వాళ్లు చంపి పొట్ట చీల్చేవారు..అందుకే ఆ కులాలపై ఇప్పటికీ ఆ మచ్చ ఉంది

Written By: Bharath
Subscribe to Boldsky

కొన్ని వందల ఏళ్ల క్రితం మనదేశంలో ఒక తెగ ఉండేది. బాటసారుల్ని హతమారుస్తూ అరాచకంగా ప్రవర్తించేవారు. వీరంతా కాళీ ఉపాసకులు. వీళ్లు హత్యలతో వందలాది మంది మాయమయ్యేవారు. వీరిని 'థగ్గులు' అని అనేవారు. థగ్గులు పిండారుల మాదిరిగా ప్రవర్తించేవారు. ఆయుధ పాణులై గుంపులు గుంపులుగా ఊళ్ల మీద పడి దోచుకునే దండులని పిండారులంటారు. ఈ థగ్గులకు మనకి ఏం సంబంధం అని అనుకోకండి. ఎప్పుడో వీళ్లు చేసిన అరాచకాలు మొన్నటి వరకు కొన్ని కులాలపై ప్రభావంపడింది. బ్రిటీష్ ప్రభుత్వం వీరిని అణిచివేయడానికి తీసుకొచ్చిన చట్టం కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఉండింది.

18-19 శతాబ్దాల్లో భారతదేశంలో దోపిడీలు, హత్యలను వృత్తిగా స్వీకరించిన దొంగల్లో థగ్గులు. వీరు కాళికాదేవిని పూజించేవారు. వీళ్లు విచ్చల విడిగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేసేవారు. ఇది తమ వృత్తిగా భావించేవారు. అత్యంత దారుణంగా అకృత్యాలు చేసే థగ్గులు స్త్రీలు, పిల్లల విషయంలో మాత్రం కొన్ని నియమాలు పాటించేవారు.

వీరి ప్రస్థానం ఇదే

వీరి ప్రస్థానం ఇదే

కాళికాదేవి రక్తబీజుడనే రాక్షసునితో యుద్ధం చేసినప్పుడు అతని రక్తబిందువుల నుంచి ఒక్కొక్క రక్తబీజుడు జన్మించాడు. అమ్మవారు రాక్షసున్ని అంతం చేసేందుకు కొందరిని సృష్టించిందంట. యుద్దరంగమంతా నాలికలు పరవమని వారిని ఆదేశించిందంట. రక్తబీజుల శరీరం నుంచి చిందిన ప్రతి రక్తబిందువూ వారు తాగేయడంతో నిర్వీర్యుడై రక్తబీజుడు నశించాడనేది కథ. అలా కాళికామాత తనకు సహాయంగా సృష్టించినవారే థగ్గులు అని కథల్లో చెప్పుకుంటారు.

కిరాతకంగా చంపేవారు

కిరాతకంగా చంపేవారు

వీరు నిర్ణయించుకున్న దారుల్లోని ఊళ్ళల్లో ఇద్దరిద్దరు చొప్పున పెద్దమనుషులుగా వేషాలు వేసుకుని మకాం వేస్తారు. ఊళ్ళో ధనికులు వేరే ఊరు వెళ్ళాలని నిర్ణయించుకున్న సమయం చూసి వారికి దగ్గరై తాము సైనికులమని, తామూ వాళ్ళు వెళ్ళే దారిలోనే వెళ్తున్నామని తమను వారిలో చేర్చుకుంటే రక్షణ ఇస్తామని చెప్పేవారంట. వాళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం ధనికులను కిరాతకంగా హత్యచేసి ధనం దోచుకునేవారు. వీళ్లు దీపిడీ చేశాక కచ్చితంగా చంపేసేవారు.

పొట్ట చీల్చి పాతిపెట్టేవారు

పొట్ట చీల్చి పాతిపెట్టేవారు

వాళ్లు చంపాలనుకన్న వ్యక్తి గొంతుకు పసుపురంగు రుమాల్ గుడ్డను బిగించేవారు. చంపడంలో వీరు సిద్ధహస్తులు. ఒక్క రక్తం చుక్క కిందపడకుంగా వీళ్లు చంపేవారు. వీళ్లు ముందుగానే పాతిపెట్టడానిక గుంతలు తీసేవారు. తర్వాత పొట్టచీల్చి పాతిపెట్టేవారు. పొట్ట చీల్చుకుంటే, అది ఉబ్బి పూడ్చిన మట్టి పైకిలేస్తుందని, దాన్ని చూసి నక్కలు గుర్తుపట్టి శవాలని బయటకుతీస్తే మొత్తం పొక్కుతుందనే ఉద్దేశంతో అలా చేసేవారు.

