For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఏఏ రాశివారు ఏఏ వృత్తిలో బాగా రాణిస్తారో తెలుసుకోవాలంటే, మీకోసం కంప్లీట్ డీటైల్స్ ఇక్కడున్నాయి.!

  By Mallikarjuna
  |

  ప్రతీ ఒక్కరికి తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపన ఉంటుంది. ఆ స్థాయికి ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాల్లో కొన్ని సార్లు పొరపాట్లు కూడా చేస్తుంటారు.

  సాధారణంగా వీరు ఎంచుకునే వృత్తిలో తప్పు చేస్తారు. అంతెందుకు మన కుటుంబ సభ్యులలో లేదా బంధుమిత్రులలో ఎవరో ఒకరు వారు చదివిన చదువుకి వారి వృత్తికి అసలు సంబంధమే ఉండదు. అలాగే మీరు ఎంచుకున్న పని మీకు తప్పకుండా కలిసొస్తుందని కూడా చెప్పలేము.

  రాశిని బట్టి అబ్బాయిలు ఎలాంటి సెక్స్ లైఫ్ కోరుకుంటారు ?

  కాబట్టి మీ రాశి బట్టి మీరు ఏ వృత్తిలో బాగా రాణిస్తారో తెలుసుకొని అందుకు ప్రయత్నాలు చేయడం ఉత్తమం..!

  మరి ఏ రాశి వారు ఏ వృత్తిలో బాగా రాణిస్తారో తెలుసుకోండి..!

  మేషరాశి

  మేషరాశి

  ఈ రాశిలో జన్మించిన వారు చాలా హుషారుగా ఉంటారు. వీరి బుర్ర బలే పదునుగా ఉండి చురుకుగా ఆలోచిస్తుంది. వీరికి పట్టుదల చాలా ఎక్కువ. ఏమైనా అనుకుంటే జరిగి తీరాల్సిందే. ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండడం వల్ల వీరు రిస్క్‌ వర్క్‌ చేయడానికి ఇష్టపడతారు. అంటే వీరు చేసే వర్క్‌ ఛాలెంజింగ్‌ గా ఉంటేనే వీరికి నచ్చుతుంది. కాబట్టి వీరు ఎంచుకోవాల్సిన రంగాలు మిలట్రీ, రాజకీయాలు, పారిశ్రామిక వేత్తలుగా, పోలీస్‌ ఇలాంటి వాటిల్లో బాగా సక్సెస్‌ అవడంతో పాటు సంతోషంగా ఉంటారు.

  వృషభరాశి

  వృషభరాశి

  ఈ రాశి లో జన్మించిన వారు కష్టపడే తత్వం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. వీళ్ళు చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారు అంతే కాదు వీరు అందంగా ఉంటారు. వీరు ఇంటీరియర్ డిజైనర్స్‌, చెఫ్‌, ఫ్యాషన్‌ డిజైనర్స్‌ లాంటి వాటిల్లో మంచిగా రాణిస్తారు.

  మిధున రాశి

  మిధున రాశి

  ఈ రాశివారు చాలా స్నేహపూర్వకంగా అందరితో కలిసి మెలిసి ఉంటారు. వీరు తెలివైన, చాలా టాలెంట్‌ కల్గిన వారు. వీరి మనస్తత్వాన్ని బట్టి టెక్నికల్‌, మార్కెటింగ్‌, సేల్స్‌ జాబ్స్‌ లో బాగా రాణించగలరు. ఎందుకంటే వీరు అందరితో స్నేహపూర్వకంగా ఉండడం వలన వీరికి ఈ రంగాలలో రాణించడానికి ప్లస్‌ పాయింట్‌ గా ఉంటుంది.

  కర్కాటక రాశి

  కర్కాటక రాశి

  ఈ రాశివారు చాలా ఎమోషనల్‌ గా ఉండడంతో పాటు జాగ్రత్తపరులు కుడా. ఎలాంటి సమస్య నైనా చాలా నైపుణ్యంతో సాల్వ్‌ చేయగలరు. ఈ రాశివారికి కలిసొచ్చే రంగాలు టీచింగ్‌ ఫీల్డ్‌, సైకాలజిస్ట్‌, సామాజిక కార్యకర్తలుగా బాగా నప్పుతారు. ఈ రంగాలలో వీరు మంచి ఫలితాలను పొందుతారు.

  సింహరాశి

  సింహరాశి

  సింహరాశి లో జన్మించిన వారు మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు. వీళ్ళ పర్సనాలిటీకి తగ్గట్టుగానే కెరీర్‌ కూడా చక్కగా ఉంటుంది. వీళ్ళు చాలా దైర్యవంతులు. వీరు జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటారు. చాలా డబ్బు సంపాదిస్తారు. వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి సీఈవో, మేనేజర్స్‌, గవర్నమెంట్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ లాంటి విభాగాలలో మంచి గుర్తింపు వస్తుంది. అందుకే ఇలాంటి రంగాలలో జాబ్స్‌ ట్రై చేయండి.

