ఇండియాలోనే కాదు, పాకిస్తాన్ లో కూడా ఓ మదర్ థెరిస్సా ఉన్నారు!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మదర్ థెరిస్సా గురించి ఎవరికి తెలియదు?, ప్రజలకు సేవ చేయాలనే అంకిత భావం మరియు వివిధ జబ్బులతో బాధపడే ప్రజలపై ఆమె చూపించే అమ్మ లాంటి ప్రేమ మరువలేనిది. ఎంతో మందికి ఆమె ఆదర్శం. నిరుపేదలు మరియు జబ్బుపడిన వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేసింది.

మనలో ఎంత మందికి మదర్ థెరిస్సా లాంటి వ్యక్తులు ఈ ప్రపంచం లో ఉన్నారని తెలుసు ? ఆమెకు స్వభావరీత్యా దగ్గరగా ఉండే ఒక మహిళ గురించి మీరు ఇప్పుడు వినబోతున్నారు. ఆమె " మదర్ థెరిస్సా ఆఫ్ పాకిస్థాన్ " గా ప్రసిద్ధి చెందింది. 87 సంవత్సరాలున్న ఆమె ఈ మధ్యే కన్ను మూసింది.

మదర్ థెరిసా గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు

కలలను సాధించాలి:

కలలను సాధించాలి:

ఆమె పేరుకు బదులు "మదర్ థెరిస్సా" అనే పేరు తో ఆమెను పిలిచినప్పటి నుండి ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడైతే ఈ వార్త బయటికి వచ్చిందో ఆమె పై పరిశోధన చేయడం ప్రారంభించారు. ఆమె గురించి కొన్ని ఆశక్తికరమైన విషయాలను కనుగొన్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్థాన్ మరిచిపోయిన గొప్ప మానవతావాది. ఎలా అయితే భారత దేశంలో మదర్ థెరిస్సా తన జీవితాన్ని పేదల కోసం అంకితం చేసిందో అదే పనిని ఆమె అక్కడ పాకిస్థాన్ లో చేసింది. మనం పాకిస్థాన్ మదర్ థెరిస్సా గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

ఆమె అసలు పాకిస్థాన్ దేశస్థురాలు కాదు :

ఆమె అసలు పాకిస్థాన్ దేశస్థురాలు కాదు :

ఆమె జన్మించింది జర్మనీ దేశంలో కానీ ఆమె మనస్సు మాత్రం పాకిస్థాన్ కు చేరువైయ్యింది. ఆమె పాకిస్థాన్ దేశాన్ని తన మాతృ దేశంగా భావించింది. 1960 వ సంవత్సరంలో అక్కడకు చేరుకుంది. ఆ దేశంలోని క్షయ, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న రోగులను దగ్గరకు తీసి సేవ చేయడం ప్రారంభించింది. వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది.

ఆమెను ప్రేరేపించింది ఏమిటంటే :

ఆమెను ప్రేరేపించింది ఏమిటంటే :

స్వతహాగా జర్మనీ దేశస్థురాలైన ఆమె రెండవ ప్రపంచ యుద్ధం లో జరిగిన ఘోరాలు చూసి తల్లడిల్లిపోయింది. ఆ తర్వాత తాను ఒక వైద్యురాలిగా మారి, తన జీవితాన్ని మనుష్యుల సేవకి అంకితం చేయాలని నిశ్చయించుకుంది. అందుకోసం ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఏర్పడిన "డాటర్స్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మేరీ ఆర్డర్" లో చేరింది.

ఆమె తన లక్ష్యాన్ని కనుగొన్నది:

ఆమె తన లక్ష్యాన్ని కనుగొన్నది:

ఒక సారి ప్రముఖ మీడియా సంస్థలకు ఆమె ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఏమని చెప్పిందంటే, ఆమె మొదటిసారి కరాచీ ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఒక వ్యాధిగ్రస్థుడైన యువకుడు దుమ్ము తో కూడిన నేల పై పాక్కుంటూ తన దగ్గరకు వచ్చాడంట. ఎందుకంటే అతనికి అంతకు మించిన మార్గం లేకపోవడం వల్ల, అలానే రావాలని భావించాడట. అది ఎప్పటికి మర్చిపోలేనని పేర్కొన్నది.

మోనాలిసా ఎవరు..?మోనాలిసా గురించి ఏది నిజం....?

ఆమె మొత్తం జీవితాన్ని ప్రజలకు సేవ చేయడానికే అంకితం చేసింది :

ఆమె మొత్తం జీవితాన్ని ప్రజలకు సేవ చేయడానికే అంకితం చేసింది :

" కాథలిక్ ఆర్డర్ ఆఫ్ ది డాటర్స్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మేరీ " అనే సంస్థ లో చేరాక ముందు ఆమె మైన్స్ మరియు మార్బర్గ్ అనే ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల లో వైద్య విద్యను అభ్యసించింది. ఆ సంస్థలో చేరిన తర్వాత మిషనరీ తరుపున సేవ చేయడానికి బయట దేశాలకు వెళ్ళవలసి వచ్చింది . విధి రాత వల్ల ఆమె పాకిస్థాన్ దేశంలో అడుగుపెట్టింది.

వ్యాధులను నియంత్రించడంలో ఎంతో సాయం చేసింది :

వ్యాధులను నియంత్రించడంలో ఎంతో సాయం చేసింది :

1950 నుండి 1996 మధ్య కాలం లో కుష్టి వ్యాధి పాకిస్థాన్ దేశం లో ప్రభలంగా ఉండేది. అలాంటి సమయంలో అద్భుతమైన సేవాదృక్పధం ఉన్నఈ మహిళ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, పాకిస్థాన్ ప్రభుత్వం మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాలలో తన వంతుగా ఎంతో క్రియాశీలకం గా వ్యవహరించి ముఖ్య పాత్ర పోషించింది.

ఆమె చేసిన గొప్ప పనికి ఎంతో మంది కొనియాడారు కానీ :

ఆమె చేసిన గొప్ప పనికి ఎంతో మంది కొనియాడారు కానీ :

కుష్టి వ్యాధి వల్ల ఎంతో మంది ప్రజలు నరకం అనుభవిస్తూ వారి యొక్క శరీర ఆకారాన్ని కోల్పోతారు. ఇలాంటి భయంకరమైన అంటువ్యాధి నుండి దేశానికి విముక్తి కలిగించినందుకు పాకిస్థాన్ దేశ ప్రధాన మంత్రి మరియు ఆర్మీ చీఫ్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. కానీ, ఓ నీటి బుడగలాగా ఆమె చేసిన సేవకు గాను ఆమెను ఎక్కువ రోజులు గుర్తించలేదు. మెల్లగా ఆమెను అందరు మరిచిపోయారు.

ఇంత గొప్ప పనులు చేసి ఎంతో ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఈ మహిళ నిజంగా ఎందరికో ఆదర్శం. మానవత్వానికి మించిన దైవత్వం లేదని నిరూపించిన ఈ మహిళ పేరు "ఫావ్ ".

English summary

Heard About The Mother Teresa Of Pakistan?

How many people like Mother Teresa do we actually know in today's world? This is the story of a similar kind of a woman, who was known as the Mother Teresa of Pakistan. She died recently at the age of 87 years.
Subscribe Newsletter