ఆడవారి ధైర్యానికి ఈ విషయాలే నిలువెత్తు సాక్ష్యాలు!

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

"కొన్ని రోజుల క్రితం సోషల్‌మీడియాలో ఒక చిత్రాన్ని చూశాను. అందులో మన దేశానికి చెందిన మహిళ సంప్రదాయంగా చీరకట్టుకున్నది కానీ బ్లౌజ్ వేసుకోలేదు. నేను చూసినప్పుడు నేనూ ఆశ్చర్యపోయాను. కొద్దిసేపు ఆలోచించాను ఆ చిత్రం ఆలోచింపజేసింది.

ఒక అడుగు ముందుకు వేసేలా నన్ను ప్రభావితం చేసింది" అని ఒక కార్యక్రమంలో సినీనటి కంగనారౌనత్ చెప్పారు. ఆ తర్వాత నుంచి ఆమె తాను డేర్ అండ్ డ్యాష్ గా వెళ్లున్నట్లు పేర్కొన్నారు. ఇలా ఈమెనే కాదు. చాలామంది మహిళలు ఏదైనా నమ్మితే.. దాని కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమవుతారు.

ఆడవారు.. అదరగొట్టారు

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రచారాలు సాగాయి. మహిళలు సాధికారత కోసం కొందరుఇలా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ఆడవారే కదా అని చులకనగా చూసిన ప్రతి ఒక్కరినీ హడలెత్తించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. డేర్ అండ్ డ్యాష్ గా ముందడుగు వేసిన వారు చాలామందే ఉన్నారు. కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే మనమూ ఆశ్చర్యపోవాల్సిందే.

1. బ్లౌజ్ ఫ్రీ శారీ

ఇదో వినూత్న పోరాటం. ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు వెయ్యి మంది మహిళలు తమ చిత్రాలను ఇలా పోస్ట్ చేశారు. సాత్విక అనే అమ్మాయి ద శారీ ఫెస్టివల్- నో బ్లౌజ్ ప్లీజ్ చాలెంజ్ పేరుతో దీన్ని ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో saree.man అనే ఖాతాలో ఇలా రవికె లేకుండా చీరతో ఫోజులిచ్చిన మహిళల ఫొటోలు అప్ లోడ్ చేశారు. సుమారు 1000మంది దాకా మహిళలు ఇలాంటి ఫోజులతో ఉన్న ఫొటోలను అందులో పోస్ట్ చేశారు. సాత్విక తన ఇన్ స్టాగ్రాం లో బ్లౌజ్ ఫ్రీ శారీ అనే కాంపెన్ నిర్వహించడంతో ఇలా అందరూ ముందుకొచ్చారు. ప్రపంచదేశాల వారంతా మన చీరకట్టు గురించి మాట్లాడుతుంటే.. భారతదేశంలో మాత్రం పాశ్చత్య సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నారని అందుకు విరుద్దంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం చీరకట్టే వాళ్ల సంఖ్య సగానికి తగ్గిందని చెప్పొచ్చు. సంప్రదాయ చీరకట్టు విధానాన్ని ప్రోత్సహించడానికి ఈ కాంపెన్ నిర్వహించారు. ఈ చాలెంజ్‌లో కేవలం బ్లౌజ్ ఒక్కటే కాకుండా పెట్టీకోట్ కూడా ధరించకూడదని నిబందన పెట్టారు. గతంలో మనదేశంలో కొందరు మహిళలు రవికే వేసుకునేవాళ్లు కాదు. ఆ విధమైన వస్త్రధారణ వారి స్వచ్ఛతకు, సహజత్వానికి నిదర్శనం అని నమ్మేవారు. కుట్టిన బ్లౌజుల్లో బందీ అవుతున్న ఈ తరం ఆడవాళ్ల జీవితాలను అన్‌స్టిచ్‌డ్ చేయడమే తమ లక్షమంటూ ఈ చాలెంజ్ ద్వారా బోల్డ్‌గా చెప్పారు నిర్వాహకులు. దీనికి మన భారతీయ మహిళలు నుంచి విశేషమైన ఆదరణ లభించింది.

