మన పూర్వీకుల సంప్రదాయాలు, సామగ్రి ఎంతో ఆసక్తికరం

By: Y. Bharat Kumar Reddy
Subscribe to Boldsky

గతంలో మన పూర్వీకులు ఉపయోగించిన కొన్ని వస్తువులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేవిగా ఉంటాయి. అప్పటి సాంకేతికతతో వారు వినియోగించిన సామగ్రి కాస్త భిన్నంగా ఉంటుంది. వాటిని చూస్తే మనక కూడా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే అప్పటి వారి ఆచారాలు, సంప్రదాయాలు, నిత్య జీవితంలో వారు అవలంబించిన విధానాలు కూడా కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. అయితే అందులో ప్రతి విషయానికి ఒక కారణం ఉండి ఉంటుంది. కానీ అవన్నీ ఇప్పటి జనరేషన్ మాత్రం ఆచరించేలేదు. అయితే ప్రస్తుతతరం వారు మన పూర్వీకులు అనుసరించిన విధానాలను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మన పూర్వీకులు చాలా విచిత్రమైన విధానాలను ఆచరించేవారు.

అతను నీటిలో మునగడానికి వెళితే, శరీరం వాచింది

రోజుకు రెండుసార్లు నిద్రపోయేవారు

రోజుకు రెండుసార్లు నిద్రపోయేవారు

అప్పట్లో జనాలు రోజుకు రెండుసార్లు నిద్రపోయేవారు. దీన్ని బిఫస్సిక్ స్లీపింగ్ అనే వారు. సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు గతంలో నిద్రపోయేవారు. అయితే మధ్యలో లేచి ఓ రెండుమూడు గంటలు మేల్కొనేవారు. తర్వాత మళ్లీ నిద్రపోయి సూర్యుడు ఉదయించే వరకు నిద్రించేవారు. ఇలా పూర్వకాలంలో కాస్త డిఫరెంట్ గా నిద్రపోయేవారు. కానీ ఇందులో కూడా ఏవో సైంటిఫిక్ కారణాలు ఉండే ఉంటాయి. అప్పట్లో సాయంత్రంకాగానే చీకటి అయ్యేది అందువల్ల ఈ విధానాన్ని పాటించేవారు.

పొగ అక్కడే తాగేవారు

పొగ అక్కడే తాగేవారు

గతంలో ధూమపానం అనేది పెద్ద తప్పుగా ఉండేది కాదు. అలాగే ధూమపానం కూడా విమానాలు లేదా పబ్లిక్ ప్రదేశాల్లో చేసేవారు. అప్పట్లో ఇది పూర్తిగా చట్టబద్ధమైనది. ఈ ప్రాంతాల్లో పొగ తాగడానికి కూడా అప్పట్లో మంచి ఎంకరేజ్ మెంట్ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ఇలాంటి ప్లేస్ లలో స్మోకింగ్ చేస్తే మాత్రం చట్టబద్ధంగా నిషిద్ధం.

సౌందర్య సాధానాల తయారీకి రేడియోధార్మిక పదార్థాలు

సౌందర్య సాధానాల తయారీకి రేడియోధార్మిక పదార్థాలు

అప్పట్లో చర్మ సౌంద్యాన్ని పరిరక్షించుకునేందుకు ఉపయోగించిన కాస్మోటిక్స్ చాలా వరకు రేడియోధార్మిక పదార్థాలు ఉపయోగించి తయారు చేసినవే. అప్పట్లో ప్రజలు రేడియేషన్ ఒక మంచి విషయంగా భావించారు. అలాగే కిరాణ దుకాణాల్లో థోరియం, రేడియంతో తయారైన పానీయాలు, ఆహార పదార్థాలను కొనుగోలు చేసేవారు.

హై హీల్స్

హై హీల్స్

గతంలో కూడా ఆడవారు హైహీల్స్ ను బాగానే ఉపయోగించేవారు. వీటిని అప్పట్లో చోపిన్స్ అని అనేవారు. 15, 17 వ శతాబ్దాల్లో మహిళలు 20 అంగుళాలుండి బాగా ధృడంగా ఉండే బూట్లు ఉపయోగించారు. ఆ తర్వాత కాలంలో అదే ఫ్యాషన్ గా మారింది. అప్పట్లో వేసుకునే బట్టలకు బురద అంటకూడదనే ఉద్దేశంతో ఇలాంటి హైహీల్స్ ధరించేవారు మహిళలు.

అశ్లీల చిత్రాలను చూడటం ఇప్పుడే ఆపేయండి, ఎందుకంటే?

బాతింగ్ మిషన్

బాతింగ్ మిషన్

18, 19 వ శతాబ్దాల్లో పబ్లిక్ లో స్నానం చేయడం అనేది నిషిద్ధం. అందువల్ల అప్పట్లో బాతింగ్ మిషన్స్ ఉపయోగించారు. దీనివల్ల ఎవరూ చూడకుండా ఈత కొట్టడానికి అవకాశం ఉంటుంది. మహిళలకు ఇవి బాగా ఉపయోగపడేవి.

English summary

Weird Things That Our Ancestors Used To Do All The Time

Here are examples of certain creepy practices that were practiced in the past and it makes us realise how could our ancestors even practice something as bizarre as this! So, check out on some of the most bizarre things that our ancestors followed back then.
Subscribe Newsletter