For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీవితాన్ని నాశనం చేసే 10 విషపూరిత భావోద్వేగాలు

By Lekhaka
|

భావోద్వేగం పొందడం అనేది మానవ సహజం. కానీ, మీరు దాన్ని ఎలా నిర్వహిస్తారో లేదా ఎలా వ్యక్తీకరిస్తారో అనేవి మీ స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తాయి.

భావోద్వేగాలను మంచి, చెడు అని విడదీయడం చాలా కష్టం. ఇదంతా పరిస్ధితి మీద ఆధారపడి ఉంటుంది. సమతుల్యతగా ఉండడం అనేది చాలా కష్టం, కానీ విలువతో కూడిన ప్రయత్నం. మనం సంతోషంగా, ఆనందంగా ఉండడాన్ని ఇష్టపడతాము. కానీ, కొన్ని విషపూరిత భావోద్వేగాలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయని మీకు తెలుసా?

మీరు సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి అంటే, మీ భావోద్వేగాలలో ఉన్న తప్పులు మీరు గమనించాలి. మీ జీవితాన్ని నాశనం చేసే భావోద్వేగాలను మీరు గుర్తించినపుడు మీరు వాటిని అనుభవించి గమనించడానికి సహాయపడతాయి. చాలామంది ;చాలా సాధారణంగా ఉనారు, ప్రతిరోజూ వారు దాదాపు అనుభవిస్తూ ఉంటారు. ఇవి మిమ్మల్ని కిందకు తోసి, బైట ప్రపంచానికి దూరం చేస్తాయి. మీకు మీరే బాధపడుతుంటే, వాటిని నిర్వహించడానికి వెంటనే మార్గాన్ని వెతుక్కోవాలి లేదా మీరు దాన్ని తెలియచేసే విధానాన్ని మార్చుకోవాలి.

మీ జీవితాన్ని నాశనం చేసే కొన్ని సాధారణ భావోద్వేగాల గురించి; ఇక్కడ వివరించబడ్డాయి. మీ భావోద్వేగాలను గుర్తుచేసుకోడానికి కొంత సమయం తీసుకోండి. అనుకూల పనులపై దృష్టిపెట్టి, ప్రతికూలమైన వాటిపై పనిచేయండి.

కోపం

కోపం

మీ జీవితాన్ని నాశనం చేసే విషపూరిత భావోద్వేగాలలో ఒకటైన కోపాన్ని ఎవరూ ఎదుర్కోలేరు. కోపం పట్ల మీ ప్రతిస్పందన మీ మనశ్శాంతిని గుర్తించడానికి చాలా ముఖ్యం.

అసూయ

అసూయ

అసూయ మీ జీవితంలో సంతోషాన్ని ఉండనివ్వదు. సాధారణంగా ఈ భావాన్ని చూపించేవారికి అంత విలువ ఉండదు. మీకు మీరుగా ఉండండి, ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవద్దు.

ఆతురత

ఆతురత

ఇది సాధారణంగా అభద్రతా భావం వల్ల వస్తుంది. దీన్ని సరిగా నిర్వహించుకోకపోతే, మిమ్మల్ని నిరాశలోకి తీసుకెళుతుంది. ఇది నమ్మకం లేనపుడు, భయం, నిద్రలేమీ వల్ల ఏర్పడుతుంది.

భయం

భయం

భయానికి కారణం ఉండొచ్చు లేకపోవచ్చు. మీ భయానికి కారణం తెలియనపుడు, దాన్ని ఎదుర్కోలేరు లేదా మీరలేరు. మీరు ఏదైనా చేయాలనీ ప్రయత్నించినపుడు భయపడుతున్నారా అనేది గమనించుకోండి.

దుఖం

దుఖం

ఏవైనా సంఘటనలు జరిగినపుడు దుఖం రావడం అనేది సహజం. కానీ, ప్రత్యేకమైన కారణం లేకుండా భావోద్వేగాలను పొందినపుడు, జాగ్రత్తగా ఉండండి!

నిరాశ

నిరాశ

నిరాశ అనేది సాధారణంగా మీరు వాస్తవం నుండి దూరంగా ఆలోచనలు వచ్చి ఒకటి లేదా ఎక్కువ భావోద్వేగాలు కలిగినపుడు వస్తుంది. దాన్ని మొదట్లోనే తుంచకపోతే, దీనికి నిపుణుల చికిత్స అవసరమవ్వోచ్చు.

అపరాధభావన

అపరాధభావన

సరైన కారణం కోసం అపరాధ పాడడం అనేది ఎప్పుడూ అంగీకరించబడేదే. కానీ, అది మీజీవితాన్ని నాశనం చేసే విషపూరిత భావోద్వేగాలలో ఒకటైతే దానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

అసూయ

అసూయ

మీరు ఇతరుల విజయాన్ని చూసినపుడు, సంతోషంగా ఉండలేకపోతున్నాను అని భావించినపుడు, మీరు ఈ భావోద్వేగానికి బాధితులు అని అర్ధం. దీన్ని పరిష్కరించుకోవడానికి మిమ్మల్ని మీరు గౌరవి౦చుకోవడ౦ అనేది మంచి పద్ధతి. మీకు తెలియకు౦డానే ఇతరుల విజయాన్ని భరించలేనపుడు, మిమ్మల్ని ;మీరు చికిత్స చేసుకోవడ౦ చాలా అవసరం.

ఆవేదన

ఆవేదన

అసౌకర్యం, విచారం అనే భావనలు ఆవేదనకు ప్రతిబింబాలు. ఇవి మీ ;వ్యక్తిత్వంపై ప్రభావాన్ని చూపించి, మీ ఆలోచన విధానంలో చెడు మార్గాలను చూపిస్తాయి.

సిగ్గు

సిగ్గు

ఈ భావోద్వేగా డిగ్రీ మీరు సాధారణంగా ఉన్నారా లేదా అనే విషయాన్నీ వివరిస్తుంది. కారణం లేకుండా సిగ్గుపడుతుంటే, అది మిమ్మల్ని అంతర్ముఖుల్ని చేసి, మీ వ్యక్తిత్వ౦, వృత్తి, సాంఘిక జీవితంపై ప్రభావం పడుతుంది.

English summary

10 Toxic Emotions That Will Spoil Your Life

10 Toxic Emotions That Will Spoil Your Life,Here we will discuss some of the common emotions that will spoil your life. Take some time to review your emotions. Focus on the positive ones and work on the negative ones.
Desktop Bottom Promotion