  కన్యారాశి

  కన్యారాశి

  ఈరాశిలో జన్మించిన వారు చాలా లాజికల్‌ గా ఉంటారు. కన్యారాశి వాళ్ళు ఎడిటింగ్‌, రైటింగ్‌, పరిశోధన, లెక్కల విభాగాలకు సంబంధించిన జాబ్స్‌ బాగా నప్పుతాయి. ఎందుకంటే వీళ్ళు ఏ విషయాన్ని అయినా డీప్‌ గా ఆలోచించి అర్ధం చేసుకుంటారు. ప్రతీ విషయాన్ని క్షుణంగా తెలుసుకోవాలి అనుకుంటారు. అందుకే ఈ రంగాలలో వీరికి మంచి భవిషత్తు ఉంటుంది.

  ఒకే గోత్రం వాళ్లు పెళ్లి చేసుకుంటే సంతాన లోపం కలుగుతుందా ?

  తులారాశి

  తులారాశి

  తులారాశి లో జన్మించిన వారు బాగా తెలివిగా ఉంటారు. ఎవరు ఏం చెప్పినా విసుగు చెందకుండా వింటారు. ఎదుటి వారి ఆలోచనలను వీళ్ళు పసికట్టగలరు. వీరు ఎదుటి వాళ్ళను ఇట్టే ఆకట్టుకోగలరు. వీళ్ళు ఏ విషయమైనా ఎదుటివాళ్ళతో చర్చించడానికి ఇష్టపడతారు. చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి వీళ్ళు లాయర్స్‌ గా సెటిల్‌ అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. విలేకరులుగా కూడా మంచిగా రాణించగలరు.

  వృశ్చికరాశి

  వృశ్చికరాశి

  వృశ్చికరాశి వాళ్ళు ప్రతి విషయాన్ని చాలా డీప్‌ గా ఆలోచిస్తారు. వీళ్ళు చాలా స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడతారు. నిజాయితీ పరులు, వీళ్ళ మనస్తత్వం బట్టి వీళ్ళు సిఐడి, డిటెక్టివ్‌, సర్జన్‌, డాక్టర్‌ వంటి రంగాలను ఎంచుకుంటే విజయం సాధిస్తారు. వీళ్ళు చాలా స్మార్ట్‌ గా ఉంటారు, అలాగే ప్రవర్తిస్తారు.

  ధనస్సు రాశి

  ధనస్సు రాశి

  ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా జర్నీ చేయడానికి ఇష్టపడతారు. వీళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలమీదే ఉంటాయి. జీవితం యొక్క పరమార్ధం ఏమిటో తెలుసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు ఇతరులను బాగా ప్రేరేపించగలరు అందువల్ల కోచింగ్‌ ఇవ్వడానికి, మంత్రులుగా, ఫిలాసఫర్లుగా, టీచర్స్‌ ఇలాంటి రంగాలలో విజయం సాధించగలరు.

  మకరరాశి

  మకరరాశి

  ఈరాశి వారు సవాళ్ళను ఇష్టపడతారు. మకరరాశి వాళ్ళు సవాళ్ళను ఫేస్‌ చేసి వాటిని అధిగమిస్తే చాలా సంతోషంగా ఫీల్‌ అవుతారు. వీళ్ళ విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. దేన్నైనా విభిన్నంగా మార్చుకుంటారు. వీళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు. వీళ్ళు ఐటి, బ్యాకింగ్‌, మెడిసన్‌ ఇటువంటి రంగాలను ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.

  కుంభరాశి

  కుంభరాశి

  ఈరాశి వారికి సైంటిస్ట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాన్ని డీప్‌గా ఆలోచించి అసలు విషయం ఏమిటో తెలుసుకుంటారు. వాళ్ళ చుట్టూ జరిగే విషయాలపై ప్రశ్నించుకుంటూ ఉంటారు. వీళ్ళు చాలా ఆతృత కల్గి ఉంటారు. కాబట్టి ఈ రాశివారు సైంటిస్ట్ లు అయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. అదే విధంగా ఏరోనాటిక్స్‌, ఆస్ట్రానమీ, ఆర్గానిక్‌ వంటి రంగాలలో మంచి ఫలితాలను చవిచూస్తారు.

  మీనరాశి

  మీనరాశి

  మీనరాశి లో జన్మించిన వారికి చాలా జాలి ఎక్కువ. ఎదుటి వాళ్ళకు సహాయపడాలనే ఆలోచిస్తుంటారు. వీళ్ళు చాలా క్రియేటివిటీ కలిగి, స్టైలిష్‌ గా ఉంటారు. వీళ్ళు యాక్టర్స్‌ గా సెటిల్‌ అయితే లైఫ్‌ బాగుంటుంది.

  English summary

  Things That Make Each Zodiac Sign Happy In Job Or Career

  Do you realise that the career or job that you are in right now might be the perfect one according to your zodiac sign? Check out on the list and decide for yourself if you are in the best career according to your zodiac sign.
  Story first published: Sunday, October 8, 2017, 9:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more