For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 10 మంది మ‌హిళ‌ల క్రూర‌త్వం గురించి తెలుసుకుంటే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తుంది!

By Sujeeth Kumar
|

స్త్రీ మూర్తి ప్రేమ‌కు, ఆప్యాయ‌త‌కు, అనురాగానికి, విన‌మ్ర‌త‌కు చిహ్నం. మ‌హిళ‌లు విన‌యానికి, క్ష‌మాగుణానికి మారుపేరు. కానీ చ‌రిత్ర పుట‌ల‌ను తిరిగి చూస్తే ఇలాంటి వారు కూడా ఉంటారా అని ఆశ్చ‌ర్య‌పోవాల్సి వ‌స్తుంది.

వాళ్ల క్రూర‌త్వానికి యావ‌త్ ప్ర‌పంచం వ‌ణికిపోయిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. టార్చ‌ర్‌, మ‌ర్డ‌ర్లు, హింసించ‌డం లాంటివెన్నో చేసి పైశాచిక ఆనందాన్ని పొందేవారు కొంద‌రు క్రూర‌మైన మ‌హిళ‌లు.

సాధార‌ణంగా మ‌నం క్రూరమైన వారంటే ఎక్కువ‌గా మ‌గ‌వారిపైనే దృష్టిపెడ‌తాం. అయితే ఈ క‌థ‌నంలో ఇప్పుడు ప్ర‌పంచ చ‌రిత్ర‌లో క్రూరంగా ప్ర‌వ‌ర్తించిన సంగ‌తులను తెలుసుకుందాం.

ఒక స్త్రీ తన భర్త యొక్క జననాంగాలను ముక్కలు ముక్కలుగా నరుకుదాం అని ఎందుకు నిశ్చయించుకుందంటే ఒక స్త్రీ తన భర్త యొక్క జననాంగాలను ముక్కలు ముక్కలుగా నరుకుదాం అని ఎందుకు నిశ్చయించుకుందంటే

ఇర్మా గ్రేస్‌

ఇర్మా గ్రేస్‌

ఇర్మా ఇడా ఇల్సే గ్రేస్ అక్టోబ‌ర్ 7, 1923లో జ‌ర్మ‌నీలో ని మెక్లెన్‌బ‌ర్గ్ అనే ప‌ట్ట‌ణంలో పుట్టారు. నాజీ క్యాంపుల్లో ఆమె ఉండేది. మ‌హిళ‌ల సెక్ష‌న్‌లో వార్డెన్ గా ఆమె ప‌నిచేసేది. మాన‌వ‌త్వ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించినందుకు ఆమెకు బెల్సిన్ ట్ర‌య‌ల్ కోర్టు మ‌ర‌ణ శిక్ష‌ను విధించింది. ఆమె ఇత‌రుల‌ను వివిధ ర‌కాలుగా హింసించేది. ఆమె ఎప్పుడూ భారీ బూట్లు తొడుక్కునే పెద్ద శ‌బ్దం చేస్తూ న‌డిచేద‌ని చెబుతారు. ఆమె త‌న వెంట ఎప్పుడూ ఒక పిస్టోల్ ఉంచుకునేది. అతిచిన్న వ‌య‌సులో చ‌ట్ట‌ప‌రంగా మ‌ర‌ణ‌శిక్ష పొందిన మ‌హిళ‌లో ఈమె ఒక‌రు. ఆమెను డిసెంబ‌ర్ 13, 1945లో ఉరితీశారు. ఆమెకు బీస్ట్ ఆఫ్ బెల్సెన్‌, బ్యూటిఫుల్ బీస్ట్‌, డై హ‌యానే వాన్ ఆశ్‌విట్జ్ అనే నిక్ నేమ్స్ చాలానే ఉన్నాయి.

