అరచేతి పై త్రిశూలం గుర్తు ఉంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

అరచేతి పై త్రిశూలం ని పోలి ఉన్న గీతాలు లేదా అలాంటి గుర్తులు గనుక ఉంటే, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి అవి తెలియజేస్తాయి. ఆ వ్యక్తిలో ఉన్న నిజమైన మరియు ఉత్తమమైన లక్షణాలను బయట పెడతాయి.

అరచేతి పై ఉండే త్రిశూలం గుర్తు ఏమి తెలియజేస్తుంది ? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ? ఎందుకు త్రిశూలాన్ని అంత ప్రాముఖ్యంగా భావిస్తారు.

ఒకసారి మీ అరచేయిని చాలా దగ్గరగా చూడండి. మీకు కొన్ని రకాల ఆకారాలు మరియు గుర్తులు కనపడతాయి. వాటిని చూస్తున్నప్పుడు అవి ఏవో అతి ముఖ్యమైన విషయాలను తెలియజేసే గొప్ప గుర్తులుగా మనకు అనిపిస్తుంది. అవి సూచించేవి ఖచ్చితంగా నిజం కాకపోవచ్చు, అయినప్పటికీ అరచేతి పై కనిపించే గుర్తులకు చాలామంది ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు.

రెండు చేతులు కలిపినప్పుడు అర్ధచంద్రాకారం ఏర్పడితే ఏమవుతుంది ?

వేద శాస్త్రం ప్రకారం అరచేతి పై కనపడే గీతలు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మరియు ఆ వ్యక్తి యొక్క నిజమైన మరియు ఉత్తమమైన లక్షణాలను బయటపెడతాయట.

మీ అరచేయి పై త్రిశూలం గుర్తు గనుక ఉంటే ఏదో మంచి జరుగుతుంది అని అర్ధం. ఈ త్రిశూలం గుర్తు ప్రతి ఒక్కరి అరచేతి పై కనిపించదు. ఈ త్రిశూలం గుర్తు చాలాకొద్ధి మంది అరచేతి పై మాత్రమే ఉంటుంది, అది కూడా వివిధ స్థానాల్లో ఉంటుంది. ఆలా ఉన్న ఆ కొద్దిమంది చాలా అదృష్టవంతులు. అంతేకాకుండా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది.

ఈ త్రిశూలం గుర్తులు పైకి లేదా క్రిందికి ఎలా అయినా ఉండొచ్చు. త్రిశూలం గనుక పైకి ఉంటే చాలా శక్తివంతం అని, అది ఆ వ్యక్తికి ఎంతో శక్తిని మరియు అపూర్వమైన దృష్టికోణాన్ని కూడా ఇస్తుందట. అయితే త్రిశూలం కనుక క్రింది వైపుగా ఉంటే, అది అంత ప్రభావం చూపించదు.

మీరు ఎంత గొప్పవారు, ధనికులవుతారో తెలిపే ఆసక్తికర అరచేతి గీతలు!

అరచేతి పై ఉన్న త్రిశూలం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రుడి శిఖర భాగంలో త్రిశూలం గనుక ఉంటే :

శుక్రుడి శిఖర భాగంలో త్రిశూలం గనుక ఉంటే :

శుక్రుడి శిఖర భాగం లో త్రిశూలం గనుక ఉంటే, అటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అంతేకాకుండా, వారు వారియొక్క జీవితంలో నిజమైన ప్రేమను పొందగలరు. అదే సమయంలో ఎదుటి వ్యక్తుల యొక్క భావాలను చక్కగా అర్ధం చేసుకుంటారు మరియు చుట్టూ ఉన్న సానుకూల దృక్పధాన్ని ఆస్వాదిస్తారు మరియు అభినందిస్తారు.

అంగారకుడి శిఖర భాగంలో లేదా క్రింది భాగంలో త్రిశూలం గనుక ఉంటే :

అంగారకుడి శిఖర భాగంలో లేదా క్రింది భాగంలో త్రిశూలం గనుక ఉంటే :

అంగారకుడి క్రింది భాగంలో త్రిశూలం గనుక ఉంటే అటువంటి వ్యక్తులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చాలా ఆలస్యం తర్వాత ఎంతో ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు.

అదే సమయంలో అంగారకుడి శిఖరానికి పై భాగంలో గనుక త్రిశూలం ఉంటే అటువంటి వ్యక్తి ఒక విజయవంతమైన క్రీడాకారుడిగా లేదా పోలీస్ ఆఫీసర్ గా ఎదుగుతాడు.

తల గీత చివర గనుక త్రిశూలం ఉంటే :

తల గీత చివర గనుక త్రిశూలం ఉంటే :

త్రిశూలం లోని ఒక భాగం చంద్రుడి శిఖరం దగ్గరికి మరియు మరొక భాగం బుధుడు యొక్క శిఖరం దగ్గరకు గనుక వెళ్తే అటువంటి వ్యక్తులు వృత్తి పరంగా విజయవంతమవుతారు. ఆ వ్యక్తికి మంచి వ్యాపార లక్షణాలు మరియు అత్యద్భుతంగా మాట్లాడే లక్షణాలు కూడా ఉన్నాయని అర్థం.