2. లిప్‌స్టిక్ రెబెలియన్ (#LipstickRebellion)

2. లిప్‌స్టిక్ రెబెలియన్ (#LipstickRebellion)

లిప్ స్టిక్ అండర్ మై బురఖ బాలీవుడ్ చిత్రం ఆ మధ్య కాస్త సంచలనంగా మారింది. అనేక ఇబ్బందులను ఎదుర్కొని మొత్తానికి సినిమా రిలీజైంది. పాజిటిట్ టాక్ వచ్చింది. అయితే అంతకు ముందు సెన్సార్ నిరాకరణకి గురైంది. కాంట్రావవర్సిగా మారింది. ఇందుకు కారణం సినిమాలోని అశ్లీల దృశ్యాలే అని సెన్సార్ బోర్డ్ వారు చెప్పారు. అయితే కొందరు చిత్ర యూనిట్ ని సపోర్ట్ చేస్తూ బోర్డ్ పై మండి పడ్డారు కూడా. ఇది ఒక 'లేడీ ఓరియెంటెడ్ చిత్రం' అని దీన్ని ఎలా అడ్డుకుంటారని సినిమా తారాగణం మండిపడింది. అలాంటి సందర్భంలో చిత్ర యూనిట్ #LipstickRebellion అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది. అది ఒక తిరుగుబాటు పోస్ట్. నిజంగా ఇది రంగులతో తిరుగుబాటు. లిప్‌స్టిక్ రెబెలియన్ అంటే లిప్‌స్టిక్‌తో తిరుగుబాటు అని అర్థం. ట్విట్టర్‌లో ప్రారంభమైన ఈ తిరుగుబాటు సోషల్‌మీడియా మొత్తం విస్తరించింది. మహిళల సాధికారత కోసం మహిళా ప్రాధాన్యత గల సినిమాలు రావాలని కోరుతూ ఇలా పోస్టులు చేయడం ప్రారంభించారు. సినిమాల్లో అమ్మాయిలను చిన్నచూపు చూడడం, కించపరిచే మాటలు, అసభ్యకరమైన సన్నివేశాలు పెట్టకూడదని దీని ముఖ్య ఉద్దేశం. ఒక గెస్చర్ ను తెలుపుతూ అలా ఫొటోలను పోస్ట్ చేయమనింది. లిప్ స్టిక్ బాటిల్ ను చేతి మధ్య వేలి వద్ద పెట్టుకుని చూపిస్తున్నట్లుగా ఫొటోలు దిగి పోస్ట్ చేయమని కోరింది. దీనికి మహిళల నుంచి ఒక రేంజ్ లో స్పందన వచ్చింది. కొంకణ సేన్ శర్మ , రత్న షా పాఠక్, ఏక్తా కపూర్ అలంక్రిత శ్రీవాత్సవ తదితరులు అలాంటి ఫోజులో సెల్ఫీలు దిగి పోస్ట్ చేశారు. దీంతో చాలామంది మహిళల అలాంటి గెస్చర్ లో ఫొటోలు దిగి పోస్ట్ చేశారు. మహిళలంతా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీంతో చాలామంది పోస్టులు చేసి మద్దతు తెలిపారు.

3. మీ టూ (#MeToo)

3. మీ టూ (#MeToo)

ఇక మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా ఒక ప్రచారం చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలంతా ట్విట్టర్ వేదికగా ప్రచారం ప్రారంభించారు.

