ఈ సెలెబ్రిటీలు వాడే విలాసవంతమైన వ్యానిటి వ్యాన్స్ గురించి మీకు తెలుసా (ఇల్లు కూడా పనికి రాదు)

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ప్రతి ఒక్క సెలెబ్రిటీ విలాసవంతమైన వస్తువులను ఉపయోగించాలని భావిస్తారు. వాటిల్లో ప్రతి ఒక్కరు కావలి అనుకునేది మాత్రం ఆడంబరమైన వ్యాన్ లు. సెలెబ్రిటీ లు వాడే ఆడంబరమైన వ్యాన్ లు చాలా సాధారణంగా ఉంటాయి అని మీరు గనుక అనుకున్నట్లైతే పప్పులో కాలేసినట్లే.

సెలెబ్రిటీలు అందరూ చాలా అత్యాధునికమైన మరియు అత్యంత విలాసంగా ఆడంబరమైన వ్యాన్ లలో ఉంటారు. ఎందుచేతనంటే వాళ్ళు ఆ వ్యాన్ ని రెండవ ఇంటిగా భావిస్తారు. అత్యంత విలాసవంతమైన ఆడంబరమైన వ్యాన్ ని కలిగి ఉండటం అనేది చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ, సెలెబ్రిటీలు అందరూ ఆ వ్యాన్ ని కలిగి ఉండటం ఒక గౌరవంగా మరియు ప్రతిష్టగా భావిస్తారు.

మన సెలబ్రెటీలకు అత్యంత ఇష్టమైన 20 ఆహారాలు!

సెలెబ్రిటీలలో కొంతమంది ఎటువంటి ఆడంబరమైన వ్యాన్ లను వాడుతున్నారు. వాటి యొక్క విశిష్టతలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.షారుఖ్ ఖాన్ :

1.షారుఖ్ ఖాన్ :

షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో " కింగ్ ఖాన్ ". అందులో ఎటువంటి సందేహం లేదు. దిల్ వాలే సినిమాకు షూటింగ్ చేస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్ ఒక అత్యంత విలాసవంతమైన ఆడంబరమైన వ్యాన్ ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ వ్యాన్ ని ప్రఖ్యాత డిజైనర్ దిలీప్ చ్చబ్రియా రూపొందించడం జరిగింది. కొన్ని నివేదికల ప్రకారం షారుఖ్ ఖాన్ కొన్న ఆ నూతన ఆడంబరమైన వ్యాన్ విలువ 4 కోట్ల పై మాటే. ఈ ఆడంబరమైన వ్యాన్ లో అత్యంత ఆశ్చర్యానికి లోనుచేసే అంశం ఏమిటంటే ఈ వ్యాన్ లో ప్రత్యేకమైన విశ్రాంతి మందిరం( లాంజ్ ఏరియా ) ఉంది. ఈ ప్రత్యేకమైన లక్షణం మిగతా సెలబ్రిటీల ఆడంబరమైన వ్యాన్ లలో లేదు.

2. సల్మాన్ ఖాన్ :

2. సల్మాన్ ఖాన్ :

వ్యక్తిగత లక్షణాలను గనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే సల్మాన్ ఖాన్ అందరికంటే అత్యధికంగా ఖర్చు చేస్తాడనే అనే విషయం అందరికి తెలుసు. ఒక మంచి సంగీత వ్యవస్థ, కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లని ఇంటీరియర్, ప్రకాశవంతమైన లైట్లు, ఖరీదైన మరియు విలాసవంతమైన పరుపు, వీటితో పాటు బాత్రూం లాంటి ఎన్నో వసతులను ఆ వ్యాన్ కలిగి ఉంది. సల్మాన్ ఖాన్ వాడే ఈ వ్యాన్ చాలా ఖరీదైనది. ఆ వ్యాన్ విలువ 1 నుండి 2 కోట్ల మధ్య ఉండవచ్చు.

3. వరుణ్ ధావన్ :

3. వరుణ్ ధావన్ :

జుద్వా 2 సినిమాలో మెరిసిన ఈ నటుడు అత్యంత విలాసవంతమైన మరియు సొగసైన ఆడంబరమైన వ్యాన్ లలో గడపటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. వరుణ్ ధావన్ ఆడంబరమైన వ్యాన్ లోపల మంచి డిజైనర్లతో చేయించిన ఫర్నిచర్ మరియు అద్దంతో చేసిన తలుపులు కలిగి ఉండి చూడటానికి సాధారణంగా మరియు సొగసైన వ్యాన్ గా ఉంటుంది. ఈ వ్యాన్ ను వరుణ్ ధావన్ ఇష్టానికి మరియు అతనికి సాకర్యవంతగా ఉండేలా రూపొందించడం జరిగింది.