బ్రిటీష్ పాలకులు వీళ్ల హత్యలను నియంత్రించారు.

బ్రిటీష్ పాలకులు వీళ్ల హత్యలను నియంత్రించారు.

19వ శతాబ్ది నాటికి భారతదేశంలో అన్ని ప్రదేశాల్లోనూ థగ్గులు గుంపులు గుంపులుగా విస్తరించినట్టు బ్రిటీష్ పాలకులు గుర్తించారు. అప్పటికే వందలాది సంవత్సరాల నుంచి థగ్గుల బెడద దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉండేది. బ్రిటీష్ ఇండియా గవర్నర్ జనరల్ గా పనిచేసిన విలియం బెంటింగ్ థగ్గులను పట్టుకుని శిక్షించాలని భావించాడు థగ్గులు చేసే ప్రతి కార్యకలాపాన్నీ నిషేధించారు. థగ్గులను నిర్మూలించేందుకు స్లీమన్ అనే పోలీసు అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఈయన కృషివల్ల థగ్గుల అణచివేత బ్రిటీస్ ప్రభుత్వానికి సాధ్యమయ్యింది.

థగ్గుల వల్లే చట్టం

థగ్గుల వల్లే చట్టం

థగ్గుల నిర్మూలన తర్వాత ఈ అనుభవంతో భారతదేశంలో నేర జాతుల చట్టం (క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ) 1871లో తీసుకువచ్చారు. ఆ క్రమంలో పలు సంచారజాతులను నేరజాతులుగా రికార్డులకెక్కించి వారికి స్టూవర్ట్ పురం వగైరా గ్రామాల్లో సెటిల్మెంట్లు ఏర్పాటుచేశారు. 1904 వరకూ థగ్గులు మరియు దోపిడీల విభాగం కొనసాగి తర్వాత సెంట్రల్ క్రిమినల్ ఇంటిలిజెన్స్ డిపార్ట్ మెంటు (సీఐడీ) గా రూపొందింది.

క్రిమినల్‌ ట్రైబ్‌ చట్టం

క్రిమినల్‌ ట్రైబ్‌ చట్టం

1740 - 1840 మధ్య దక్షిణ భారతదేశంలో దాదాపు ఒక మిలియన్ ప్రజల్ని థగ్గులు చంపేశారు. దీంతో వీరి నేరాలను, దోపీడీలను అరికట్టేందుకు అప్పటి మద్రాస్ రాష్ర్టంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. బ్రిటీష్‌ కాలంలోనే నేరప్రవత్తిగల తెగల చట్టం 1871లో వచ్చింది. ఈ చట్టం ద్వారా కొన్ని కులాల వారిని నేరస్థులని ముద్రవేశారు. ఇం దులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంచారజాతులు ఉన్నాయి. అప్పట్లో ఎక్కడ ఏం జరిగినా వీరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేవారు.

కులాలు అడగడానికి కారణం అదే

కులాలు అడగడానికి కారణం అదే

అప్పుడెప్పుడు కులాల ప్రాతిపదికన చేసిన ఈ చట్టం ఇప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. పోలీస్‌స్టేషన్లలో ఏదైన ఆరోపణలపై వెళ్లిన వ్యక్తిని నీ కులం ఏమిటని అడుగుతుంటారు. కులాన్ని బట్టి వారి స్వభావం ఉంటుందని పోలీసు లాలో ఉండడమే ఇందుకు కారణం.

ఆ కులాల్లో పుట్టడమే పాపంగా ఉండేది

ఆ కులాల్లో పుట్టడమే పాపంగా ఉండేది

గతంలో ఆ కులాల్లో పుట్టడమే పాపాంగా భావించేవారు. తప్పు చేయకున్నా నేరస్థులనే నింద భరించాల్సి వచ్చేది. దీంతో చాలామంది ఇబ్బందులుపడేవారు. దొంగతనాలు మేము చేయట్లేదు అని మొరపెట్టకున్నా అధికారులు వినేవారు కాదు.

స్వాతంత్య్రం వచ్చాక కూడా

స్వాతంత్య్రం వచ్చాక కూడా

స్వాతంత్య్రం వచ్చాక కూడా మొదట్లో మన నాయకులు బ్రిటిష్‌ వారు అమలు చేసిన విధంగానే క్రిమి నల్‌ ట్రైబ్స్‌ పై శీతకన్ను వేశారు. వారిని సమాజానికి దూరంగా ఉంచాలని భావించారు.