మిరా హిండ్లీ

మిరా హిండ్లీ

మిరా హిండ్లీ 1942లో జ‌న్మించింది. ఆమె సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి చెందింది. ఇయాన్ బ్రాడీ అనే వ్య‌క్తితో క‌లిసి 5గురు చిన్న పిల్ల‌ల్ని అతి దారుణంగా రేప్ చేసి మ‌ర్డ‌ర్ చేసింది. ఇద్ద‌రు క‌లిసి 12 ఏళ్ల‌లోపు ఉన్న ఒక పిల్ల‌ను, ఇద్ద‌రు టీనేజ‌ర్స్‌ను కిడ్నాప్ చేసి లైంగికంగా హింసించి, టార్చ‌ర్ పెట్టి చిత్ర‌వ‌ధ‌ల‌కు గురిచేసి మ‌రీ చంపారు. హిండ్లీకి వ‌రుసకు మ‌రిది అయ్యే ఒక వ్య‌క్తి ఆమె గురించిన స‌మాచారాన్ని పోలీసులుకు చెప్ప‌డంతో ఆమె ప‌ట్టుబ‌డింది. హిండ్లీ చేసిన అన్ని హ‌త్య‌ల‌కు సాక్ష్యాల‌ను పోలీసులు క‌నుక్కోలేక‌పోయారు. ఆమె చేసిన మూడు హ‌త్య‌ల‌కు గాను ఆమెను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించారు. 2002లో ఆమె జైలులోనే మ‌ర‌ణించింది.

ఆ తెగకు చెందిన మహిళలు పెళ్లికి ముందే శృంగారంలో స్వేచ్ఛగా పాల్గొనవచ్చు! ఆ తెగకు చెందిన మహిళలు పెళ్లికి ముందే శృంగారంలో స్వేచ్ఛగా పాల్గొనవచ్చు!

ఇసాబెల్‌

ఇసాబెల్‌

ఇసాబెల్‌ 1451లో జ‌న్మించింది. ఆమె క్యాస్టిల్‌, లియోనీ రాజ్యాల‌కు రాణి. ఇసాబెల్లి క్యాథ‌లిక్. ఆమె త‌న భ‌ర్త అర‌గాన్ రాజ్యానికి చెందిన ఫెర్డినాండ్ తో క‌ల‌సి చుట్టుప‌క్క‌ల రాజ్యాల్లో స్థిర‌మైన పాల‌న‌ను తీసుకొచ్చింది. ఇదే ఆ త‌ర్వాత కాలంలో స్పెయిన్ దేశంగా అవ‌త‌రించింది. ఇసాబెల్‌, ఫెర్నినాండ్‌లు క‌లిసి ముస్లింలు, యూదుల‌ను త‌మ రాజ్యం నుంచి బ‌హిష్క‌రించారు. అమెరికాను క‌నుగొన్న క్రిస్ట‌ఫ‌ర్ కొలంబ‌స్ స‌ముద్ర ప్ర‌యాణానికి వీరిద్ద‌రూ ఆర్థిక స‌హాయం చేశారట‌. ఇసాబెల్‌కు 1974లో క్యాథ‌లిక్ చ‌ర్చి వారు స‌ర్వెంట్ ఆఫ్ గాడ్‌గా ఆమెకు పేరు ఇచ్చారు.

బెవ‌ర్లీ అల్లిట్‌

బెవ‌ర్లీ అల్లిట్‌

ఏంజెల్ ఆఫ్ డెత్‌గా.. బెవ‌ర్లీ అల్లిట్‌కు పేరుంది. ఆమె అత్యంత క్రూర‌మైన 10 మ‌హిళ‌ల్లో ఒక‌రు. ఇంగ్లాండుకు చెందిన ఆమె ఒక సీరియ‌ల్ కిల్ల‌ర్‌. న‌లుగురు పిల్ల‌ల‌ను హ‌త్యచేసినందుకు, మ‌రో ముగ్గురి పిల్ల‌లపై హ‌త్యా ప్ర‌య‌త్నం చేసినందుకు, ఇంకో 6గురు పిల్ల‌ల‌ను తీవ్రంగా హింసించినందుకు ఆమెకు శిక్ష‌లు ప‌డ్డాయి. ఈ నేరాల‌న్నీ ఆమె కేవ‌లం 59రోజుల వ్య‌వ‌ధిలో చేసింది. అది 1991లో ఫిబ్ర‌వ‌రి-ఏప్రిల్ నెల‌ల మ‌ధ్య‌లోనే. లింక‌న్‌షేర్‌లో ఆమె న‌ర్సుగా ప‌నిచేసేది. అక్క‌డే ఇద్ద‌రు పెషేంట్ల‌కు ఆమె అధిక డోసులో ఇన్సులిన్ ఇచ్చింది. మ‌రొక వ్య‌క్తి శ‌రీరంలో పెద్ద ఎయిర్ బ‌బుల్ నింపింది. ఇవ‌న్నీ ఆమె ఎలా చేయ‌గ‌లిగిందో పోలీసుల‌కు అంతుచిక్క‌లేదు. మే 1993లో నాటింగ్‌హామ్ కోర్టు ఆమె చేసిన నేరాల‌కుగాను 13 మ‌ర‌ణ‌శిక్ష‌లు విధించింది. జ‌స్టిస్ లాథ‌మ్ ఆమె గురించి వివ‌రిస్తూ ఆమె స‌మాజానికి తీవ్ర‌మైన ప్ర‌మాదకారిగా అభిర్ణించారు. ఆమె బ‌య‌ట ఉండ‌డం వ‌ల్ల స‌మాజానికి చాలా హాని జ‌ర‌గొచ్చు అని అన్నారు.

