్రవర్తన కనపరచడం లాంటివి జరగడమూ సాధారణమే. కానీ ఇదీ గడిచిపోయే దశేనని, ఆవేశంలో, బాధలో తీసుకునే నిర్ణయాలకు తరువాత పశ్చాత్తాప పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

How to Recover from an Affair

3. కోపాన్ని వదిలేయండి: ఈ సమయంలో మొదట్లో ఉన్నంత తీవ్రమైన కోపం తగ్గి, మీరు వంచించ బడ్డారన్న తెలియని బాధ వుండిపోతుంది. సరిగ్గా ఇప్పుడే మీరు రాజీ పడాలనో, లేక వివాహ బంధానికి ముగింపు పలకాలనో ఆలోచన మొదలవుతుంది. తీవ్రంగా గాయపడినా, ఆవేశంలో కాక కాస్త తర్కంతో ఆలోచిస్తారు, కానీ జీవితాన్ని, మీ లక్ష్యాలను, మీ వివాహబంధం ఎందాకా వెళ్ళాలి అన్న విషయాలు విశ్లేషించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ దశలో గొడవ పడడం, ఏడవడం లేదా రోజులో 24 గంటలూ దాని గురించే ఆలోచించడం లాంటి వాటికి మీకు ఓపిక వుండదు.

4. సంబంధబాందవ్యాలు, సహాకారం అవసరం: ముక్కలన్నీ దగ్గరకు చేర్చండి. మీరు మీ వివాహ బంధాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనుకున్నా, పెట్టగలిగినా ఈ దశలోనే మీ భాగస్వామి నుంచి సంపూర్ణము, స్థిమితము, పరిపూర్ణమూ అయిన సహకారం అవసరం. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ అనీ, పునరుద్ధరణకు ఆటంకాలు కల్పిస్తే అది మరింత జటిలమౌతుందనీ అతను లేదా ఆమె తెలుసుకోవాలి.

5. మళ్ళీ నమ్మడం నేర్చుకోండి: మీరు మీ ప్రస్తుత సంబంధాలను పునరుద్దరించు కుంటున్నా లేక కొత్తది మొదలు పెడుతున్నా ఇది కష్టమైనా దశే. ఐతే అంత త్వరగా కొత్త సంబంధాలు పెంచుకోవడం శ్రేయస్కరం కాదు, ఎందుకంటే మీ పాత గాయాలు మాని మీతో మీరు సౌకర్యంగా ఉండగలిగే దాకా కొత్త వ్యక్తిని ఆహ్వానించకండి. మీ వివాహాన్ని పునరుద్ధరించుకుంటుంటే మోసం చేసిన వారు తమ మనసును తెరిచిన పుస్తకంలా ఉంచితేనే నమ్మడం సాధ్యమౌతుంది. ఇది దీర్ఘమైన, మెల్లగా జరిగే ప్రక్రియ - కాలం గడిచే కొద్దీ మాత్రమె మెరుగౌతుంది.

6. ట్రిగ్గర్లతో ఎలా ఉండాలో తెలుసుకోండి. మీ భాగస్వామి ప్రేమ వ్యవహారాన్ని బాధాకరంగా గుర్తు చేసే కొన్ని పేర్లు, ప్రదేశాలు, సంఘటనలు లాంటివాటిని ట్రిగ్గర్లు అంటాం. బహుశా ఈ వ్యవహారం సమయంలో ప్రసిద్ధమైన పాట, వారు సందర్శించిన హోటల్ లేదా మోటెల్, వాళ్ళు తిరిగిన ప్రదేశాలు, వారితో పని చేసిన వ్యక్తులు, లేదా పరస్పర మిత్రులు కూడా ట్రిగ్గర్లు కావచ్చు.

7. వాస్తవిక లక్ష్యాలు కలిగి వుండండి: మీరు ప్రస్తుత బంధం కొనసాగించగలరో లేదో తెలిసిపోయే తరుణమిదే. నిజానికి, అది ఎప్పుడూ ఒకేలా వుండదు, కానీ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మీరు కొత్త వాస్తవాలకు అలవాటు పాడడం నేర్చుకోవాలి. ఇది పరిశీలించండి. మీరు ఇలాగే కొనసాగగలరా? మీరు తిరిగి మీ భాగస్వామిని నమ్మచ్చు అని అనుకుంటున్నారా, ఇక ఈ వ్యవహారం గురించిన ప్రశ్నలు, వ్యాఖ్యలతో వారిని వేధించకుండా ఉండగలరా? వారు తమ తప్పిదాలకు బాధ్యతా తీసుకుని, సంబంధాల పునరుద్ధరణకు నిజాయితీతో కూడిన ప్రయత్నం చేసారా, మొదలైనవి? అలా ఐతే సమయం గడిచే కొద్దీ ఈ బంధం బాగుపడుతుందని మీరు అనుకుంటే, ఈ వివాహ బంధాన్ని కొనసాగించడం వాస్తవిక లక్ష్యం అవుతుంది. మరో వంక, మీ భాగస్వామి వ్యవహారం గురించి ఒప్పుకోకపోతే, లేదా సమాధానాలు చెప్పకపోతే, లేదా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే, మరో స్త్రీ లేక పురుషుడిని సంప్రదిస్తూనే వుంటే, మీరు దీనితో సరిపెట్టుకోగలరా అనేది కూడా తేల్చుకోవాలి. లేదంటే రాజీ అనేది వాస్తవిక లక్ష్యం కాకపోవచ్చు.

8. ఆరోగ్యకరంగా మిమ్మల్ని మీరు మార్చుకోండి: అతను లేక ఆమె వున్నా లేకపోయినా మీరు కోలుకుని బాగానే వుంటారు. సమయం సమయం పడుతుంది గానీ, ఈ అనుభవం నుంచి మీరు మరింత ఆరోగ్యంగా, ధృడంగా, మరింత జ్ఞానంతో బయటకి వస్తారు. మీ ఆనందాన్ని పూర్తిగా మరో వ్యక్తీ బాధ్యతకు వదిలివేయడం కుదరదని గ్రహించండి. ఈ ప్రక్రియలో, మీరు కొంత ఆత్మా శోధన చేసుకుని మీ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు వేరుగా ఏమైనా చేసి ఉండవచ్చా అనేది పరిశీలించండి.

9. సున్నిత స్వభావం: మీతో మీరు సున్నితంగా వుండి కొత్త అభివృద్ధికి సిద్ధంగా వుండండి. ఒక ఒక ప్రేమ వ్యవహారం తరువాత మీ గురించి, మీ భాగస్వామి గురించి, మీ బంధం గురించి తెలుసుకోవాల్సినది చాలా వుంటుంది. ఈ పాఠాలను మరచిపోయి గాయాల మీదే దృష్టి కేంద్రీకరించకండి. గుర్తుంచుకోండి: మనల్ని చంపలేనిది మనల్ని మరింత ధృడంగా తయారు చేస్తుంది. (మీరు దాన్ని అందుకు అనుమతి౦చాలన్నది ఇక్కడ కిటుకు)

English summary

How to Recover from an Affair | చీకటి జీవితానికి స్వస్తి పలకండిలా..?

You've found the evidence, you've confronted your spouse, and you're now trying to figure out if the marriage can be repaired. If you're wondering if you will ever love and trust again, or be able to get over the hurt, rage, and jealousy that result from discovering your mate had an affair, your feelings and concerns are perfectly normal.
Desktop Bottom Promotion