For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆశ్చర్యం కాదు, ఇది నిజం! ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి 12 వేళ్లు !

By Y. Bharath Kumar Reddy
|

వారు కాస్త భిన్నంగా ఉంటారు. అందరికీ చేతికి పది వేళ్లు ఉంటాయి. కాలికి పది వేళ్లు ఉంటాయి. కానీ వారికి మాత్రం పన్నెండేసి చొప్పున ఉంటాయి.

సాధారణంగా జన్యు లోపం వల్ల ఇలాంటి సమస్య తలెత్తుతూ ఉండొచ్చు. దీంతో వారికేకాకుండే వారి సంతానానికి కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చు.

అయితే ఒక కుటుంబానికి చెందిన సుమారు 14 మందికి ఇలా చేతికి పన్నెండు వేళ్లు ఉండడం, కాలికి 12 వేళ్లు ఉండడం కాస్త ఆసక్తికరమైన విషయం.

కాలి వేళ్ల ఆకారం చూస్తే చాలు, వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు!కాలి వేళ్ల ఆకారం చూస్తే చాలు, వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు!

ఈ కుటుంబం బ్రెజిల్ కు చెందినది. ఇలా ఎక్కువ వేళ్లతో ప్రత్యేకంగా నిలిచిన కుటుంబం గురించి మీరూ తెలుసుకోండి.

డి సిల్వాస్

డి సిల్వాస్

ఈ ప్రత్యేక కుటుంబం డి సిల్వా అనే పేరుతో పిలవబడుతుంది. ఈ కుటుంబంలోని 14 మంది సభ్యులు ఈ విలక్షణమైన లక్షణాలు కలిగి ఉన్నారు. వీరంతా కూడా 12 చేతి వేళ్లు, అలాగే కాళ్ల వేళ్లతో జన్మించారు.

తాజాగా మరొకరు జన్మించారు

తాజాగా మరొకరు జన్మించారు

ఒక ప్రముఖ వార్తాపత్రిక ప్రకారం.. ఈ కుటుంబంలో తాజాగా ఒక మగబిడ్డ జన్మించాడు. ఈ చిన్నారికి కూడా చేతికి పన్నెండు వేళ్లు, కాలికి పన్నెండు వేళ్లు ఉన్నాయి. సాధారణంగా జన్యులోపం కారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇది తమ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత అంటూ ఆనందానికి లోనవుతున్నారు. ఈ అంశంమే తమకు సమాజంలో ప్రత్యేక గుర్తింపునిచ్చిందని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఆ కుటుంబం విశ్వసిస్తోంది.

మీ చిటికెన వేలు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్తుందా? మీ చిటికెన వేలు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్తుందా?

మెడికల్ కండిషన్

మెడికల్ కండిషన్

సాధారణంగా ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది. ఈ పరిస్థితికి 'పాలిడాక్టిలీ' అనే జన్యు సిండ్రోమ్ కారణం అవుతుంది. ప్రతి 1000 మందిలో ఒకరు మాత్రమే ఇలా పుడుతుంటారని ఒక పరిశోధనలో తేలింది.

వైద్యులు తెలిపిన అంశాలు

వైద్యులు తెలిపిన అంశాలు

అయితే జన్యుపరంగా వచ్చే మార్పులు వల్ల ఇలా పిల్లలు పుడతారని డాక్లర్లు వెల్లడించారు. చేతికి, కాళ్లకు ఎక్కువ వేళ్లు ఉండడానికి కారణం జన్యులోపమేనని చెప్పారు. ఇలాంటి పరిస్థితి చాలా తక్కువ మందిలో ఉంటుందన్నారు.

ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్

ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్

అలాగే తల్లిదండ్రుల్లో ఎవరైనా ఎక్కువ వేళ్లు కలిగి ఉంటే వారి సంతనానికి కూడా ఎక్కువ వేళ్లు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు వివరించారు. అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మాత్రమే ఉందని వారు చెప్పారు.

ఆ కుంటుంబం విశ్వసించేది ఇదే

ఆ కుంటుంబం విశ్వసించేది ఇదే

అయితే ఇలా ఎక్కువ వేళ్లు కలిగి ఉంటూ ప్రత్యేకతను సాధించిన ఆ కుటుంబ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తుంది. తాము మిగతావారితో పోలిస్తే కాస్త ఎక్కువ సంఖ్యలో వేలను కలిగి ఉన్నామని, అది తమకు ప్లస్ పాయింట్ అవుతోందని ఆ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

చేతివేళ్ల సైజు, ఆకారంలో దాగున్న ఆశ్చర్యకర రహస్యాలు..!! చేతివేళ్ల సైజు, ఆకారంలో దాగున్న ఆశ్చర్యకర రహస్యాలు..!!

 దీంతో ఇతరులతో పోల్చుకుంటే

దీంతో ఇతరులతో పోల్చుకుంటే

దీంతో ఇతరులతో పోల్చుకుంటే తాము ఏదైనా పనిని కాస్త మెరుగ్గా చేసేందుకు అవకాశం ఉంటుందని వీరి అభిప్రాయం. మొత్తానికి ఈ కుటుంబం అదనపు వేళ్లతో ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకుంది.

Images Source

English summary

A Family In Which The Members Have 12 Fingers & Toes

This unique family from Brazil carries this unusual genetic trait and they are famous for this uniqueness of theirs, where the members are blessed with 12
Desktop Bottom Promotion