4. అజయ్ దేవగన్ :

4. అజయ్ దేవగన్ :

అజయ్ దేవగన్ కళ్ళతో మాట్లాడతారని చాలా మంది చెబుతారు. ఇతని దగ్గర కూడా చాలా ఖరీదైన ఆడంబరమైన వ్యాన్ ఉందట. చాలామంది సెలెబ్రిటీలు కొన్ని ఆడంబరమైన వ్యాన్ తమకు ఉంటే బాగుణ్ణు అని కలలు కంటుంటారు. అలాంటి ఒక ఆడంబరమైన వ్యాన్ ఇతని దగ్గర ఉంది. వ్యాన్ లోపల ప్రత్యేకమైన ఆఫీస్ గది, ఒక విశ్రాంతి గది మరియు వంటగది కూడా ఉంది. అజయ్ దేవగన్ రెండవ ఇల్లు చాలా బాగుంటుందని ఎంతోమంది ప్రశంసిస్తుంటారు. ఇవే కాకుండా అజయ్ దేవగన్ ఆ వ్యాన్ లోపల ఒక చిన్నపాటి జిమ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. జిమ్ కు సంబంధించిన ఎన్నో ఉపకరణాలు కూడా అందులో ఉంటాయి.

5. అలియా భట్ :

5. అలియా భట్ :

బాలీవుడ్ లో తక్కువ వయస్సులోనే స్టార్ డమ్ సంపాదించుకుంది అలియా భట్. ఈమె చాలా చురుకైన మరియు కొత్త ఫ్యాషన్ లను ఎంచుకోవడంలో ముందుంటుంది, అలా చేయడానికి ఇష్టపడుతుంది. ఈమధ్యనే ఆమె యొక్క ఆడంబరమైన వ్యాన్ కు కొత్త హంగులను జోడించింది. ఈమె వ్యాన్ ను ప్రఖ్యాత డిజైనర్ అమృత మహల్ రూపొందించడం జరిగింది. వ్యాన్ లోపల రంగు రంగుల కుషన్ లు, రాత్రిపూట మిరుమిట్లు గొలిపే కాంతులు మరియు అందమైన పోస్టర్లు ఇలా ఎన్నో కనువిందు చేస్తాయి. అలియా భట్ ఆడంబరమైన వ్యాన్ ని నిర్లక్ష్యం చేయలేము. అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది.

క్రేజీ క్రికెట్ స్టార్స్ కి బీటౌన్ బ్యూటీస్ మధ్య హాట్ లవ్ ఎఫైర్స్

6. హృతిక్ రోషన్ :

6. హృతిక్ రోషన్ :

బాలీవుడ్ కలల రాకుమారుడు హృతిక్ రోషన్ దగ్గర అత్యంత ఖరీదైన, విలాసవంతమైన మరియు సొగసైన ఆడంబరమైన వ్యాన్ ఉంది.ఈ వ్యాన్ లోపల నీలి రంగులో కాంతులు మరియు ఖరీదైన ఫర్నిచర్ ఉంది. హృతిక్ యొక్క ఆడంబరమైన వ్యాన్ ను గనుక ఎవరైనా చుస్తే ఈర్ష్య కలుగుతుంది. ఈ వ్యాన్ విలువ కోటి రూపాయలకు పైగా ఉంటుందని చెబుతారు. ఈ వ్యాన్ లో ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే విద్యుత్తుతో అనుసంధానించబడ్డ అద్దం ఇందులో ప్రత్యేకముగా రూపొందించడం జరిగింది. ఇది 280 డిగ్రీల కోణంలో ఎటుకావాలంటే అటు తిరగడం జరుగుతుంది. హృతిక్ ఆడంబరమైన వ్యాన్ పనిచేయడానికి మరియు విలాసవంతంగా గడపడానికి, ఇలా రెండింటికి చాలా అనువైనది.

7. అక్షయ కుమార్ :

7. అక్షయ కుమార్ :

అక్షయ్ కుమార్ ఆడంబరమైన వ్యాన్ లోపల ఖరీదైన ఇంటీరియర్లు, అత్యాధునిక ఫర్నిచర్ మరియు ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. ఆడంబరమైన వ్యాన్ లలో అక్షయ్ కుమార్ ది కూడా సొగసైన మరియు అందమైన వ్యాన్ గా చెబుతుంటారు. ఆగండాగండి అక్కడితో అయిపోలేదు ! అక్షయ్ కుమార్ తన ఆడంబరమైన వ్యాన్ ని తన రెండవ ఇల్లుగా భావిస్తాడు. అందుచేత ఆ వ్యాన్ కి కూడా తన ఇంటిలాగా ఒక పేరు పెట్టాలని భావించాడు. అక్షయ్ కుమార్ తన ఆడంబరమైన వ్యాన్ కూడా నామకరణం చేసాడు. దాని పేరు ' అగస్త్య '.

