ప్రస్తుతం సమాజం ఎంత విచిత్రంగా ప్రవరిస్తుందో చూడండి

Written By:
Subscribe to Boldsky

మనం జీవితానికి సంబంధించిన చాలా అంశాలతో పాటు... ప్రస్తుతం సమాజం ఎలాంటి తోవలో నడుస్తుందనే అంశాలను ప్రతిబింబిస్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కొందరు పోస్ట్ చేస్తుంటారు. ఈ ఫొటోలు మనకు చాలా విషయాలే చెబుతాయి. వీఆర్ ఎల్ గాడ్ అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని పోస్ట్ లు అవి అందించే సందేహాలు మీరూ చూడండి.

కండోమ్ వాడారు.. అయినా?

కండోమ్ వాడారు.. అయినా?

ఆ భార్యాభర్తలిద్దరూ తమకిప్పుడే పిల్లలు వద్దనుకున్నారు. అందుకే గర్భనిరోధక సూత్రాలు పాటించారు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుడితే ఆఎంజాయ్ మిస్ అయిపోతామని వారు సెక్స్ సమయంలో కండోమ్స్ వాడారు. కానీ ఫలితం లేదు. ఆమె గర్భవతి అయ్యింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రాబ్లం తాము వాడినా కండోమ్స్ వల్ల వచ్చిందా? లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అని ఆ తండ్రి సతమతమవుతున్నాడు.

ఆర్ట్ చెప్పే విషయాలెన్నో

ఆర్ట్ చెప్పే విషయాలెన్నో

ఆర్ట్ అంటే కేవలం బాహ్య సౌందర్యమే కాదు. లోపల ఉన్న అందాల్ని సమాజానికి చూపెడుతుంటారు కొందరు. అయితే సమాజానికి అది అసభ్యంగా ఉండొచ్చుగానీ కళకారుడు మాత్రం తన కళ ద్వారా ఒక సందేశాన్ని పంపిస్తున్నాడనుకుంటాడు. కళాతాక్మంగా ఆలోచించేవారే ఇలాంటి వాటిని అర్థం చేసుకోగలరంటారు కొందరు కళాకారులు.

ఎప్పటికైనా ఇలా జరుగుతుందేమో

ఎప్పటికైనా ఇలా జరుగుతుందేమో

మనుషులుండే ఈ భూమిపైకి ఎప్పటికైనా ఎలియన్స్ వచ్చే అవకాశం ఉందని చాలానే వార్తలు వినపడుతుంటాయి. ఒకవేళ వారు ఈ భూమిపైకి వచ్చి మనల్ని సర్వ నాశనం చేస్తే ఇప్పుడు మనం జంతువుల్ని ఏవిధంగా అయితే జూలో పెట్టి సరదా కోసం చూస్తూ ఉంటామో.. అలాగే వారు కూడా మనల్ని జూలో పెట్టి చిత్ర హింసలు చేస్తూ ఇలా ఫొటోలు దిగుతారేమో.

శృంగారానికే ప్రాధాన్యం

శృంగారానికే ప్రాధాన్యం

ఈ ప్రపంచంలో ప్రేమ ఎంతో విలువైనది. కానీ ఇప్పుడు మాత్రం ప్రేమ అంటే సెక్స్ అనుకుంటున్నారు కొందరు జనాలు. మగవారు స్కలించే వీర్యం కాదు ప్రేమ.. ఆడవారు అనుభవించే శృంగారం కాదు ప్రేమంటే.

రెండు హృదయాల మధ్య ఉండే బంధాన్ని తెలిపేది మాత్రమే ప్రేమ. ఇప్పటి జనరేషన్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రేమ

ప్రేమ

నిజమైన ప్రేమ ప్రస్తుత కాలంలో చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. నిజంగా ప్రేమించిన వారు అన్నీ అవస్థలే పడాల్సి వస్తోంది. ప్రేయసి.. ప్రేమికుడిని మోసం చేయడమో లేదంటే.. ప్రేయసిని ప్రేమికుడు మోసం చేయడమో జరుగుతూ ఉంది.

అలాంటి వాళ్లు అందగత్తెలా?

