నిజజీవిత కథలు ః జంతువులు పెంచిన మనుషుల పిల్లలు!

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

జంగిల్ బుక్ లో మౌగ్లి గురించి ఆలోచిస్తే చాలా వింతగా అనిపిస్తుంది.ఎలా ఒక చిన్న పిల్లోడు జంతువుల మధ్యలో పెరిగాడని,ఇదంతా కల్పన లోనే జరుగుతుందని నమ్ముతాం!

కానీ నిజ జీవితంలో కూడా కొందరు మనుషుల పిల్లలు జంతువుల దగ్గర పెరిగిన దాఖలాలు ఉన్నాయని మీకు తెలుసా?

ఇక్కడ ఈరోజు మీకు నిజ జీవితంలో జంతువుల దగ్గర పెరిగిన కొందరు పిల్లల గురించి చెప్తాం.చదివి తెలుసుకోండి..

కోతుల మధ్యలో పెరిగిన పిల్లవాడు!

కోతుల మధ్యలో పెరిగిన పిల్లవాడు!

1954 లో, మరియ చప్మన్ అనే అమ్మాయి అపహరించిబడి, కొలంబియా అడవుల్లో పడేయబడింది.తరువాత ఆ అమ్మాయి కందమూలాలు, బెర్రీలు మరియు అరటి పండ్లు తింటూ కోతుల మధ్యలో పెరిగింది.తను చెట్ల కొమ్మల మీద పడుకుంటూ, కోతుల లాగానే కాళ్ళు, చేతులు నేల మీద ఆనించి నడుస్తుంది కూడా.

వేటగాళ్ళు వచ్చి కాపాడే వరకు ఆమె అయిదు ఏళ్ళకు పైగా ఇక్కడే ఉన్నది.చాలా ఏళ్ళ తరువాత మాట్లాడటం నేర్చుకుంది, మరియు తన జీవిత కథని "పేరు లేని అమ్మాయి" అనే పుస్తకం లో వివరించింది కూడా.

చింపాంజీచే పెంచబడ్డ అబ్బాయి:

చింపాంజీచే పెంచబడ్డ అబ్బాయి:

బెల్లోకి అతని తల్లితండ్రులు తనని వదిలి వెళ్ళిపోయినప్పుడు కేవలం ఆరు నెలలు.తనని ఒక చింపాంజీ తీసుకెళ్ళింది.ఆ పిల్లోడికి,వంకర తిరిగిన కుడి భుజం, ఖాళీ రొమ్ము భాగం మరియు కొంచెం తేడా అయిన నుదురు వంటి శారీరక వైకల్యాలు ఉన్నాయి.రెండేళ్ళ తరువాత ఆ పిల్లాడిని కనుక్కునారు.

ఒక బాబును దత్తతు తీసుకున్న ఒక జంట కి వాళ్ళకి జీవితానికి సరిపోయే షాక్ తగిలింది

తోడేలు గుంట లో నుంచి బయటకు లాగబడ్డ అబ్బాయి.

'దిన సనిచర్ ' అనే అబ్బాయి 1867 లో తోడేలు గుంట లో నుంచి లాగబడ్డాడు.అప్పుడు అతనికి 6 ఏళ్ళు మాత్రమే.అతను భారత దేశంలోని బులంద్ షాహర్ అడవిలో దొరికాడు.తను బాగుపడే మొదటి రోజుల్లో అడవి జంతువు లానే ప్రవర్తించేవాడు.తన బట్టలు చించేసుకోని, నేల మీద నుంచి ఆహరం తింటూ, రెండు చేతులు మరియు కాళ్ళు నేల మీద పెట్టి పరుగు తీసేవాడు.

పచ్చి మాంసం తినేవాడు కూడా! కాపాడిన చాలా రోజులకి కూడా సంరక్షకులు అతనికి మాట్లాడటం నేర్పలేకపోయారు.తన జీవితం మొత్తం తను నేర్చుకున్నది కేవలం నిటారుగా నుంచోడం మరియు ఎంతో కష్టం మీద బట్టలు వేసుకోవడం.

కోతుల దగ్గర పెరిగిన ఇంకో బాబు:

కోతుల దగ్గర పెరిగిన ఇంకో బాబు:

జాన్ సేజ్బునియా ఆఫ్రికన్ అడవుల్లో మూడు ఏళ్ళు ఉన్నాడు.ఉగాండాలో జరిగిన అల్లర్లలో వాళ్ల తల్లి తండ్రులు చనిపోవడం వల్ల ఇతను అడవుల పాలయ్యడు.కోతులు తనని చేరదీసి పెంచాయి.పల్లెటూరి వాళ్ళు వచ్చి కాపాడేవరకు తను పళ్ళు, బెర్రీలు మరియు గింజలు తినేవాడు.తను బాగుపడే రోజుల్లో జాన్ కి కల్పించిన ఆశ్రయ సదనంలో మాట్లడటం నేర్పించటమే కాకుండా పిల్లల గుంపుతో పాటలు కూడా పాడించేవారు.

అడవి కుక్కలతో నివసించిన ఒక అబ్బాయి!

అడవి కుక్కలతో నివసించిన ఒక అబ్బాయి!

ట్రేనియన్ కాల్డరార్ కుక్కలతో పెరిగిన ఒక రోమేనియన్ అబ్బాయి.కాపాడినప్పుడు, తను కొన ప్రాణాలతో బ్రతికి ఉన్నాడు మరియు పోషకాహారలోపం, రికెట్స్, ఇంకా రక్త ప్రసరణ సరిగ్గా లేక బాధపడుతున్నాడు. తను ఆహరం పెట్టి పోషించే కుక్క శవం దగ్గర దొరికాడు.తనకి ఆకలి వేసినప్పుడు, చాలా దూకుడు గా తయారవడమే కాక కేకలు కూడా పెడతాడు.తన మొదటి రోజుల్లో, ఎక్కువ మంచం కింద పడుకోటానికి ఇష్టపడే వాడు.కాపాడిన రెండు నెళ్ళ తరువాత సాంఘికంగా కలిసే లక్షణాలు చూపించాడు కానీ ఏవోకొన్ని తప్ప మాటలు మాత్రం రాలేదు.

ప్రత్యేకమైన తల్లుల కథలు

మౌగ్లి అమ్మాయి:

మౌగ్లి అమ్మాయి:

ఒక 8 ఏళ్ళ పాపని అడవిలో కనుగొన్నారు.ఆ అమ్మాయి కి "ఏహ్సాస్" అని పేరు పెట్టారు కానీ "మౌగ్లి అమ్మాయి" గా అందరికి తెలుసు.భారత దేశపు కటార్నియఘాట్ అడవుల్లో కోతులతో పెరిగింది.తను కోతి లాగానే నడుస్తూ, ఎవరితో మాట్లాడేది కాదు.చేతులతో కాకుండా ,నేల మీద నుంచి నోటితో తినేది.ఇప్పుడు బాగుపడుతున్నపటికీ, తను పట్టుదలగా ఇంకా నేల మీద నాలుగు కాళ్ళతోనే నడుస్తుంది.

ఇలాంటి చాలా కథలు ఇంకా వినాలనుకుంటున్నరా? అయితే, మరిన్ని వివరాల కోసం ఈ విభాగాన్ని ఫాలో అవండి.

English summary

Children Who Lived Amidst Animals

Can you imagine that there are a few cases of humans beings being raised by animals? There are a few cases that have been reported of children who have lived with wild animals and have been rescued after years. Animals truly have taken care of these children in the most compassionate way.
Story first published: Friday, December 1, 2017, 15:45 [IST]