For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాకీచాన్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు

చాలామంది స్టార్స్ జీవితాల్లో అన్నీ కష్టాలే ఉంటాయి. అలాగే జాకీచాన్ జీవితంలోనూ ఎన్నో కష్టాలున్నాయి. కానీ వాటన్నింటిని ఎదురించి తనకంటూ ప్రపంచస్థాయిలో ఒక స్థానం సంపాదించుకున్న హీరో ఇతను.

|

చాలామంది స్టార్స్ జీవితాల్లో అన్నీ కష్టాలే ఉంటాయి. అలాగే జాకీచాన్ జీవితంలోనూ ఎన్నో కష్టాలున్నాయి. కానీ వాటన్నింటిని ఎదురించి తనకంటూ ప్రపంచస్థాయిలో ఒక స్థానం సంపాదించుకున్న హీరో ఇతను. వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న జాకీచాన్ జీవితం కూడా సిల్వర్ స్పూన్ తో ప్రారంభంకాలేదు.

చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరికి అతని అనుకున్న స్థానానికి ఎదిగాడు. జాకీచాన్ ఒక నటుడుగా కాక ఓ స్టార్‌గా హాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. ప్రేక్షకుల నాడీని పట్టుకున్న హీరో ఇతను. ఓవైపు ఫైట్స్, మరోవైపు నవ్వించే స్కిట్స్ చేసినట్లుగా ఆయన ఫైట్స్ కంపోజ్ చేసేవారు. ఈ జోనర్ ఆయనకు అన్ని విధాలా గుర్తింపు తెచ్చింది. ఎన్నో రికార్డులకు కేరాఫ్ జాకీచాన్. ఇలాంటి జాకీచాన్ గురించి తెలియని విషయాలు కొన్ని మీకోసం..

పేద కుటుంబంలో పుట్టారు

పేద కుటుంబంలో పుట్టారు

1954 ఏప్రిల్ 7వ తేదీన ఒక పేద కుటుంబంలో పుట్టాడు జాకీచాన్. అతడు పట్టినప్పుడు హాస్పిటల్ లో డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉన్నారు ఆయన తల్లిదండ్రులు. కాంగ్‌లో పుట్టిన ఆయన పెద్దగయ్యాక ఆ దేశానికే ఒక రేంజ్ లో గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన తండ్రి ఓ హోటల్‌లో వంటవాడిగా పనిచేసేవారు.జాకీచాన్ తల్లి కూడా హోటల్‌లో హౌస్‌కీపింగ్ చేసేవారు.

జాకీచాన్ ఎక్కువ చదువుకోలేదు

జాకీచాన్ ఎక్కువ చదువుకోలేదు

జాకీచాన్ పెద్దగా చదువుకోలేదు. హాంగ్‌కాంగ్‌లో పుట్టిన చాన్ అసలు పేరు జాన్ కాంగ్ సాంగ్. చిన్నప్పటినుంచి అతి చురుకుగా ఉండటంతో తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు అతడిని పావొ-పావొ అని ముద్దుగా పిలిచేవారు. చైనీస్‌లో దాని అర్థం ఫిరంగి. ఆ తర్వాత అతని కుటుంబం సభ్యులు పొట్టచేతబట్టుకుని ఉపాధి కోసం ఆస్ట్రేలియాకు వలసవెళ్లారు. అక్కడ కూలీలు చాన్‌ను జాకీ ఆప్యాయంగా పిలిచేవారు. చివరకు అదే పేరు విశ్వవ్యాప్తమైంది.

మొదట సర్కస్ కంపెనీల్లో పని చేశాడు

మొదట సర్కస్ కంపెనీల్లో పని చేశాడు

జాకీచాన్ తర్వాత చైనీస్ డ్రామా అకాడమీలో చేరారు. అక్కడ 24/ 7 అన్నట్లుగా పని చేసేవారు. చైనా ఒపెరా మాస్టర్ యూజిమ్ యాన్ నేతృత్వంలో చాలా విద్యలు నేర్చుకున్నాడు. కుంగ్‌ఫూ, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో ఆరితేరాడు. ఆయన నేర్చుకున్న విద్యలోనే వైవిధ్యాన్ని చూపడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. సర్కస్ కంపెనీల్లో వర్క్ చేశాడు. తర్వాత స్టంట్‌మెన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చకున్నాడు. ఆ క్రమంలో గోల్డెన్ హార్వెస్ట్ కంపెనీతో జాకీచాన్ పని చేయడానికి అంగీకరించాడు.

1971లో బ్రూస్‌లీ నటించిన ఫస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఎంటర్‌ది డ్రాగన్ చిత్రాల్లో హీరోతో ఢీకొనే ఫైటర్‌గా నటించాడు. విల్లికచాన్ రూపొందించే చిత్రాలలో కూడా నటించడం ప్రారంభించాడు. మిలియనీర్ డైరెక్టర్‌లో బ్రూస్‌లీకి మోడల్‌గా నటించాడు. బికమ్ ఏ డ్రాగన్ చిత్రాన్ని మళ్లీ నిర్మించే ప్రయత్నం చేశాడు. న్యూ ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ (1976) చిత్రాన్ని తన స్టైల్లో రూపొందించాడు. షావులిన్ వుడెన్ మ్యాన్, కిల్లర్ మెటియోర్, మ్యాగ్నిఫియెంట్ బాడీగార్డ్స్ చిత్రాలను తన స్టైల్లో రూపొందించాడు. స్నేక్ ఇన్ ది ఈగిల్ షాడో అనే సినిమా జాకీచాన్ పేరును మారుమోగించింది.