#MeToo అనే హ్యాష్ ట్యాగ్ ద్వారా మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నవారికి వ్యతిరేకంగా పోస్ట్ లు చేశారు. దీంతో చాలామంది మహిళలు ముందుకొచ్చి పోస్టులు చేశారు. వారిపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, వేధింపులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమాజంలో చాలా మంది మహిళలను ఈ కార్యక్రమం ప్రభావితం చేసింది. ప్రస్తుతం మీటూ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్‌టాగ్ . అమెరికన్ స్టార్ హీరోయిన్ అలిస్సా మిలానో ఈ హ్యాష్‌టాగ్‌కు ఆద్యం పోసింది. హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ సినిమా అవకాశాలు ఇప్పిస్తానని అందుకోసం తనను శారీరకంగా సుఖపెట్టాలని కోరేవాడని పేర్కొంది. అలా ఎంతోమందిని లైంగికంగా వేధించాడు. అతడికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి అలిస్సా పోస్ట్ చేసంది. దీంతో అనేకమంది స్త్రీలు లైంగిక వేధింపులకు గురైనట్టు పేర్కొంటూ మీ టూ అని పోస్ట్‌లు పెట్టి ప్రచారం చేస్తున్నారు. చాలామంది తాము వేధింపులకు గురైనందుకు సిగ్గుపడుతున్నాం అని పోస్టులు పెడుతున్నారు.

భౌతిక దాడులు, ఈవ్‌టీజింగ్‌లకు వ్యతిరేకంగా మొదలైన ఈ చాలెంజ్ ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. మహిళలపట్ల పురుషులకు ఉన్న దురాలోచన మారాలనేది దీని ఉద్దేశం.

4. ఏబీవీపీకి భయపడడం లేదు

4. ఏబీవీపీకి భయపడడం లేదు

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా తాను భయపడడం లేదంటూ 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్‌దీప్ సింగ్ కుమార్తె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనం రేపింది. గతంలో జేఎన్‌యూలో జరిగిన ఒక ర్యాలీలో జాతి వ్యతిరేక నినాదాలు చేసి ఉమర్ ఖలీద్‌ను ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో జరిగిన ఒక సెమినార్‌కు ఆహ్వానించారు. దాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. ఈ సందర్భంగా మిగిలిన విద్యార్థులకు, ఏబీవీపీ వాళ్లకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన గుర్‌మెహర్, తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఆమె అందులో చెప్పారు. తాను ఒంటరిని కానని, దేశంలో ప్రతి విద్యార్థి తన వెంట ఉన్నారని అందులో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఆమెను సమర్థిస్తూ భారీ స్థాయిలో ఫేస్‌బుక్‌లో కామెంట్లు వచ్చాయి. కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్‌దీప్ సింగ్ కుమార్తె అయిన ఈమె తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయినా, ఆయన ధైర్యాన్ని పుణికి పుచ్చుకుంది. ఫిబ్రవరి 2017 లో ఒక సామాజిక మీడియా ద్వారా ఈమె ప్రచారం ప్రారంభించారు. ఈమె ఫేస్బుక్ ప్రొఫైల్ చిత్రంలో నేను ఏబీవీపీకి భయపడడం లేదు అని రాసి ఉన్నఫ్ల కార్డు పట్టుకుని ఉన్న ఫొటో ఉంటుంది.