క్వీన్ మేరీ 1

క్వీన్ మేరీ 1

1516 ఫిబ్ర‌వ‌రి 18న క్వీన్ మేరీ జ‌న్మించింది. ఆమె జులై 1553 నుంచి ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ల‌కు రాణిగా ఉంది. ఆమె 1558 సంవ‌త్స‌రం 17 న‌వంబ‌ర్ న చ‌నిపోయే వ‌ర‌కు ఆ రాజ్యాల‌కు రాణిగా కొన‌సాగింది. మేరీ స్వ‌త‌హాగా క్యాథ‌లిక్‌. ప్రొటెస్టెంట్ల‌కు ఆమె వ్య‌తిరేకి. వారి ప‌ట్ల ఆమె తీవ్రంగా ప్ర‌వ‌ర్తించేది. హెన్రి 8 మ‌రియు అత‌డి మొద‌టి భార్య క్యాథ‌రిన్ల‌కు పుట్టిన కూతురే మేరీ. దాదాపు 800 మంది ప్రొటెస్టెంట్లు ఆమె భ‌యానికి దేశం విడిచి పారిపోయారు. మ‌ళ్లీ ఆమె చ‌నిపోయాకే తిరిగి వ‌చ్చారు. ఆమెను బ్ల‌డీ మేరీగా అంద‌రూ పిలిచేవారు.

బెల్లీ గిన్నెస్‌

బెల్లీ గిన్నెస్‌

ఆర‌డుగుల ఎత్తు, 91 కేజీల బ‌రువుతో భారీగా ఉండేది బెల్లీ గిన్నెస్‌. అమెరికాలో ఆమె చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావ‌ని చెబుతారు. ఎంతో దిగ‌జారిన సీరియ‌ల్ కిల్ల‌ర్ ఆమె. నార్వే దేశ‌పు సంత‌తికి చెందిన ఈమె త‌న ఇద్ద‌రు భ‌ర్త‌ల‌ను, అంద‌రు పిల్ల‌ల‌ను వివిధ సంద‌ర్భాల్లో చంపింద‌న్న‌ది తేలింది. అయితే ఆమె ఇంకెంతో మందిని హ‌త్య‌చేసిన సంగ‌తి తేల‌లేదు. ఆస్తి కోసం క‌క్కుర్తి ప‌డి ఆమె ఇదంతా చేసిన‌ట్టు చెబుతారు. ఆమె బాయ్‌ఫ్రెండ్స్‌ను, మిరిల్‌, లూసియా అనే ఇద్ద‌రు కూతుళ్ల‌ను కూడా దారుణంగా చంపేసింది. వాళ్ల పాల‌సీ డ‌బ్బుల‌ను ఆమె కాజేసింది. ఆమె 20మందిని హ‌త్య‌చేసింద‌ని కొంద‌రు అంటే కాదు 100కంటే ఎక్కువ మందినే పొట్ట‌న‌పెట్టుకుంద‌ని చెప్తారు. ఆమెను ఫీమేల్ బ్లూబియ‌ర్డ్‌గా అభివ‌ర్ణిస్తారు.