చంద్రుడి శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

చంద్రుడి శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

చంద్రుడి శిఖరం పై గనుక త్రిశూలం ఉంటే, అటువంటి వ్యక్తులు చాలా శక్తివంతమైన ఊహలు కలిగి ఉంటారు మరియు ఎంతో సృజనాత్మకంగా ఆలోచించగలరు. అంతేకాకుండా వీరు స్వాభావికంగానే ఎంతో ప్రేమగా ఉంటారు.

గుండె గీతకు చివర గనుక త్రిశూలం ఉంటే :

గుండె గీతకు చివర గనుక త్రిశూలం ఉంటే :

గుండె గీతకు చివర త్రిశూలం ఉంటే, చాలా అదృష్టం అని అర్ధం. ముఖ్యంగా చిత్రంలో చూపించినట్లుగా గురుడి యొక్క శిఖరం దగ్గర అది సమాప్తం అవుతుంటే, అది వారికి ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ వ్యక్తులు మానసికంగా, శారీరకంగా మరియు భావోద్వేగ పరంగా చాలా ధృడంగా ఉంటారు. మిగతావారితో పోలిస్తే చాలా స్థిరంగా కూడా వ్యవహరిస్తారు. సాధారణంగా ఈ గుర్తు బాగా డబ్బున్న ప్రజల దగ్గర చూడవచ్చు.

అదృష్ట గీత గనుక త్రిశూలం దగ్గర సమాప్తం అయితే:

అదృష్ట గీత గనుక త్రిశూలం దగ్గర సమాప్తం అయితే:

త్రిశూలం గుర్తు దగ్గర గనుక అదృష్ట గీత సమాప్తం అయితే, అటువంటి వ్యక్తులు చాలా విజయవంతులు అవుతారని మరియు బాగా డబ్బు కూడా సంపాదిస్తారని, ఖచ్చితత్వంతో కూడిన సూచనను ఇస్తుంది. శని యొక్క శిఖర భాగంలో త్రిశూలం గనుక సమాప్తం అయితే, అటువంటి వ్యక్తులు ఆస్తి లేదా స్థిరాస్తి లావాదేవీలు లేదా ఇతర వ్యాపారాల వల్ల బాగా డబ్బుని సంపాదిస్తారట.

బుధుడు యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

బుధుడు యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

బుధుడు యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే, అటువంటి వ్యక్తులు ధనాన్ని బాగా సంపాదిస్తారు. వాళ్ళు పనిచేసే వృత్తిలో కూడా పదోన్నతి పొందుతారు. అంతేకాకుండా వారు వ్యాపారం గనుక చేస్తుంటే బాధ్యత కూడా పెరుగుతుంది మరియు మాట్లాడే నైపుణ్యం కూడా మెరుగవుతుంది. ఎవరికైతే ఈ గుర్తు ఉంటుందో అటువంటి వ్యక్తులు పెద్ద జనసమూహం ఉన్నా కూడా అందరి దృష్టిని ఆకర్శించగలరు మరియు వారి యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే, వారికి అందరిని ఆకర్శించే వ్యక్తిత్వం, స్వభావము తో పాటు అందరినీ తమ వైపు తిప్పుకోగల వాగ్దాటి కలిగి ఉంటారు.

గురుడి యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

గురుడి యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

గురుడి యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే, అటువంటి వారికి ఎంతో గుర్తింపు లభిస్తుంది మరియు అత్యద్భుతమైన విజయాలను కూడా అందుకుంటారు. ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా ఆశయం సాధించాలని పరితపిస్తుంటారు మరియు చుట్టూ ఉన్న వ్యక్తులను పోగుచేసి వారికి నాయకత్వం వహించాలని కోరుకుంటారు. ఇటువంటి గుర్తులు సాధారణంగా నాయకుల దగ్గర చూడవచ్చు.

శని యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

శని యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

శని యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే, అటువంటి వ్యక్తులకు అత్యద్భుతమైన జ్ఞానం ఉందని తెలియజేస్తుంది మరియు భౌతిక ధనాన్ని కూడా కలిగి ఉంటారు. ఏ వ్యక్తులకైతే ఇటువంటి గుర్తులు ఉంటాయో అటువంటి వారు వృత్తిపరంగా ఎంతో కష్టపడి మరియు పోరాటం చేసి ధనవంతులు అవుతారు మరియు వృత్తి పరంగా విజయాలను కూడా అందుకుంటారు.

సూర్యుడి యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

సూర్యుడి యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే :

సూర్యుడి యొక్క శిఖరం పై త్రిశూలం గనుక ఉంటే, అది అరచేతి పై చుక్కతో సమానం. ఈ గుర్తు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు, ధనవంతులు అవుతారు, విజయవంతమవుతారు మరియు వృత్తిపరంగా ఎన్నో శిఖరాలను చేరుకొంటారు.

English summary

You Are Lucky If You Have A Trident Sign On Your Palm

These tridents lines on the palm give answers about a person's personality and these also help reveal a person's real and best feature.
Story first published: Friday, November 10, 2017, 20:00 [IST]
Subscribe Newsletter