For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవడానికి షాకింగ్ రీజన్స్..!

By Swathi
|

ఇంట్లో కొన్నిసార్లు అంతా బాగానే ఉన్నా.. సంతోషం ఉండదు. అందరూ కలిసిమెలిసి ఉన్నట్టే ఉంటుంది. కానీ.. ఏదో తెలియని వెలితి. ఎప్పుడూ గొడవలు, విమర్శలు వంటి వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. వీటన్నింటికి కారణమేమై ఉంటుందని ఆందోళన పడుతుంటాం. కొన్నిసార్లు పూజలు, వ్రతాలు చేస్తాం. మరీ ఎక్కువ సమస్యగా మారినప్పుడు పండితుల దగ్గరకు వెళ్లి పరిష్కారాలు కోరుకుంటూ ఉంటాం.

కానీ ఇంట్లో మనం చేసే కొన్ని పనులే.. నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవడానికి కారణమవుతాయి. మనం సాధారణంగా పాటించే పద్ధతుల్లో చేసే పొరపాట్లే.. నెగటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తాయి. మన నిర్లక్ష్యమే.. ఇంట్లో ప్రతికూల శక్తులు రావడానికి కారణమవుతాయి. అసలు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావడానికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దాన్ని ఎలా తరిమికొట్టాలో చూద్దాం..

అపరిశుభ్రత

అపరిశుభ్రత

ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా పడేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి.. ఇళ్లు పరిశుభ్రంగా, అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి.

స్వీట్స్

స్వీట్స్

మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ తినమని ఇస్తే వాటిని వెంటనే తినేయాలి. వాటిని అక్కడా ఇక్కడా పెట్టకూడదు. అలాగే స్వీట్ ని చేతిలో పట్టుకుని అటు ఇటు తిరగకూడదు. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవుతుంది.

మురికి దుస్తులు ధరించడం

మురికి దుస్తులు ధరించడం

మురికిగా ఉండే బట్టలు ధరించడం వల్ల.. క్రిములు రావడం మాత్రమే కాదు.. వాస్తు ప్రకారం కూడా ఇంటికి మంచిది కాదు.

దేవుళ్ల విగ్రహాలు

దేవుళ్ల విగ్రహాలు

దేవుళ్ల విగ్రహాలను ఎదురెదురుగా ఉంచకూడదు. అలా పెడితే.. ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవుతుంది. విగ్రహానికి సెపరేట్ గా పక్కనపక్కన పెట్టవచ్చు కానీ.. ఎదురెదురుగా పెట్టకూడదు.

విమర్శలు

విమర్శలు

మీ ఇంట్లో ఎక్కువగా విమర్శిస్తుండటం, ఇతరులు మిమ్మల్ని గట్టిగా అరుస్తూ ఉండటం, లేదా విమర్శించడం వంటి సంకేతాలన్నీ.. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని తెలుపుతాయి.

చెడుగా ఫీలవడం

చెడుగా ఫీలవడం

ఇంట్లో ఏదీ సరిగా లేదని పీలవుతుండటం, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఏదో ఒక పొరపాటు చేశారన్న ఆలోచనలు ఎక్కువగా వస్తుంటే.. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందని సూచిస్తుంది.

ఫిర్యాదులు

ఫిర్యాదులు

ఇంట్లో చాలా ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉందంటే.. మీరు ఎల్లప్పుడూ.. ఏదో ఒక ఫిర్యాదులు వింటూ ఉంటారు.

ఇంటిని శుభ్రం చేయడం

ఇంటిని శుభ్రం చేయడం

ప్రతి వారం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కర్టన్స్, రగ్గులు, కార్పెట్స్ వంటి వాటిలో దుమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.

చెత్త

చెత్త

ఇంట్లో అవసరం లేని వస్తువులను తొలగించి.. ఇళ్లు పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. మీరు ఉపయోగించన బట్టలు, సామాన్లు, పుస్తకాలను దానం చేయాలి. ఇళ్లు శుభ్రంగా, కేవలం కావాల్సిన వస్తువులతోనే ఉంటే.. నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవుతుంది.

 కిటికీలు తెరవడం

కిటికీలు తెరవడం

అప్పుడప్పుడు కిటికీలు తెరుస్తూ ఉండాలి. ఫ్రెష్ ఎయిర్ వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది.

ధ్యానం

ధ్యానం

రోజుకి ఒకసారి ధ్యానం చేయడం వల్ల.. మీరు మానసికంగా ప్రశాంతత పొందుతారు. ఇంట్లో ఏదైనా ప్రశాంతంగా ఉండే కార్నర్ లో కూర్చుని దేవుడిని ప్రార్థించండి. అయితే మీరు ప్రార్థించే ప్రాంతంలో ఖచ్చితంగా సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి.

క్యాండిల్స్

క్యాండిల్స్

సువాసనా బరితమైన క్యాండిల్స్ వెలిగించడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఎట్రాక్ట్ అవుతుంది.

ఫర్నిచర్

ఫర్నిచర్

ఇంట్లో ఫర్నిచర్ ని ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి.. మారుస్తూ ఉండాలి. అంటే.. ఒక వైపు నుంచి మరోవైపుకి జరపాలి. అలా జరిపేటప్పుడు ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి.

మొక్కలు

మొక్కలు

ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల.. ఆక్సిజన్, కలర్, మంచి ఎనర్జీ ఇంటికి వస్తుంది. కాబట్టి కొన్ని మొక్కలను లివింగ్ ఏరియాలో పెట్టుకోవాలి.

వెల్లుల్లి

వెల్లుల్లి

కొన్ని వెల్లుల్లి రెబ్బలను ఒక దారానికి కట్టి.. నెగటివ్ ఎనర్జీ ఉందని భావించే ప్రాంతాల్లో కట్టాలి. అలాగే ముఖద్వారానికి కూడా వేలాడదీయవచ్చు.

క్రిస్టల్స్

క్రిస్టల్స్

కొన్ని క్రిస్టల్స్ ని కిటికీలు, తలుపులు, మెట్లు, మూలల్లో వేలాడతీయవచ్చు. ఇవి నెగటివ్ ఎనర్జీని తొలగిస్తాయి.

రాళ్ల ఉప్పు

రాళ్ల ఉప్పు

ఇది చాలా అద్భుతమైన వాస్తు చిట్కా. ఇంటిని రాళ్ల ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేయాలి. లేదా అన్ని గదులలో రాళ్ల ఉప్పు ఉంచిన గిన్నెలు పెట్టుకోవాలి.

English summary

Doing these things will bring negative energy in your house

Doing these things will bring negative energy in your house. However do you know that what are otherwise considered as normal, regular things in the house can in fact turn out to the harbinger of negativity in your house?
Desktop Bottom Promotion