For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

13 శుక్రవారం లక్కీనా? అన్ లక్కీనా ? బ్యాడ్ లక్కా?లేదా మూఢనమ్మకమా?

|

మూఢ నమ్మకాలు వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని "మూఢ నమ్మకాలు" అంటారు. ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి.

భారతదేశం అంటేనే అనేక మతాలకు, విశ్వాసాలకు నిలయం. ఇతర ఏ దేశంలోనూ లేని ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇక్కడ ఉన్నాయి. అనేక వేల సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు వాటిని పాటిస్తున్నారు. అయితే నేటి తరం వారు అలాంటి ఆచారాలను మూఢ నమ్మకాలుగా కొట్టి పారేస్తున్నారు, కానీ కొంత మంది ఇప్పటికీ వాటిని పాటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మూఢ నమ్మకాలుగా ముద్ర పడ్డ పలు ఆచారాలను, వాటిలో అంతర్గతంగా దాగి ఉన్న పలు అర్థాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రవారం,13వ తారీఖు మరియు భయంకర 'ఫ్రిగ్గాత్రిస్కైడెకాఫోబియా’ తిరిగి మనలోని మూఢనమ్మకస్తులను వెంటాడటానికి వచ్చేసింది. 'ఫ్రిగ్గా’ అంటే శుక్రవారం మరియు 'త్రిస్కైడెకాఫోబియా’ అనే గ్రీకు పదం అర్థం పదమూడు అని. ఈ పదం పరస్కేవ్ మరియు డెకాత్రియేస్ పదాల నుంచి వచ్చింది.

ఒక నెల ఆదివారం నుంచి మొదలైతే 13వ తేది శుక్రవారం అవుతుంది. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం (పోప్ గ్రెగొరీ XIII ప్రవేశపెట్టినది) ఈ రోజు ఏడాదిలో ఒకటి నుంచి మూడుసార్లు వస్తుంది.

<strong>13వ నెంబర్ అన్ లక్కీ నెంబర్ ఎందుకనీ, 13 నెంబర్ అంటే ఎందుక భయపడుతారు?</strong>13వ నెంబర్ అన్ లక్కీ నెంబర్ ఎందుకనీ, 13 నెంబర్ అంటే ఎందుక భయపడుతారు?

facts about 13th friday

13, శుక్రవారం, దురదృష్ట దినం

పాశ్చాత్య మూఢనమ్మకాల ప్రకారం, 13వ తేదీ శుక్రవారం 'దురదృష్టానికి’ సంకేతం. ఇంగ్లీషులో దొరికిన పత్రాల ప్రకారం, జియోచినో రోస్సిని 1869 లో తన ఆత్మకథలో రాసినదాని ప్రకారం తను నవంబర్ 13 శుక్రవారంన చనిపోవడంతో, 13 శుక్రవారం అశుభమని ఉన్నది. జానపద పరిశోధకుల ప్రకారం 19వ శతాబ్దానికి ముందు 13వ తేదీ శుక్రవారం అపశకునమని ఎక్కడా లేదని చెప్పారు.

ఆరోజు అమెరికా ప్రజలు, ఎక్కడికీ డ్రైవింగ్ చేయరు. రెస్టారెంట్లలో కాక ఇళ్ళలోనే తింటారు. ఆరోజు పెళ్ళి కానీ మరే శుభకార్యాలు పెట్టుకోరు. క్రిస్టియన్ మతవిశ్వాసాల ప్రకారం ఆరోజు క్రీస్తు శిలువ వేయబడ్డాడు కాబట్టి అది దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు.

facts about 13th friday

13 మరియు శుక్రవారం దురదృష్టమని తెలిపే కొన్ని సంఘటనలు చూడండి- చరిత్రలో చూస్తే స్టాకు మార్కెట్ పడిపోయినప్పుడు నల్ల శుక్రవారంగా భావిస్తారు మరియు 1800ల నుంచి జరిగిన ప్రకృతి వైపరీత్యాల ప్రకారం కూడా కొన్ని సంఘటనలు దీనికి ఊతమిస్తున్నాయి.