మేరీ అన్నా కాట‌న్‌

మేరీ అన్నా కాట‌న్‌

బ్రిట‌న్ మొద‌టి సీరియ‌ల్ కిల్ల‌ర్ గా మేరీ అన్నా కాట‌న్ పేరు తెచ్చుకుంది. 1832 అక్టోబ‌ర్లో ద‌ర్హ‌మ్ దేశంలోని లో మూర్స్‌లీ అనే ప‌ట్ట‌ణంలో ఆమె జ‌న్మించింది. విలియ‌మ్ అనే వ్య‌క్తితో ఆమెకు వివాహం జ‌రిగింది. ప్లైమూత్ అనే ప్రాంతంలో వారు కాపురం పెట్టారు. ఈ జంట‌కు 5 మంది పిల్ల‌లు. విచిత్రంగా కొన్నేళ్ల త‌ర్వాత న‌లుగురు తీవ్ర‌మైన క‌డుపునొప్పితో చ‌నిపోయారు. ఆ త‌ర్వాత వాళ్లు వేరే ప్రాంతానికి వెళ్లారు. మ‌రో ముగ్గురు పిల్ల‌లు పుట్టారు. వాళ్లూ తీవ్ర‌మైన క‌డుపునొప్పితోచ‌నిపోయారు. ఆ త‌ర్వాత కొంత‌కాలానికి భ‌ర్త కూడా క‌డుపునొప్పితోనే పోయాడు. ఇదేదో వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చిన వ్యాధి అని అనుకున్నారంతా. బ్రిటీష్ రాజ్యం 35 పౌండ్లు ప‌రిహారంగా ఇచ్చింది. ఆమె రెండో భ‌ర్త జార్జ్ కూడా క‌డుపు నొప్పితోనే చ‌నిపోయాడు. ఇంకా వీళ్లిద్ద‌రికీ పుట్టిన పిల్ల‌లు కూడా అదే మాదిర‌గా మృతిచెందారు. ఆ త‌ర్వాత ఆమె మూడో వివాహం చేసుకోవ‌డం, అత‌నూ చ‌నిపోవ‌డం.. వాళ్ల స్నేహితులు, త‌ల్లి, డ‌జ‌ను పిల్ల‌లు అంద‌రూ క‌డుపు నొప్పితో చ‌నిపోవ‌డం. ఇదేదో మిస్ట‌రీ లాగా ఉంద‌ని స్థానిక పేప‌ర్లు శోధించాయి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు తెలిశాయి. ఈ చ‌నిపోయిన‌వాళ్లంతా మేరీ చేత ఆర్సెనిక్ పాయిజ‌న్ తినిపించ‌బ‌డ్డార‌ని తెలిసింది. ద‌ర్హ‌మ్ కోర్టు ఆమెకు సాధార‌ణ ఉరి శిక్ష విధించ‌కుండా మెల్ల మెల్ల‌గా చ‌నిపోయేలా ఆమెకు విషం ఇచ్చి చ‌చ్చేలా చూశారు.

ఇసె కోచ్‌

ఇసె కోచ్‌

1906 సెప్టెంబ‌ర్ 22న ఆమె జ‌న్మించింది. ఆమెను విచ్ ఆఫ్ బుచెన్‌వాల్డ్‌గా పేరుంది. బిచ్ ఆఫ్ బుచెన్‌వాల్డ్‌గాను ఆమెను పిలుస్తారు. అమెరికా సైనికులు నాజీల‌ను అంత‌మొందించాల‌ని చూస్తున్న రోజుల‌వి. నాజీల్లో ప్ర‌ధానంగా ఈమెను బంధించాల‌ని అమెరికా సైన్యం చూసేది. కార్ల్ ఒట్టో కోచ్‌కు ఈమె భార్య‌. ప‌ద‌వి దాహంతో విర్ర‌వీగేది. రాజ్యంలోని చాలా మందిని ఆమె హ‌త్యచేసింద‌ని చెబుతారు. చాలా మందిని చిత్ర‌హింస‌ల‌కు గురిచేసింద‌ని చెబుతారు. 1940లో దాదాపు 25వేల మార్క్‌(జ‌ర్మ‌న్ దేశ‌పు క‌రెన్సీ) చోరీ చేసి ఇన్‌డోర్ స్టేడియంను క‌ట్టించింది. ఆ త‌ర్వాత ఏమైందో తెలీదు ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోయింది.

