మనలో ఎంతో స్ఫూర్తిని నింపే బాబా రామ్ దేవ్ జీవిత పాఠాలు

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఒక వ్యక్తి తన జీవితంలో తన పేరు ద్వారా కాకుండా తాను చేసే పని వల్ల ఎంతో మంది చేత గుర్తింపు పొందగలిగాడంటే, అతను జీవితాన్ని గెలిచి ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నట్లే లెక్క. అల్లాంటి కొద్ది మంది వ్యక్తుల్లో బాబా రామ్ దేవ్ ఒకరు.

మన దేశం లోనే కాదు, ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా బాబా రామ్ దేవ్ పేరు మారు మ్రోగిపోతోంది. ప్రపంచానికి పరిచయం అవసరం లేని వ్యక్తిగా పేరు సంపాదించి యోగాకు పర్యాయపదంగా నిలిచి, దాని విశిష్ట ప్రత్యేకతను ప్రపంచానికి చాటాడు. భారతీయ యోగ శాస్త్ర గొప్పతనాన్ని ఆవిష్కరించాడు.

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక అసమాన్య వ్యక్తిగా ఎదిగాడు. ఏదైనా గొప్పగా చేయాలి, అందరి ముందు తలా ఎత్తుకొని గర్వం గా నిలపడాలి, ఈ ప్రేపంచం ముందు తాను ఏంటో నిరూపించుకోవాలి అనే తపనతో కూడిన పట్టుదలకు కసి తోడవడంతో ఈరోజు ఎవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగారు బాబా రామ్ దేవ్.

ప్రకాశించే చర్మం పొందడానికి యోగా గురువు చెప్పే10 టాప్ టిప్స్

బాబా రామ్ దేవ్ ఒక్క గొప్ప వ్యక్తి అవ్వడం వెనుక అసలు కారణం, అతడు కొన్ని నియమ నిబంధనలను నమ్మారు, ఆచరించారు, కొన్ని గొప్ప లక్షణాలను అలవర్చుకున్నారు. మనం కూడా పట్టుదలతో గొప్ప వ్యక్తులుగా మారడానికి బాబా రామ దేవ్ జీవిత పాఠాలను ఆదర్శంగా తీసుకుంటే మనం పయనించే మార్గం లో కూడా ఎన్నో విజయాలను సాధించి మరెంతో ఎత్తుకు ఎదగ గలం.

బాబా రామ్ దేవ్ విజయ రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం :

బాబా రామ్ దేవ్ అసలు పేరు రామకృష్ణ యాదవ్. మొదట సైకిల్ పై వీధి వీధి తిరిగి ఊరు వాడ ఆయుర్వేద మందులు అమ్మేవాడు.

1.

1. "నీ జీవితం లో ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకో "- బాబా రామ్ దేవ్

బాబా రామ్ దేవ్ తన జీవితం లో ఒకటి బలం గా నమ్మేవాడు. మన జీవితంలో ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలి . అతనిని చూసి మనం ఎప్పుడూ స్ఫూర్తిని పొందుతుండాలి అని నమ్మి దానిని ఆచరించేవాడు. తన ఇంట్లో ఎప్పుడూ సుభాష్ చంద్ర బోస్,భగత్ సింగ్ చిత్రపటాలు ఉండేవి.

రోజంతా సైకిల్ పై తిరిగి ఎంత అలసిపోయి వచ్చినా, ఆ చిత్రపటాలు వైపు తదేకంగా చూసేవాడు. ఎప్పటికయినా వాళ్లంతా గొప్ప వ్యక్తులుగా తాను కూడా భవిష్యత్తులో అవ్వాలని ఆశపడేవాడు. అలా ఆశపడ్డ బాబా రామ్ దేవ్ ని చూసి ఈరోజు లక్షల మంది తనలాగా ఆరోగ్యంగా ఉండాలని కలలు కంటున్నారంటే అతిశయోక్తి కాదు.

2.

2. "నీ కలలని నువ్వు గట్టిగా నమ్ము అని ఎప్పుడూ చెబుతుంటాడు"

బాబా రామ్ దేవ్ తన చిన్నతనం లో వాళ్ళ అమ్మకు ఎప్పుడూ తన కలల గురించి చెప్పేవాడు. తాను ఎప్పటికయినా కోట్ల మంది చేత గుర్తింపుపొంది, ఎంతో మంది గర్వించదగ్గ వ్యక్తిగా మారి భారతీయతకు చిహ్నంగా నిలబడతానని చెప్పేవాడు. ఇవన్నీ విన్న వాళ్ళ అమ్మ మాత్రం నీ కలలు ఎప్పటికి నిజం కావు, అవి నిజమవ్వాలంటే చాలా కష్టం అని కొట్టిపారేసేది. ఇది విన్నప్పుడు, రామ్ దేవ్ లో కాస్త నైరాశ్యం అలుముకునేది, కానీ తాను సాధించాలనుకునే విజయం కోసం మాత్రం విపరీతంగా కష్టపడేవాడు.

