మీ చుట్టూ వ్యతిరేక శక్తి ఉంది అని తెలియజెప్పే లక్షణాలు!

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

వ్యతిరేక శక్తి మన చుట్టూ ఉన్నా కూడా మన కంటికి కనపడదు. అది జీవితాలను జీవించడానికి కష్టతరం చేస్తుంది. సామాన్యుడికి అర్ధం అయ్యే రీతిలో చెప్పాలంటే, ' ఒత్తిడి ' లేదా ' చెడు శకునాలు ' వ్యతిరేక శక్తిగా చెప్పవచ్చు.

కొన్ని సార్లు అనూహ్యంగా, అనుకోకుండా వ్యతిరేక సందర్భాలు లేదా ఆలోచనలు ఎక్కువగా మనల్ని చుట్టుముడుతుంటాయి. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే మన శరీరం, మెదడు మరియు ఆత్మ తరచుగా వాటికి ప్రతిస్పందిస్తుందో, అలాంటి సమయంలో ఎందుకు మనం శక్తి హీనులుగా మారుతున్నాం అనే ప్రశ్నకు సమాధానం దొరకదు. దీనికి సమాధానం ఏమిటంటే, మనచుట్టూ మనకు కనపడని వ్యతిరేక శక్తి ఉంది.

negative energy

ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవడానికి షాకింగ్ రీజన్స్..!

కానీ మనకి ఎలా తెలుస్తుంది మన చుట్టూ వ్యతిరేక శక్తి ఉందని. కొని సులభమైన పద్దతుల ద్వారా మన చుట్టూ వ్యతిరేక శక్తి ఉందో లేదో తెలుసుకోవచ్చు. వాటి గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం.

లక్షణం #1 : మీ చెంతకు డబ్బు సులభంగా రాకపోవడం:

లక్షణం #1 : మీ చెంతకు డబ్బు సులభంగా రాకపోవడం:

మీ చుట్టూ వ్యతిరేక శక్తి ఉంది అని తెలియజేసే మొట్టమొదటి లక్షణాల్లో ఇది కూడా ఒకటి. మీకు రావలసిన డబ్బుని రాబట్టుకోవడంలో విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నా లేదా మీరు చెల్లించవలసిన డబ్బు విపరీతంగా పెరిగిపోతున్నా, దీనికి తోడు డబ్బుని నియంత్రించడంలో మీరు పూర్తిగా విఫలం అయితే గనుక మీకు ముప్పు పొంచి ఉందని అర్ధం.

లక్షణం #2 : ఎల్లప్పుడూ విపరీతంగా అలసిపోయి ఉన్నట్లు భావిస్తారు :

లక్షణం #2 : ఎల్లప్పుడూ విపరీతంగా అలసిపోయి ఉన్నట్లు భావిస్తారు :

మీరు ఎక్కువగా అలసిపోయినా లేదా మీరు ఎక్కువగా ఎప్పుడూ అలసిపోయినట్లు భావిస్తున్నట్లైతే, ఇటువంటి సందర్భంలో చాలా సులభంగా విసుగు చెందుతారు. ఈ లక్షణం కూడా మీ చుట్టూ వ్యతిరేక శక్తి ఉందని తెలియజేస్తుంది. మీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తారు. మీరు ఓడిపోతారేమో అనే భావన మీలో కలుగుతుంది. కావాల్సినంత సేపు రాత్రిపూట విశ్రాంతి తీసుకున్నా కూడా, మీరు అలసిపోయినట్లు గనుక భావిస్తే మీ చుట్టూ వ్యతిరేక శక్తి ఉందని అర్ధం.

లక్షణం #3 : తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వడం :

లక్షణం #3 : తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వడం :

మీరు తీవ్రమైన ఒత్తిడికి లోనయినా లేదా రోజువారీ కార్యక్రమాలను ఇంతకు ముందులా చేయడం లో విఫలం చెందుతున్నట్లైతే, ఎక్కడో ఎదో తప్పు ఉందని అర్ధం. ఆ తప్పుని గుర్తించి సరిచేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యతిరేక శక్తిని దూరం చేసుకొని మీ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు.

లక్షణం #4: తరచూ ఇన్ఫెక్షన్ ల భారిన పడటం :

లక్షణం #4: తరచూ ఇన్ఫెక్షన్ ల భారిన పడటం :

తీవ్రమైన ఒత్తిడి వల్ల రోగనిరోధక వ్యవస్థ క్షీణించే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో వ్యక్తులు ఇన్ఫెక్షన్ ల భారిన పడుతుంటారు. సాధారణం కంటే కూడా తరచుగా, ఎక్కువగా ఇన్ఫెక్షన్ ల భారిన పడుతుంటారు. మునపటి కంటే ఇప్పుడు తరచుగా ఇన్ఫెక్షన్ ల భారిన పడుతుంటే గనుక మీ చుట్టూ వ్యతిరేక శక్తి ఉంది అని ఈ లక్షణం తెలియజేస్తుంది.

లక్షణం #5 : మీరు మాట్లాడే విధానం పై ప్రభావం చూపితే :

లక్షణం #5 : మీరు మాట్లాడే విధానం పై ప్రభావం చూపితే :

మీరు అందరితో మాట్లాడుతున్నప్పుడు ఏ కారణం లేకపోయినప్పటికీ మీరు మాట్లాడే విధానం పై ఎదో తెలియని ప్రభావం పడుతుంది అని మీరు గనుక గుర్తించినట్లయితే మరియు మీరు చెప్పే విషయాలన్నీ వింటున్న వారు అర్ధం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైతే మరియు ఇతరులను మీరు అర్ధం చేసుకోరు అని భావిస్తున్నట్లైతే, ఎదో సమస్య ఉందని అర్ధం.

లక్షణం #6 : మీరు నిద్రపోయే విధానం పై ప్రభావం చూపడం :

లక్షణం #6 : మీరు నిద్రపోయే విధానం పై ప్రభావం చూపడం :

మీరు నిద్రపోతున్న సమయంలో వింత కలలు లేదా భయంకరమైన కలలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అవి మీరు నిద్రపోయే విధానం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీనికి తోడు ఉపచేతన మనస్సు కూడా ఎదో సరిగ్గా లేదు అనే సంకేతాలను మీకు పంపిస్తూ ఉంటుంది. ఈ లక్షణం కూడా మీ చుట్టూ ఎదో వ్యతిరేక శక్తి ఉందని తెలియజేస్తుంది.

లక్షణం #7: ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకోవడం :

లక్షణం #7: ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకోవడం :

తాళాలు, డబ్బు, పర్సు, బట్టలు మొదలగునవి తరచుగా పోగొట్టుకోవడం మరియు వాటిని వెతికే క్రమం లో కష్టతరమైన సమయాన్ని ఎదుర్కోవడం, అంతే కాకుండా అవి మీ చుట్టూనే ఉంటూ మీకు కనపడుతున్నా చాలా సందర్భాల్లో వాటిని మీరు కనుక్కోలేకపోవడం, ఇలాంటి లక్షణాలు ఎన్నో మీ చుట్టూ ఎదో వ్యతిరేక శక్తి ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

English summary

How To Know If You Are Surrounded By Negative Energy

If you experience any of these things, then we bet you are surrounded by negative energy around you.
Subscribe Newsletter