కేథ‌రిన్ నైట్‌

కేథ‌రిన్ నైట్‌

1955, అక్టోబ‌ర్ 24న ఆమె జ‌న్మించింది. ఆమె చేసిన నేరాల‌కు ఇంకా జీవిత ఖైదు అనుభ‌విస్తూనే ఉంది. ఆస్ట్రేలియాలో ఎలాంటి పేరోల్ లేకుండా జీవిత ఖైదు పొందిన మొద‌టి మ‌హిళ ఈమె కావ‌డం విశేషం. ఆమె త‌న భాగ‌స్వామ్య సంబంధీకుల‌తో హింసాచ‌ర్య‌ల‌కు పాల‌ప్ప‌డ‌టం వ‌ల్ల ఆమెకు స్థానిక కోర్టు శిక్ష విధించింది. సంపారంలో వివాదాలు రావ‌డంతో ఆమె త‌న మాజీ భ‌ర్త క‌ట్టుడు ప‌ళ్ల‌ను పిండి చేసింది. ఆ త‌ర్వాత ఇంకో భ‌ర్త క‌ళ్ల ముందే 8 వారాల కుక్క‌పిల్ల‌ను గొంతు నులిమి తీవ్రంగా చంపేసింది. మూగ‌జీవి అనే క‌నిక‌రం కూడా చూపించ‌లేదు. థామ‌స్ ప్రైస్ అనే వ్య‌క్తితో సంబంధం పెట్టుకొని అత‌నితో స‌ఖ్య‌త కుద‌ర‌క అత‌డ్ని క‌త్తితో 37 సార్లు ముందు వెన‌క భాగంలో తీవ్రంగా పొడిచింది. కీల‌క భాగాల‌న్నీ నుజ్జునుజ్జ‌య్యాయి. ఆ త‌ర్వాత అత‌డి చ‌ర్మం వ‌లిచి లివింగ్ రూమ్‌లో త‌లుపుకు వేలాడ‌దీసింది. త‌ల‌ను కోసి సూప్‌గా చేసింది. మిగ‌తా భాగాల‌ను గ్రేవీగా చేసింది. కొన్ని రోస్ట్ చేసి పిల్ల‌ల‌కు ఆహారంగా ఇవ్వ‌బోయింది. అదృష్ట‌వ‌శాత్తు వారుతిన‌క‌ముందే పోలీసులు ఆమెను ప‌ట్టుకున్నారు.

ఎలిజ‌బెత్ బ‌తోరి

ఎలిజ‌బెత్ బ‌తోరి

ఎలిజ‌బెత్ బ‌తోరి 1560లో జ‌న్మించింది. హంగేరీ రాజ్యాన్ని అప్ప‌ట్లో బ‌తోరి వంశ‌స్తులు పాలించేవారు. ఆ వంశానికి చెందిన దొర‌సాని ఎలిజ‌బెత్‌. ఆమె సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. ఆమె చేసిన హ‌త్య‌ల లెక్క గురించి క‌థ‌లుక‌థలుగా చెప్పుకుంటారు. ర‌క్త‌పు దొర‌సానిగా ఆమెను అభివ‌ర్ణిస్తారు. రైతుల కూతుళ్ల‌ను ఆమె తీవ్రంగా కొట్టి, కాల్చి చంపేదని చెబుతారు. ముఖాన్ని న‌లిపేసి, శ‌రీర భాగాల‌ను కుళ్ల‌బొడిచి మ‌రీ చంపేదని చ‌రిత్ర‌కారులు చెబుతారు. ఆమె హోదా వ‌ల్ల శిక్ష విధించ‌లేక‌పోయారు కానీ ఆమె జీవించినంత కాలం ఆమెను గృహ‌నిర్బంధంలో ఉంచారని అంటారు.

All Images source

English summary

The 10 Most Evil Women in History of Ther world

This article, however, will throw light upon 10 most evil women in the world.
Story first published:Monday, October 30, 2017, 17:24 [IST]
Desktop Bottom Promotion