అలాంటి వాళ్లు అందగత్తెలా?

ఇప్పుడు ప్రతి అమ్మాయి జీరో సైజ్ కు వెళ్లాలనుకుంటుంది. తినితినక... ఏవేవో మందులు ఉపయోగించి స్లిమ్ గా మారుతున్నారు నేటి మహిళలు. మరి అది అందమా? అలాంటివారే ఫ్యాషన్ కు పని కొస్తారంట. సహజసిద్ధంగా అందంగా ఉండే అమ్మాయిలను అందమైన అమ్మాయిలుగా పేర్కొనడం లేదు నేటి ఫ్యాషనబుల్ ప్రపంచం.

వక్షోజాలను పెంచుకోవడం

వక్షోజాలను పెంచుకోవడం

ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు రొమ్ము పెరుగుద‌ల‌కోసం ఇంప్లాంట్స్ చేయించుకుంటున్నారు. వక్షోజాలు భారీగా పెరగాలని, బాగా లావుగా కనపడాలని చాలామంది అమ్మాయిలు పరితపిస్తున్నారు. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనేది ఇప్పుడు పెరిగిపోతుంది. ఒకప్పుడు ఈ అవయవానికి ఎంతో ప్రాధాన్యం ఉండేది. పిల్లలకు పాలిచ్చే పవిత్రమైన పార్ట్ ఇది. ఇప్పుడిది ఆడవారికి సెక్సీ పార్ట్ గా మారింది.

డబ్బున్నోడిదే రాజ్యం

డబ్బున్నోడిదే రాజ్యం

ప్రస్తుతం ఎందులోనైనా డబ్బున్నోడిదే రాజ్యం. చదువులో కూడా ప్రతిభావంతులకు స్థానం లేకుండా చేస్తున్నారు. డబ్బున్నోళ్లు కార్పొరేట్ విద్యాసంస్థల్లో సీట్లు కొని ప్రతిభావంతులను దెబ్బతీస్తున్నారు.

సమాజం

సమాజం

ఈ సమాజం ఎవర్నీ వదిలిపెట్టదు. మంచోడిపై కూడా మచ్చ వేస్తుంది. చేయని తప్పును కూడా చేసినట్లు చిత్రీకరిస్తుంది. ప్రతి ఒక్కరిని ఎదుర్కొనే మనోధైర్యం మీకు ఉండాలి. అలాంటప్పుడే మీరు ఈ ప్రపంచంలో మనుగడ సాధించగలరు. లేదంటే మనిషి రూపంలో ఉండే కొన్ని కుక్కులు మీ వెంటపడి మిమ్మల్ని ఈ సమాజం నుంచి తరిమే అవకాశం ఉంది.

ఇలాంటి సాయం ఎందుకు?

ఇలాంటి సాయం ఎందుకు?

కొందరు జనాలు నీకు సాయం చేస్తున్నట్లు, నీపై చాలా ప్రేమ ఉన్నట్లు నటిస్తారు. కానీ ఎలాంటి సాయం చేయరు. అందరి ముందు మాత్రం నీపై కపట ప్రేమ చూపిస్తారు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆదుకోరు. అలాంటి వారిని ముందే కనిపెట్టు. వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదకరమే. అలాంటి దుష్టులకు దూరంగా ఉండడమే చాలా మంచిది.

తండ్రి నుంచి జ్ఞానం.. తల్లి నుంచి ప్రేమ

తండ్రి నుంచి జ్ఞానం.. తల్లి నుంచి ప్రేమ

తండ్రి నుంచి జ్ఞానం.. తల్లి నుంచి ప్రేమను ప్రతి పిల్లలు పొందుతారు. పిల్లలకు చిన్నతనం నుంచి వారి తల్లిదండ్రులే గురువులు. వారి వల్ల వారు ప్రేరణ పొందుతారు. సమాజంలో రాణించడానికి కావాల్సిన మేధస్సు మొత్తం తల్లిదండ్రుల ద్వారానే పిల్లలు పొందుతారు.

All images source :https://www.instagram.com/vrlgod/?hl=en

English summary

interesting posts from viral god instagram account

interesting posts from viral god instagram account