భారతదేశంలో, 1997 ఢిల్లీ ఉపహార్ సినిమా హాలులో చెలరేగిన మంటలు, 59మంది ప్రాణాలు కోల్పోవటంతో అందరికీ ఈ నమ్మకం చాలా పెరిగింది.

facts about 13th friday

ఈ రెండు సంఘటనలేకాక, దక్షిణ ఫ్లోరిడాలో ఆగస్ట్ 13,2004 న వచ్చిన హరికేన్ చార్లీ, న్యూయార్క్ లో అక్టోబర్ 13,2006 న 'ఫ్రైడే ద 13థ్ స్టోర్మ్’ కూడా చాలా విచిత్రంగా, ఆశ్చర్యజనకంగానే జరిగాయి.

<strong>13 శుక్రవారం అన్ లక్కీ డే : '13' వ తేదీ శుక్రవారం(నేడు) మీరు చేయవలసినవి..</strong>13 శుక్రవారం అన్ లక్కీ డే : '13' వ తేదీ శుక్రవారం(నేడు) మీరు చేయవలసినవి..

2029 లో గ్రహశకలం 99942 అఫోఫిస్ కూడా శుక్రవారం 13 నే భూమికి దగ్గరగా వస్తుందనే పుకారు ఉన్నది..

facts about 13th friday

బ్రిటీష్ సంప్రదాయం ప్రకారం శుక్రవారం రోజునే బహిరంగ ఉరిశిక్ష అమలవుతుంది ఎందుకంతే, ఉరికంబానికి సరిగ్గా 13 మెట్లు ఉంటాయి.

మెరికన్లకే ఈ ఫోబియా
ఫ్రైడే 13 ఫోబియా అమెరికన్లకు చాలా ఎక్కువ. ఈ ఫోబియా వల్ల అగ్రదేశానికి ప్రతి ఏడాది 80 నుంచి 90 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతున్నదని నార్త్ కరోలినా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ సెంటర్ వెల్లడించింది.

ఫ్రైడే 13 ఫోబియా ఉన్నవాళ్లు ఆ రోజు ఏ పనీ చేయకుండా ఇళ్లకే పరిమితం కావడమే దీనికి కారణం. ఒక్క అమెరికాలోనే సుమారు 2 కోట్ల మంది ఈ ఫోబియాతో బాధపడుతున్నారు. దీనిపై సినిమాలు కూడా వచ్చాయి. 1

980ల్లో ఫ్రైడే ద థర్టీన్త్.. హారర్ మూవీ సిరీస్ అమెరికన్లలో ఈ ఫోబియాను మరింత పెంచింది. 2009లో ఈ సిరీస్‌లో చివరి సినిమా వచ్చింది.

ఫ్రైడే 13పై ఎన్నో అధ్యయనాలు
ప్రపంచవ్యాప్తంగా ఫ్రైడే 13 ఫోబియాపై ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. అయితే డచ్ సెంటర్ ఫర్ ఇన్సూరెన్స్ స్టాటిస్టిక్స్ జరిపిన ఓ అధ్యయనం మాత్రం ఆసక్తి కలిగిస్తున్నది.

శుక్రవారం 13వ తేదీన ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నట్లు వీళ్లు గుర్తించారు. ఈ లెక్కన ఇవాళ డ్రైవింగ్ సేఫ్ అంటూ ఈ అధ్యయనం తేల్చింది. ఇది మనం నమ్మొచ్చా అంటే ఎవరి నమ్మకాలు వారివి.

చెడు జరిగినవాళ్లు మంచిది కాదు అనుకుంటారు. ఈ ఏడాది కూడా రెండు ఫ్రైడే 13లు వచ్చాయి. గత జనవరిలో ఒకటి రాగా.. ఇవాళ మరొకటి.

అన్నీ తెలుసుకున్నాం కదా, ఈ రోజు మిగతారోజుల కన్నా పెద్ద భయానకమైతే కాదు, కానీ మూఢనమ్మకం వల్ల దీనికింత ప్రాముఖ్యత లభిస్తోంది.

English summary

Friday The 13th-Is It A Superstition?

These facts about Friday the 13th will clear your mind!
Desktop Bottom Promotion