Latest Updates
-
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.!
దీపావళి రోజున ఎట్టి పరిస్థితిలో చేయకూడని పనులు !
చిన్ననాటి నుండి అమితంగా ఇష్టపడి జరుపుకునే దీపావళి పండుగ నాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు కొత్త కాకపోవచ్చేమో కానీ.. వాటిని మరో సారి చెప్పుకుంటే మరిచిపోయినవేమైనా ఉంటే గుర్తు వస్తాయి. అల్టిమేట్ గా దీపావళి ఆనందాన్ని మిస్ కాకుండా, సేఫ్ గా జరుపుకోవడమే మన లక్ష్యం కావాలి.
హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దేశవ్యాప్తంగా అత్యంత వేడుకగా ఈ పండుగన జరుపుకుంటారు. ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీగణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారనేది నమ్మకం.

దీపావళి సమయంలో లక్ష్మి దేవిని ప్రసన్నం చేసుకొనే సమయంలో ప్రజలు చాలా విషయాలను దృష్టిలో ఉంచుకొని, అందుకు అనుగుణంగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు చేసే కొన్ని విషయాలు దేవతకు ప్రకోపం తెప్పిస్తాయి. దీంతో ఆయా వ్యక్తులు దురదృష్టాన్ని మరియు ఎన్నో బాధలను అనుభవించవలసి ఉంటుంది.

క్రింద చెప్పబడే విషయాలను దీపావళి సందర్భంగా అస్సలు చేయకండి. వీటికి చాలా దూరంగా ఉండటం మంచిది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విషయాలను ఇంతక ముందెప్పుడూ మీరు విని ఉండరు. దీపావళికి ముందు మీరు శుభవార్తలు వినబోతున్నారు అనే విషయం దగ్గర నుండి, ప్రొద్దున్నే ఎందుకు త్వరగా నిద్రలేవాలి మరియు ఎవరితోనూ పరుషంగా మాట్లాడకూడదు వంటి విషయాల వరకు ఇలా ఎన్నో విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

ఆలస్యంగా నిద్ర లేవకండి :
చాలా ఎక్కువ సేపు నిద్రపోయే వ్యక్తులంటే దేవతలకు ఇష్టం ఉండదంట. ముఖ్యంగా లక్ష్మి దేవి కటాక్షం ఇటువంటి వ్యక్తులకు అస్సలు లభించదంట. అందుచేత ప్రతి ఒక్కరు వేకువ జామునే నిద్రలేవడాన్ని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా దేవతలను ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటున్న ఈ సమయంలో అలా చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా ఐశ్వర్యాన్ని మరియు ధనాన్ని పెంచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గొడవలకు దూరంగా ఉండండి :
దీపావళి సమయంలో మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో ఇలా ఎవ్వరితో కూడా గొడవలకు దిగకండి. ఇంట్లో ఉన్నా లేదా బయటకు వెళ్లినా ఇలా ఎక్కడున్నా సరే సానుకూల దృక్పధంతోనే వ్యవహరించండి. మీ చుట్టూ ఉన్నవారిని ఆనందంగా మరియు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి :
ఈ దీపావళి సమయంలో ఏ రకమైన మాదక ద్రవ్యాలు సేవించినా లక్ష్మి దేవికి విపరీతమైన కోపం వస్తుందంట. అందుచేత అలాంటి చెడు అలవాట్లకు ఈ సమయంలోనే కాకుండా, మిగతా సమయాల్లో కూడా దూరంగా ఉండటం మంచిది.

ఈ సమయంలో ఖచ్చితంగా చేయవల్సిన పూజ :
ఎప్పుడుబడితే అప్పుడు పూజలు చేయడం కాకుండా, జీవితం నుండి చెడుని దూరం చేసుకొని అంతా మంచి జరగాలంటే రాత్రి పదకొండున్నర నుండి ఉదయం రెండున్నర మధ్యలో దీపావళి రోజు రాత్రి పూజ చేయడం చాలా బాగుంటుందని, బాగా కలిసి వస్తుందని చెబుతున్నారు. ఇదే అత్యుత్తమ సమయం అని కూడా చెబుతున్నారు.

చెడు దూరం చేసుకోవడానికి చేయవల్సిన పూజలు :
దేవుడికి ప్రకోపం కలిగించే విషయాలకు దూరంగా ఉండటమే కాకుండా, కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. ప్రతి ఒక్కరు చెడు దూరం చేసుకోవడానికి పూజ చేయడం చాలా మంచిది. ఏ కుటుంబం లో అయినా సరే ఎవరైనా వ్యక్తులు విపరీతమైన సమస్యలను లేదా కష్టాలను ఎదుర్కొంటుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజ చేయాలి. ఏ వ్యక్తి అయితే సమస్యలు ఎదుర్కొంటున్నాడో ఆ వ్యక్తి చుట్టూ ఏడూ సార్లు ఎర్రటి మిరపకాయలను గుండ్రటి ఆకారంలో వేయాలి . ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క కష్టాలన్నీ తొలగిపోయి, చెడు జీవితం నుండి వెళ్ళిపోతుందని చాలా మంది భావిస్తారు.

భోగి మంటలు వేయడం :
చెడుని జీవితం నుండి పూర్తిగా పారద్రోలడానికి, పూజ అయిపోయిన తర్వాత ఆ మిరపకాయలన్నింటిని తీసి భోగి మంటలో వేయాలి. వేసిన తర్వాత ఆ మంటను వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపోయాలి. ఇలా చేయమనడానికి కారణం ఏమిటంటే, అక్కడే గనుక ఉంటే కళ్ళు విపరీతంగా మండుతాయి. ఇటువంటి పనులని ఏదైనా ఏకాంత ప్రదేశాలు లేదా మనుష్యులు లేని ప్రదేశాల్లో చేయడం మంచిది.



Click it and Unblock the Notifications