ఎన్ని దెబ్బలు తగిలినా పట్టించుకోడు

ఎన్ని దెబ్బలు తగిలినా పట్టించుకోడు

ఆయన జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలనే కాదు ఒంటికి తగిలిన దెబ్బలను కూడా పట్టించుకునేవాడు కాదు. మూవీల్లో రిస్కీ షాట్స్‌ లలో నటించేటప్పుడు ఎన్ని దెబ్బలు తగిలినా భయపడేవాడు కాడు. ఒసారి యాక్సిడెంట్ అయి రక్తం పోతూనే ఉంది. కానీ షూటింగ్‌ ను కొనసాగింపజేశారు జాకీచాన్. ది మాట్రిక్స్ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చింది.

జాన్ లీన్ తో పెళ్లి

జాన్ లీన్ తో పెళ్లి

జాకీచాన్ 1982లో జాన్‌లీన్ అనే తైవాన్ నటిని వివాహం చేసుకున్నారు. అయితే ఈ మధ్య ఆయన పెళ్లి గురించి ఒక వ్యాఖ్య చేశారు. తన పెళ్లి బలవంతంగా జరిగిందన్నారు. ఆ తర్వాత తమకు కొడుకు జాయ్‌సీ పుట్టాడన్నారు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేకుండా జరిగిందని పేర్కొన్నారు. దానికి కారణం పెళ్లికి ముందే లిన్ గర్భిణీకావడమేనన్నారు. లిన్ గర్భవతి అవుతుందని.. తమకు జాయ్‌సీ పుడతాడని తాను ఊహించలేదన్నారు. లాస్‌ ఏంజిల్స్‌లోని ఓ కాఫీషాప్‌లో తన పెళ్లి రహస్యంగా జరిగిందని పేర్కొన్నారు.

సూదులంటే చాలా భయం

సూదులంటే చాలా భయం

అరివీర భయంకర సన్నివేశాల్లో డూప్ లేకుండా సాహసకృత్యాలు చేసే జాకీచాన్‌ను రెండు అంశాలు భయపెడతాయట. సూదులన్నా, బహిరంగంగా మాట్లాడటమన్నా ఆయనకు చచ్చేంత భయమట.

చాలా భాషలు వచ్చు

చాలా భాషలు వచ్చు

జాకీచాన్ బహుభాషా కోవిదుడు. ముఖ్యంగా ఏడు భాషల్లో నిష్ణాతుడు. కంటోనీస్, మాండరిన్, చైనీస్, జపనీస్, తైవానీస్, జర్మన్, ఇంగ్లీష్, కొరియన్, థాయ్, అమెరికన్ సైన్ లాంగ్వేజెస్ వచ్చు. చాలా సినిమాలకు పాటలు పాడాడు. ఆల్బమ్స్ రూపొందించాడు. చాన్ కార్టూన్ సినిమాలకు గాత్రం ఇచ్చాడు. కొన్ని కార్టూన్ సినిమాల్లో ఆయన బంధువుల పాత్రలకు వారిచేతే డబ్బింగ్ చెప్పించాడు.

సంగీతమంటే బాగా ఇష్టం

సంగీతమంటే బాగా ఇష్టం

చిన్నతనంలోనే ఓపెరా స్కూల్‌లో సంగీత పాఠాలను నేర్చుకున్నాడు జాకీచాన్. మంచి స్వరం ఉన్న గాయకుడిగా హాంగ్‌కాంగ్‌ లో మంచి గుర్తింపు పొందాడు. చాలా దాదాపు 20 ఆల్బమ్స్ స్వీయ సంగీతంలో విడుదల చేశాడు. జపాన్, తైవాన్, మాండారిన్ దేశాలలో ఆయనకు సంగీత అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయన రూపొందించిన అనేక బాణీలను చాలామంది తమ అమ్యూజిమెంట్ పార్క్‌లలో, క్లబ్‌లలో ఉపయోగించారు.

ఇండియా అంటే చాలా ఇష్టం

ఇండియా అంటే చాలా ఇష్టం

జాకీచాన్‌ కు మన ఇండియా అంటే చాలా ఇష్టం. మన బాలీవుడ్ హీరోలతో ఆయనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. హీరో సల్మాన్ ఖాన్ తో ఆయనకు మంచి స్నేహం ఉంది. మల్లికాషెరావత్‌ తో కలసి ఆయన ద మిత్ మూవీలో నటించారు. సోనుసూద్, దిషాపటాని, అమర్ దస్తూర్, ఆరిఫ్ రెహ్మాన్‌ లతో కలసి కూడా ఆయన నటించారు. మన నటుల గురించి ఎన్నో సార్లు ఎన్నో సమావేశాల్లో మెచ్చకున్నాడు. పొగడ్తల వర్షం కురిపించాడు.

సెక్స్ సినిమాల్లో నటించాడంట

సెక్స్ సినిమాల్లో నటించాడంట

మనందరికీ తెలిసిన ఈ జాకీచాన్ ఒకప్పుడు సెక్స్ సినిమాల్లో నటించేవాడంట.1970 లలో సినిమాల్లోకి రాకముందు కుటుంబ పోషనార్ధం వేరే ఉద్యోగం దొరక్క ఇలా పోర్న్ స్టార్ అవతారం ఎత్తాడంట జాకీచాన్. అయితే ఈ విషయాన్ని ఆయన ఎప్పుడు బహిరంగంగా మాత్రం పేర్కొనలేదు.

English summary

life story of jackie chan

we are here to share some of the facts about Jackie Chan's life and his other unknown facts.
Desktop Bottom Promotion