5. నాకెవరి మద్దతు లేదు

5. నాకెవరి మద్దతు లేదు

"నాకెవరి మద్దతు లేదు. నాకు అలాంటివి వద్దు. ఎవరికి వాళ్లే మద్దతు ఇచ్చుకోవాలి. ఎవరిపై ఆధారపడకుండా బతుకడమే అందమంటే.. అలాంటి అందాన్నే నేను కోరుకుంటున్నాను" అని రజత్ శర్మ ఆప్‌కీ అదాలత్ కార్యక్రమంలో కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఆమె తన గళం విప్పింది. భయం లేకుండా మాట్లాడింది. తన కష్టాల గురించి తనను వేధించిన తీరు గురించి చెప్పింది. రీబాక్ సంస్థకు చేసిన కమర్షియల్ యాడ్‌లోనూ కంగనా తన గళాన్ని వినిపించింది. పురుషులతో సమానంగా మహిళలకు జీతభత్యాలు ఉండాలని, వివక్ష లేకుండా ప్రతి విషయంలో సమాన హక్కులు కల్పించాలని కోరింది. అయినా మహిళలు ఏ విషయంలో తక్కువ.. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో పురుషులతో పోటీగా రాణిస్తున్నారు.. అలాంటప్పుడు ఈ చిన్నచూపు ఎందుకు? ఈ వివక్ష ఎందుకు? అని ప్రశ్నించింది. ఆమె ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.. ఇలా.. అడగాలి.. ఇలా అడుగెయ్యాలి అంటూ చాలా మహిళల సరికొత్త గొంతులు వినిపిస్తున్నాయి.

6. సలోనీ చోప్రా వెరైటీ పోస్ట్

6. సలోనీ చోప్రా వెరైటీ పోస్ట్

సలోనీ చోప్రా బ్రాని పట్టుకొని ఇన్ స్టాగ్రాంలో ఒక ఫోటోను అప్లోడ్ చేసింది. ఇన్నర్ వేర్స్ చూపించడానికి అవమానకరంగా భావించే స్త్రీలను ఆమె తప్పుపట్టింది. "మహిళలు తమ లైంగిక విషయాలు గురంచి బోల్డ్ గా ఉండాలని పేర్కొంది. " మగవారు కనీసం షర్ట్ కూడా లేకుండా తిరొగొచ్చు. కానీ ఆడవాళ్లు మాత్రం బ్రా వేసుకుని కనపడ్డా కూడా సొసైటీ తప్పుపడుతుందని పేర్కొంది. ఈ వ్యవస్థమారాలంటూ ఆమె పేర్కొంది. ఈ పోస్ట్ కూడా హల్ చల్ చేసింది.

7. ప్రౌడ్ టు బ్లీడ్ (#ProudToBleed)

7. ప్రౌడ్ టు బ్లీడ్ (#ProudToBleed)

ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. దేశంలోని 12 శాతం అంటే 335 లక్షల మంది మాత్రమే నెలసరి సమయంలో సానీటరి ప్యాడ్స్ వాడుతున్నారు. మిగతా 88 శాతం మంది ఇంకా పాతబట్టలనే ఉపయోగిస్తున్నారు. దీంతో ఎంతోమంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న దియా ఇండియా సంస్థ నటి సలోనీ చోప్రాతో కలిసి సానీటరి ప్యాడ్స్‌ను పంచిపెడుతున్నారు. వాటి గురించి స్త్రీలకు అవగాహన కల్పించాలని, ఆర్థికంగా వెనుకబడి ఉన్న స్త్రీలకు ఉచితంగా ప్యాడ్లు ఇవ్వాలని పిలుపునిచ్చింది. ప్రతి అమ్మాయికి నెలసరి సమయంలో సానిటరీ నాప్‌కిన్ల అవసరం ఉంటుంది. వాటిని కొనలేని పేదలకు వీలైతే ఉచితంగా ఇవ్వండి అని సోషల్ నెటవర్క్స్‌లో ప్రచారం చేస్తున్నారు. కొనలేని వారికి కొనిద్దాం.. స్థోమత లేని వారికి తోడుందాం.. ఇది మన హక్కు. గర్వంగా పోరాడుదాం.. అంటూ ఓ వినూత్న ప్రచారం చేస్తున్నారు.

English summary

Bold Steps By Indian Women That Prove Them Braver Than Your Imagination

"Nobody was my support. You have to support yourself, and I think that is the beauty of being a woman." - Kangana Ranaut..Just a few days back, I came across some unusual pictures on my social media. In those pictures, Indian women were wearing sarees but without a blouse. Yes! You read that right, without a
Subscribe Newsletter