వీటిని పాటిస్తే మీ జీవితం ఆనందమయం!

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

ప్రతి ఒక్కరూ వారి జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. జీవితంలో ఎలాంటి కష్టాలు రాకూడదని భావిస్తారు. ఒక్కో దశ నుంచి పైకి ఎదగాలని భావిస్తారు. జీవితంలో స్థిరత్వం ఉండాలని కోరుకుంటారు. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ప్రతి ఒక్కరూ ఇలానే కోరుకుంటారు. మరి అలా ఉండాలంటే ఏం చేయాలో తెలియక తికమకపడుతుంటారు. మనం చేసే పని పట్ల అంకితభావం ఉండాలి. హార్డ్ వర్క్ ఉండాలి. దేనికి వెనక్కి వెళ్లకూడదు. వీటితో పాటు మరికొన్నింటిని మీరూ రోజూ పాటిస్తే మీరు జీవితంలో అనుకున్న స్థాయికి ఎదుగుతారు. కొందరు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా వారిని శని వెంటాడుతూనే ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ ఇబ్బందులే ఎదురవుతుంటాయి. అలాటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితంలో మీకు ఎదురుండదు. ఇవి కొన్ని వేల సంవత్సరాల నాటి ఆచారాలే కావొచ్చు... కానీ ఇవి చాలా శక్తివంతమైన నియమాలు. వీటిని పాటించినవాళ్లు చాలా వరకు విజయపథంలో పయనిస్తూనే ఉంటారు. మరి మీరెందుకు ఇబ్బందిపడడం.. వీటిని పాటించడం జీవితాన్ని ఆనందమయం చేసుకోండి.

1. మొదట మీ అరచేతులు చూసుకోండి

1. మొదట మీ అరచేతులు చూసుకోండి

మీరు ఉదయం లేచిన వెంటనే మొదట మీ అరచేతుల్ని చూసుకోండి. మీరు ఉదయం మొట్టమొదట చేయాల్సిన పని ఇదే. ఎందుకంటే మన అరచేతుల్లోనే లక్ష్మి దేవత, అలాగే ఆ గోవిందుడు కొలువై ఉంటారని చాలామంది నమ్మకం. అందువల్ల ఉదయం లేవగానే ఒక్కసారి మీ అరచేతుల్ని చూసుకోండి చాలు.

2. కాకులకు కాస్త అన్నం పెట్టండి

2. కాకులకు కాస్త అన్నం పెట్టండి

చాలామంది కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెడుతుంటారు.

కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. మీరు శనివారం రోజు మొట్టమొదటగా చేయాల్సిన పని ఒక్కటే. అన్నాన్ని కాస్త పెరుగులో కలిపి కాకులకు పెట్టాలి. ఇలా చేస్తే మీకు జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయంట.

3. సూర్యుడిని మొక్కుతూ నీళ్లు సమర్పించండం

3. సూర్యుడిని మొక్కుతూ నీళ్లు సమర్పించండం

మీరు ఒక రాగి పాత్రలో కొంచెం నీరు తీసుకోండి. దానిలో కాస్త బెల్లం కలపండి. ప్రతి రోజూ ఉదయం సూర్యుడిని మొక్కుతూ ఈ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తూ ఉండండి. సూర్యోదయం అయ్యేటప్పుడు లేదంటే సూర్యోదయం అయ్యాక గంటలోపల గానీ ఇలా చేయాలి. ఇలా చేసేపటప్పుడు "ఓం హ్రీం సూర్యాయే నమహా" అనే మంత్రాన్ని 11 సార్లు ఉచ్చరించాలి.

4. మంత్రాలను స్మరించుకోవడం

4. మంత్రాలను స్మరించుకోవడం

ప్రతి రోజూ గాయత్రి మంత్రం లేదా మహా మృత్యుంజయ మంత్రాలను ఉచ్చరించాలి. రోజులో ఈ మంత్రాలను కనీనం 31 సార్లు ఉచ్చరించాలి. ఇలా చేయడం వల్ల దేవతల అనుగ్రహం పొందొచ్చు. ఇలా చేస్తే కచ్చితంగా మీరు విజయపథంలో పయనిస్తారు.

5. గణేశుడిని స్మరించుకోవాలి

5. గణేశుడిని స్మరించుకోవాలి

విఘ్న వినాయకుడిని స్మరించుకుంటే మీకు ఎలాంటి విఘ్నాలుండవు. ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సంప్రదాయం. గణేశుడికి సంబంధించిన కొన్ని మంత్రాలు చాలా శక్తివంతమైనవి. "ఓం గం గణపతియే నమః" అనే మంత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. దీన్ని స్మరించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

6. నిమ్మకాయలో లవంగాలు ఉంచడం

6. నిమ్మకాయలో లవంగాలు ఉంచడం

ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా చేయండి. ఒక్కో ముక్కలో నాలుగు లవంగాలు పెట్టండి. దీన్ని చేతిలో పట్టుకుని హనుమాన్ మంత్రం చదవండి. "ఓం శ్రీ హనుమయత్ నమః" అని 21 సార్లు పఠించాలి. అలాగే పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయను మీ జేబులో లేదా మీ బ్యాగులో పెట్టుకుని మీతో పాటు తీసుకెళ్లండి. ఇలా చేయడం వల్ల ఆ రోజు మొత్తం మంచి జరుగుతుంది.

English summary

how to improve your career with astrology

Here are a few easy astrology-based remedies for a good career. So, start your day by practicing these simple tricks that can help you become stronger with your career.
Story first published: Wednesday, November 22, 2017, 7:30 [IST]
Subscribe Newsletter