మరణ లోయలో కదిలే రాళ్ల వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

జీవితం గురించి వర్ణించలేని సిద్ధాంతాలను మీరు తెలుసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ ప్రకృతి యొక్క మాయ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఒక రాయి దానంతట అదే కదలటాన్ని మీరు ఎప్పుడైనా ఊహించుకున్నారా ? అసాధ్యం అనిపిస్తుంది కదా ? కానీ ఈ మరణ లోయలో ఉండే రాళ్ళు వాటంతట అవే కదులుతాయని చాలామంది నమ్ముతారు.

ఇదే విషయమై ఎన్నో సిద్ధాంతాలు మరియు వివరణలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ విషయం గురించి వివరంగా, నమ్మే విధంగా ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఎవ్వరు కానీ వీటి వెనుక ఉన్న అసలు తర్కం గురించి చెప్పడం లో సఫలం కాలేదు.

మరణలోయలో కదిలే రాళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

ఇక్కడ రాళ్ళు వాటంతట అవే కదులుతూ ఉంటాయి !

ఇక్కడ రాళ్ళు వాటంతట అవే కదులుతూ ఉంటాయి !

ఈ ప్రదేశంలో రాళ్ళు వాటంతట అవే కదులుతూ ఉంటాయని చాలామంది పరిశోధకులు చెబుతుంటారు. ఎవ్వరు వాటిని చూడని సమయంలో మాత్రమే అవి కదులుతూ ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ ప్రదేశంలో ఎక్కడైతే రాళ్ళు కదులుతూ ఉంటాయో ఆ ప్రదేశాన్ని రేస్ ట్రాక్ ప్లాయా అని అంటారు. ఇది ఒక పొడి ప్రాంతం. ఇది " కదిలే రాళ్లకు " ప్రసిద్ధి చెందింది.

ప్రపంచంలో కెల్లా అత్యంత ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం ఈ మరణలోయ.

ప్రపంచంలో కెల్లా అత్యంత ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం ఈ మరణలోయ.

ప్రపంచంలో కెల్లా అత్యంత ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం ఈ మరణలోయ. ఇది కాలిఫోర్నియా కు తూర్పున ఉన్నది. ఈ మరణలోయ అనే ప్రదేశం ఏదైతే ఉందో, ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత వేడి కలిగిన ప్రదేశం. ఒక వంద సంవత్సరాలుగా ఈ మరణలోయ వెనుక ఎదో రహస్యం దాగి ఉంది.

ఇది ఒక రహస్యం :

ఇది ఒక రహస్యం :

ఇక్కడ పొడిగా ఉండే ప్రదేశములో ఎదో అర్ధం కానీ దారులను సూచిస్తూ, రాళ్ళు కదులుతున్నాయి అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఎవరైనా మనుష్యులు ఈ రాళ్లను కదుపుతున్నారా అనే దానికి ఆనవాళ్లు ఎక్కడా కనపడవు. దీంతో వీటి వెనుక మనుష్యులు ఎవరు లేరు అని స్పష్టంగా అర్ధం అవుతుంది. బాహ్య ప్రపంచం నుండి ఎటువంటి శక్తి అవసరము లేకుండానే ఇక్కడి రాళ్లు వాటంతట అవే కదులుతున్నాయి.

ఎవ్వరు చూడని సమయంలోనే ఇది జరుగుతుంది :

ఎవ్వరు చూడని సమయంలోనే ఇది జరుగుతుంది :

ఏ వ్యక్తులు చూడని సమయంలోనే ఈ రాళ్లు కదులుతాయని చాలామంది బలంగా నమ్ముతున్నారు. ఇది నిజంగా చాలా అద్భుతం అనే చెప్పాలి. మరో ప్రక్క అక్కడ ఉన్న అన్ని రాళ్లు కదలటం లేదని గుర్తించారు. దీనికి తోడు ఏ రాళ్లు అయితే కదులుతున్నాయో అవి ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కదులుతున్నాయట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కదిలే రాళ్లన్ని కూడా ఒకే దిశలో కదలటం లేదు. ఎదో ఒక తెలియని అయస్కాంత శక్తి ప్రభావం వల్ల ఈ రాళ్లు ఇలా కదులుతున్నాయని చాలామంది నమ్ముతున్నారు.

వివిధ రకాల సిద్ధాంతాలు :

వివిధ రకాల సిద్ధాంతాలు :

ఇక్కడ జరుగుతున్న ఈ నమ్మలేని నిజాన్ని గురించి వివరిస్తూ ఎన్నో రకాల సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మరణ లోయలో చాలా విపరీతమైన శక్తితో కూడిన గాలులు వీస్తాయని అందుచేతనే ఇక్కడి రాళ్లు కదులుతున్నాయని కొంతమంది చెబుతున్నారు. కానీ, అప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, అదే గనుక నిజమైతే అన్ని రాళ్ళు ఆ సమయంలో కదలాలి కదా? కానీ ఆలా జరగటం లేదు. అన్ని రాళ్ళల్లో కొన్ని రాళ్ళు మాత్రమే కదులుతున్నాయి.

ఇప్పటికి ఇది ఒక అంతుచిక్కని రహస్యమే :

ఇప్పటికి ఇది ఒక అంతుచిక్కని రహస్యమే :

మరికొన్ని సిద్ధాంతాలు మరియు పరిశోధకులు ఏమని చెబుతున్నారంటే, గాలి మరియు ఉష్ణోగ్రతల మూలంగానే ఈ చర్య జరుగుతుంది అని చెబుతున్నారు. ఈ కదిలే రాళ్లు బురద ఉన్న ప్రదేశాల్లో వంకర టింకరగా వెళ్తున్నాయి అనే విషయాన్ని గుర్తించారు. వీటి వల్ల అక్కడొక కాలిబాట తయారయ్యింది. దీంతో ఆ ప్రదేశంలో నిజంగానే రాళ్లన్నీ కదులుతున్నాయని చాలామంది నమ్ముతున్నారు.

ఈ ప్రదేశంలో ఏమి జరుగుతోంది అని మీరు భావిస్తున్నారు ? మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తెలపడం మాత్రం మరిచిపోకండి.

English summary

Facts About The Sailing Stones In The Death Valley

Facts About The Sailing Stones In The Death Valley.Do you think that the mystery about the sailing stones is solved?
Story first published: Wednesday, November 29, 2017, 9:30 [IST]
Subscribe Newsletter