8. సంజయ్ దత్ :

8. సంజయ్ దత్ :

సంజయ్ దత్ ఆడంబరమైన వ్యాన్ బయట నుండి చూడటానికి ఒక బస్సు ని తలపిస్తుంది. కానీ లోపలికి వెళ్లి చూస్తే అందుకు విరుద్ధంగా ఉంటుంది. లోపల అంతా పూర్తి తెలుపు ఇంటీరియర్ తో, సంజయ్ దత్ ఆడంబరమైన వ్యాన్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. పన్నెండు మీటర్ల పొడవున్న వోల్వో బి 7 ఆర్ వ్యాన్ ని దాదాపు 3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఒక ప్రముఖ దినపత్రిక వార్తలు ప్రచురించింది. లోపల లైటింగ్ వ్యవస్థ సౌకర్యవంతంగా ఉండటానికి టచ్ స్క్రీన్ వ్యవస్థతో రూపొందించారు మరియు ఆడుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. లోపల అంతా ఎక్కడ చూసినా చాలా విలాసవంతంగా ఉంటుంది.

9. వివేక్ ఒబెరాయ్:

9. వివేక్ ఒబెరాయ్:

ఇతని యొక్క ఆడంబరమైన వ్యాన్ ను ప్రముఖ డిజైనర్ దిలీప్ చ్చబ్రియా రూపొందించడం జరిగింది. ఉత్సాహపూరితమైన రంగులతో మరియు అద్భుతమైన కాంతులతో 10.5 మీటర్ల పొడవున్న ఈ ఆడంబరమైన వ్యాన్ లోపల అంతస్తులుగా నిర్మించడం జరిగింది. వ్యాకుమ్ టాయిలెట్ వ్యవస్థ మరియు స్నానం చేయుటకు చాలా పెద్ద టబ్బు కలిగి ఉండి, వాటర్ మసాజ్ చేసే వ్యవస్థ ( జాకుజీ వ్యవస్థ ) కూడా అందులో ఉంది. ఈ ఆడంబరమైన వ్యాన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అత్యద్భుతం అని చెప్పవచ్చు. అంతేకాకుండా అతిధుల కోసం ఒక ప్రత్యేకమైన విశ్రాంతి గది కూడా ఉంది.

10. అమితాబ్ బచ్చన్ :

10. అమితాబ్ బచ్చన్ :

అమితాబ్ బచ్చన్ కు ఈ ఆడంబరమైన వ్యాన్ ల గురించి పరిచయం చేసింది ఎవరో తెలుసా ? చిత్ర పరిశ్రమకు చెందిన ఒక గొప్ప వ్యక్తి నిర్మాత, దర్శకుడైన మన్మోహన్ దేశాయ్ అమితాబ్ బచ్చన్ కు ఈ ఆడంబరమైన వ్యాన్ ను పరిచయం చేశారు. అమితాబ్ బచ్చన్ తన ఆడంబరమైన వ్యాన్ ను వీలైనంత వరకు చాలా సాధారణంగా ఉంచుకోవాలని భావిస్తారు. నిత్యావసర వస్తువులన్నింటిని ఆ వ్యాన్ లో ఉంచుకొని చూడటానికి చాలా సాదా సీదాగా ఉంటుంది మరియు బాగుంటుంది అమితాబ్ బచ్చన్ వ్యాన్. ఒక ఫ్రిడ్జ్, అలంకరణకు ఒక గది మరియు ఒక టి.వి. అంతేకాకుండా వ్యాన్ లోపల వస్త్రాల కోసం ఒక పెద్ద దుస్తుల అలమర కూడా ఏర్పాటు చేసుకున్నారు.

పైన చెప్పబడిన అత్యంత విలాసవంతమైన ఖరీదైన ఆడంబరమైన వ్యాన్ లలో ఆయా సెలెబ్రిటీలు అందరూ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు గడపటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రెండవ ఇల్లు ఉంటడం కూడా చాలా ముఖ్యం.

English summary

Luxurious Vanity Vans (As Good As A Home) Owned By Celebrities

These celebs maintain a high-tech and super-luxurious vanity vans, as they consider it to be their second home. Owning a luxurious vanity van is basically a classy affair for celebs, as it means excessive pride in one's work. Let's have a look at what some of our B-town celebs own in the name of vanity vans.