ప్రతి ఒక్కరి శరీరం ఖరీదు మూడు కోట్లకు పైనే!

Written By: Bharath
Subscribe to Boldsky

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి శరీరం చాలా ఖరీదైనది. ఇది అవాస్తవం కాదు. నిజం. బ్లాక్ మార్కెట్లో మీ బాడీ రేట్ కోట్లలో ఉంటుంది. బాడీలోని ప్రతిపార్ట్ చాలా విలువైనదే. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో బీభత్సమైన రేట్లు ఉన్నాయి. అలా అని బాడీలోని పార్ట్స్ ని అమ్ముకోమని చెప్పడం లేదు. మన శరీరం చాలా విలువైంది. అలాంటి బాడీ కలిగిన మనం దాన్ని ఎంతో భద్రంగా చూసుకోవాలి. మనం పుట్టుకోతోనే కోటీశ్వరులం. అలాంటి శరీరాన్ని బాగా కాపాడుకోండి. శరీర అవయవాల స్మగ్లింగ్ లో ఏ పార్ట్ కి ఎంత రేట్ ఉందో మీరూ తెలుసుకోండి.

మూత్రపిండాలు (కిడ్నీలు) - రూ. 1,34,19,290

మూత్రపిండాలు (కిడ్నీలు) - రూ. 1,34,19,290

బ్లాక్ మార్కెట్లో కిడ్నీలకు మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు చాలామంది డబ్బుల కోసం కిడ్నీలను అమ్ముకునే వారుంటారు. నిరుపేదలను మరీ గాలం వేసి పట్టుకునే కేటుగాళ్లు ప్రపంచవ్యాప్తంగా చాలామందే ఉన్నారు. శరీర అవయవాల స్మగ్లింగ్ లో భాగంగా కిడ్నీల వ్యాపారం చేసే వాళ్లు చాలామందే ఉన్నారు.

కాలేయం (లివర్) - రూ. 1,07,35,432

కాలేయం (లివర్) - రూ. 1,07,35,432

చాలామంది కాలేయాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటారు. అందువల్ల దీనికి బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. శరీర అవయవాల స్మగ్లింగ్ లో వీటిని అమ్ముతూ కొనుగోలు చేస్తూ ఉండేవారు దీనికి ఎక్కువగా డబ్బు చెల్లిస్తుంటారు.

గుండె (హార్ట్) - రూ. 79,84,477

గుండె (హార్ట్) - రూ. 79,84,477

కొన్ని దేశాల్లో బతికుండానే గుండెను దానం చేసేవారుంటారు. అలాంటి వారి గుండెకు మంచి రేట్ ఉంటుంది. ఇక బ్లాక్ మార్కెట్లో దీన్ని ఇంకా చాలా ఎక్కువకు అమ్ముతుంటారు. శరీర అవయవాల స్మగ్లింగ్ గుండెకు ఎక్కువగా డిమాండ్ ఉంది.

కార్నియా - రూ. 1,02,322

కార్నియా - రూ. 1,02,322

కార్నియా డ్యామేజీ వల్ల అంధత్వం వస్తుంది. అందువల్ల దీనికి కూడా ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అందువల్ల దీన్ని కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో దీని ధర అక్షరాల రూ. 1,02,322.

బోన్ మర్రో - రూ. 15,43,218

బోన్ మర్రో - రూ. 15,43,218

అక్రమార్కులు దీని ద్వారా కూడా ఎక్కువ డబ్బు సంపాదిస్తుంటారు. మనిషి శరీరంలో ఇది కూడా చాలా విలువైనది. దీన్ని అమ్ముకుని డబ్బులు సంపాదించే రాకాసులు చాలామందే ఉన్నారు.

అండాలు - రూ. 8,38,705

అండాలు - రూ. 8,38,705

ఆడవారి అండాలకు కూడా మార్కెట్లో చాలా రేట్ ఉంది. వీటిని కూడా చాలామంది కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటిని ఇచ్చే మహిళలకు మాత్రం అసలు ధర ఇవ్వరు. మధ్యలో దళారులు డబ్బులు కాజేస్తుంటారు.