3.

3. "నీవు చేసే పని పై విపరీతమైన అంకిత భావం చాలా ముఖ్యం "

బాబా రామ్ దేవ్ చదువుకున్న స్కూల్ లో, ఎనిమిదవ తరగతి ఉతీర్ణుడైనది ఆయన ఒక్కడే. సామాన్య వ్యక్తికి .సాధ్యం కానీ పనిని అసాధారణ స్థాయిలో ఒకటిన్నర సంవత్సరంలో వేదాలను, ఉపనిషత్తులను పూర్తిగా చదివేశాడు. చదువుకోవాలనే పట్టుదల, లక్ష్యాలను చేరుకోవాలనే ఆశ రామ్ దేవ్ తో ఎంతటి కష్టమైన పనినైనా చేయించేది.

మన ఆరోగ్యకరమైన జీవితం కోసం 8 రాందేవ్ యోగ భంగిమలు

4.

4. "నువ్వు ఎప్పుడూ కొత్తగా ఆలోచించు, విభిన్నంగా ఉండు "

బాబా రామ్ దేవ్ వేసే కొన్ని యోగాసనాలు కొత్తగా వింతగా ఉంటాయి. అతను చేసే ఆసనాలను గమనించినా లేదా యోగాసనాలలో భాగంగా అతని పొట్టను లోపలి బయటికి అదిమే విధానం గాని, ఇలా ఏదైనా ఆయన చేసేవి సంప్రదాయబద్ధంగా ఉన్న యోగాసనాల కన్నా విభిన్నం గా ఉంటాయి. అయన అలా విభిన్నం గా తన ప్రయాణం కొనసాగించడం వల్లనే, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన యోగాసనాలను గమనిస్తే, వేరే వ్యక్తి వాటి గురించి చెప్పనవసరం లేదు. మనకు మనమే అర్ధం చేసుకునే విధంగా ఉంటాయి.

5.

5. "నువ్వు చేయబోయే అసాధారణ పనులు గురించి ముందే చెప్పడానికి ఎప్పుడూ భయపడకు "

నీ పై నీకు నమ్మకం ఉన్నప్పుడు, ఏదైనా చేయగలను అనే శక్తి నీలో ఉన్నప్పుడు, నువ్వు చేయబోయే అసాధారణ పనులు చెప్పడానికి సిగ్గు పడకు. ఈ విషయాన్ని బాబా రామ్ దేవ్ తన జీవితం లో పాటించాడు. అందులో భాగంగానే తన యోగాసనాల ద్వారా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, బరువు తగ్గడం ఇలా ఎన్నో సమస్యల భారి నుండి బయటపడవచ్చని చెప్పేవాడు.

6.

6. " మూలాలను నువ్వు ఎప్పుడూ మర్చిపోకు"

యోగాలో ఎంతో శక్తి ఉందని నమ్మేవాడు. మన పూర్వికులు,ఆయుర్వేద పద్దతుల ద్వారా తయారుచేసిన వస్తువుల పై ఆధారపడి జీవనం సాగించేవారు. వాటిలో చాలా గొప్పదనం ఉందని గట్టిగా నమ్మాడు. ఆ వస్తువులు, ఇప్పుడు మార్కెట్ లో ఉన్న బహుళజాతి కంపెనీల వివిధ వస్తువుల కంటే చాలా మంచివని భావించాడు. తన ఆలోచనకు ఊపిరి పోసేలా ఆయుర్వేద పద్ధతులని ఆధారం చేసుకొని తయారయ్యే వస్తువులకు అనుగుణంగా ఒక వ్యాపార సూత్రాన్ని రూపొందించి, దానిని అమలుపరిచాడు.

7.

7. "పోరాటంలో పై చేయి సాధించు"

మనం ఎప్పుడూ మన పోరాటంలో పై చేయి సాధించాలి. అప్పుడే దృష్టి మన జీవితంలో ముఖ్యమైన అంశాలు, లక్ష్యాల పై కేంద్రీకృతం అయి ఉంటుంది. బాబా రామ్ దేవ్, ఎప్పుడూ తన జీవితం లో ఎదురయ్యే కష్టాలను అవరోధాలుగా భావించలేదు. మనం కూడా బాబ్ రామ్ దేవ్ లాగ ఎన్నో లక్ష్యాలను నిర్ధేశించుకొని ఆయన నుండి స్ఫూర్తిపొంది ముందుకు సాగాలి.

నిన్ను కృంగదీసేది గాని, నీ ఆత్మ స్త్థెర్యాన్ని దెబ్బతీసేది గాని నీ జీవితం లో ఎదురైనా వాటికి నువ్వు తలవంచకు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Life Lessons Of Baba Ramdev That Motivate Us

    Wondering what Baba Ramdev has done to achieve success? Check out his secret…
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more