నెహ్రూ క్రిమినల్ ట్రైబ్ ను ఒప్పుకోలేదు

నెహ్రూ క్రిమినల్ ట్రైబ్ ను ఒప్పుకోలేదు

స్వాతంత్ర్యం వచ్చాక జవహర్‌ లాల్‌ నెహ్రు భారతీయుల్లో కొందరిని క్రిమినల్‌ ట్రైబ్‌ అనటం బాగా లేదన్నారు. ఇప్పుడు ఏమైనా కావాలంటే రాజ్యాంగంలో క్రిమినల్‌ ట్రైబ్‌ పేరులేదు. నొమాడిక్‌ ట్రైబ్‌ అనేవాడు లేడు.

1948 అయ్యం గారి కమిషన్‌ వేశారు. ఈయన క్రిమినల్‌ ట్రైబ్స్‌ పరిస్థితి దారుణంగా ఉందని నివేదిక సమర్పించారు. ఈ పేరు మార్చాలని ప్రభుత్వానికి సూచించారు. దీంతో జవహార్ లాల్ నెహ్రూ క్రిమినల్‌ ట్రైబ్‌ పదాన్ని 1952లో ఎత్తివేశారు. క్రిమినల్‌ ట్రైబ్‌ అనే వారిని 1952 వరకు క్రిమినల్‌ ట్రైబ్‌గా డినోటిఫైడ్‌ చేశారు. అందుకు డినోటిఫైడ్‌ ట్రైబ్స్‌ అయ్యా రు. ఆ పేరు 1948 తరువాత రాజ్యాంగాన్ని ఎడాప్ట్‌ చేసిన తరు వాత కంటిన్యూ అయ్యింది.

ఇలా మార్చారు

ఇలా మార్చారు

ఈ చట్టం మార్చేటప్పుడు ఆయా రాష్ట్రాలకు కొన్ని రకాల సూచనలు చేశారు. డీఎన్‌టీలతోపాటు డీఎన్‌టీలు కాకుం డా ఉన్న నోమాడిక్‌ ట్రైబ్స్‌, సిమినోమాడిక్‌ ట్రైబ్స్‌ ఈ మూడింటినీ కలిపి ఒక కేటగిరి చేసి వీరికి ఏమైనా సహాయం కావాలంటే కేంద్రప్రభుత్వం చేస్తుందని రాష్ట్రప్రభుత్వాలకు సూచించారు. అప్పుడు డీఎన్‌టీ, నొమాడిక్‌, సెమినోమాడిక్‌ అందరిని కలిపి ఒక కేటగిరి చేసింది.

చాలా కమిషన్లు వచ్చాయి

చాలా కమిషన్లు వచ్చాయి

1871 నేరస్థజాతుల చట్టాన్ని కా లానుగుణంగా సవరణలు చేస్తూ పోడిగించారు. స్వాతంత్య్రానికి ముందు నుండి పలువురు సంఘసంస్కర్తల వల్ల స్వాతంత్య్రం వచ్చాక 1952లో 1871 నేరస్థుల జాతుల చట్టాన్ని రద్దు చేశా రు. 1970 కాలంలో లంబాడ, ఎరుకల కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. మిగతా కులాలను వదిలేశారు.సామాజికం గా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ తెగల్లో ఎవరు లేకపోవడమే ఇందుకు కారణం.

ఇప్పటికే కమిషన్లు నడుస్తూనే ఉన్నాయి

ఇప్పటికే కమిషన్లు నడుస్తూనే ఉన్నాయి

2004లో జస్టిస్‌ మోతిలాల్‌ రాథోడ్‌ అధ్యక్షతన అప్పటి కేంద్రప్ర భుత్వం ఒక కమీషన్‌ను వేసింది. 2006లో మహారాష్ట్రకు చెంది న జస్టిస్‌ బాలకష్ణరేణకే అధ్యక్షతన రెండో కమిటీని యూపీఏ వేసింది. సంచార జాతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు రేణకే కమిటీ 76 సిఫార్సులతో 2008లో నివేదికను తయారుచేసింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు సమర్పించింది. అయినా ఆ కమీషన్‌ సిఫార్సులను నెరవేర్చటంలో కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకోలేదు.

English summary

how some communities affected criminal tribes act

How Some Communities Affected By Criminal Tribes Act?
Subscribe Newsletter