కొరోనరీ ఆర్టరీ (ధమనులు) - రూ. 1,02,322

కొరోనరీ ఆర్టరీ (ధమనులు) - రూ. 1,02,322

హృదయానికి సంబంధించిన వ్యాధులతో చాలా మంది ఇబ్బందులుపడుతుంటారు. ఇందుకు ధమనుల సమస్య కారణం. కొన్ని సందర్భాల్లో వీటిని మార్చాల్సి వస్తుంది. హృదయ ధమనుల మార్పిడి చట్టబద్ధంగా జరగదు కానీ దీనికి కూడా కొన్ని చికిత్సలున్నాయి.

చిన్న పేగు - రూ. 1,69,015

చిన్న పేగు - రూ. 1,69,015

చిన్నపేగుకు కూడా చాలా డిమాండ్ ఉంది. దీన్ని కూడా కొందరు కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి అమ్ముతుంటారు. ఇలా మధ్య వర్తులు దీని ద్వారా ఎక్కువగా డబ్బు సంపాదిస్తుంటారు. ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సలలో చాలా అరుదుగా జరుగుతుంటుంది.

పిత్తాశయం (గాల్ బ్లాడర్ ) - రూ. 81,790

పిత్తాశయం (గాల్ బ్లాడర్ ) - రూ. 81,790

పిత్తాశయంలో రాళ్ల వల్ల కొందరు బాధడపుతుంటారు. అలాంటి వారికి ఇలాంటి అవయవాలు అవసరం అవుతాయి. కొన్ని సందర్భాల్లో పిత్తాశయం తొలగించాల్సి వస్తుంది. అందువల్ల దీనికి కూడా బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా రేట్ ఉంది.

రక్తం - రూ. 1677 నుంచి రూ. 22,812 వరకు

రక్తం - రూ. 1677 నుంచి రూ. 22,812 వరకు

మనలో చాలామంది రక్తాన్ని దానం చేయవచ్చు. అయినా చాలా బ్లడ్ బ్యాంకుల్లో రక్తం కొరత ఇప్పటికీ ఉంది. అందువల్ల రక్తాన్ని కూడా కొనే వాళ్లు

చాలా మందే ఉన్నారు. కొన్ని గ్రూపుల రక్తం అస్సలు దొరకదు. అందువల్ల వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. బ్లడ్ గ్రూప్ ను బట్టీ రేట్ ఉంటుంది. అయితే ఇందులో కూడా దళారులే ఈ డబ్బు తింటూ ఉంటారు.

ఒక జత ఐబాల్స్ - రూ. 1,02,322

ఒక జత ఐబాల్స్ - రూ. 1,02,322

మన కళ్లలోని నల్ల కనుగుడ్లకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కార్నియా మాదిరిగానే వీటిని కూడా బ్లాక్ మార్కెట్లో ఎక్కువగానే అమ్ముతుంటారు.

ఒక మనిషి బాడీ మొత్తం విలువ

ఒక మనిషి బాడీ మొత్తం విలువ

కిడ్నీలు - 1,34,19,290

లివర్ - 1,07,35,432

హార్ట్ - 79,84,477

కార్నెయాస్ - 1,02,322

బోన్ మారో - 15,43,218

స్త్రీల అండాలు - 8,38,705

కారోనరీ ఆర్టరి - 1,02,322

చిన్న ప్రేగు - 1,69,015

పిత్తాశయం - 81,790

రక్తం - 1677-22,812

కనుగుడ్లు జత - 1,02,322

మొత్తం = 3, 51,01,705.

English summary

how much body parts cost in the black market

How Much The Human Body Is Worth In The Black Market?
Story first published: Saturday, December 9, 2017, 9:30 [IST]